పంగా 2020లో విడుదలైన హిందీ సినిమా. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు అశ్విని అయ్యర్‌ తివారీ దర్శకత్వం వహించింది. కంగనా రనౌత్, జస్సీ గిల్‌, రిచా చద్దా, నీనా గుప్తా, పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 24 జనవరి 2020న విడుదలైంది.[3]

త్వరిత వాస్తవాలు పంగా, దర్శకత్వం ...
పంగా
Thumb
దర్శకత్వంఅశ్విని అయ్యర్‌ తివారీ
రచననిఖిల్ మెహ్రోహ్ట్రా
అశ్విని అయ్యర్‌ తివారీ
స్క్రీన్ ప్లేనితీష్ తివారి
నిర్మాతఫాక్స్ స్టార్ స్టూడియోస్
తారాగణంకంగనా రనౌత్, జస్సీ గిల్‌, రిచా చద్దా, నీనా గుప్తా, పంకజ్‌ త్రిపాఠి
ఛాయాగ్రహణంజయ్ ఐ. పటేల్
కూర్పుబల్లు శాలుజా
సంగీతంపాటలు:
శంకర్-ఎహసాన్-లాయ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్:
సంచిత్ బాళ్హరా
అంకిత్ బాళ్హరా
నిర్మాణ
సంస్థ
ఫాక్స్ స్టార్ స్టూడియోస్
పంపిణీదార్లుఫాక్స్ స్టార్ స్టూడియోస్
విడుదల తేదీ
24 జనవరి 2020 (2020-01-24)
సినిమా నిడివి
131 నిమిషాలు
దేశంIndia
భాషHindi
బడ్జెట్29 కోట్లు[1]
బాక్సాఫీసు41.71 కోట్లు[2]
మూసివేయి

కథ

జయ నిగమ్‌ (కంగనా రనౌత్‌) జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణి. పెళ్ళికి ముందు జాతీయ అవార్డు అందుకొని ప్రజల చేత నీరాజనాలు అందుకున్న జయ పెళ్లై, ఓ బిడ్డకు జన్మనిచ్చాక ఆమెకు గుర్తింపు కరువవుతుంది. కానీ జయకి మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఛాంపియన్‌షిప్ సాధించాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం తన కుటుంబం కూడా సపోర్ట్ చేస్తుంది. దానికోసం ఆమె ఎన్ని ఇబ్బందులు పడింది? జయ అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను అందుకోగలిగిందా? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4][5]

నటీనటులు

  • కంగనా రనౌత్ - జయ నిగమ్‌ , కబడ్డీ క్రీడాకారిణి
  • జస్సీ గిల్‌ - ప్రశాంత్ సచ్ దేవా , జయ నిగమ్‌ భర్త, రైల్వే ఉద్యోగి
  • రిచా చద్దా - మీనాల్ "మీను" సింగ్, జయ స్నేహితురాలు
  • నీనా గుప్తా - రచన నిగమ్, జయ తల్లి
  • పంకజ్‌ త్రిపాఠి
  • యాగ్య భాసిన్
  • మేఘ బర్మన్
  • రాజేష్ తైలంగ్
  • స్మితా తాంబే
  • లావిష్ అనిల్ జైన్
  • మనోజ్ జాదవ్
  • పీయూష్ సీత

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.