From Wikipedia, the free encyclopedia
పరకాల ప్రభాకర్ ఒక తెలుగు రాజకీయ నాయకుడు, వ్యాఖ్యాత, విశ్లేషకుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి స్థాయి గల "కమ్యూనికేషన్స్ సలహాదారు" గా పనిచేసాడు. రాజకీయ వ్యాఖ్యాతగా, ఆంధ్రప్రదేశ్ లోని టెలివిజన్ ఛానళ్లలో రాజకీయ విశ్లేషకునిగా గుర్తింపు పొందాడు. ప్రజారాజ్యం పార్టీకి అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ గా పనిచేసాడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. "విశాలాంధ్ర మహాసభ" కు వ్యవస్థాపక కార్యదర్శి.[1]
పరకాల ప్రభాకర్ | |
---|---|
జననం | నరసాపురం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1959 జనవరి 2
జాతీయత | భారతీయుడు |
విద్య | Ph.D |
విద్యాసంస్థ | లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ |
వృత్తి | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి "సమాచార సలహాదారు" |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రాజకీయ వ్యాఖ్యాత |
జీవిత భాగస్వామి | నిర్మలా సీతారామన్ |
పిల్లలు | 1 పరకాల వాజ్ఞ్మయి |
తల్లిదండ్రులు | పరకాల శేషావతారం, మాజీ మంత్రి పరకాల కాళికాంబ, మాజీ శాసనసభ్యురాలు |
ప్రభాకర్ 1986లో నిర్మలా సీతారామన్ ను వివాహమాడాడు. వారికి ఒక కుమార్తె పరకాల వాజ్ఞ్మయి. అతడి తల్లి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శాసనసభ్యురాలిగా పనిచేసింది. తండ్రి పరకాల శేషావతారం 1970లలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసాడు. అతడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చదివాడు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో మాస్టర్ డిగ్రీని పొందాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.