న్యాయం కావాలి

From Wikipedia, the free encyclopedia

న్యాయం కావాలి

న్యాయం కావాలి 1981 లో ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో చిరంజీవి, రాధిక ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ క్రాంతి చిత్ర పతాకంపై, క్రాంతి కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు . డీ కామేశ్వరి నవల "కొత్త మలుపు"ఆధారంగా ఈ చిత్రం నిర్మించారు. దీనిని మలయాళ భాషలో తాళం తెట్టియ తరత్తు పేరుతో పునర్మించారు.

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, కథ ...
న్యాయం కావాలి
(1981 తెలుగు సినిమా)
Thumb
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
కథ డి. కామేశ్వరి నవల "కొత్తమలుపు"
తారాగణం శారద ,
చిరంజీవి,
రాధిక,
జగ్గయ్య
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు సత్యానంద్
నిర్మాణ సంస్థ శ్రీక్రాంతి చిత్ర
భాష తెలుగు
మూసివేయి

కథ

బెంచి గుమాస్తా విశ్వనాథం కూతురు భారతి చూడముచ్చటగా ఉంటుంది. లాయర్ దయానిధి కొడుకు సురేష్ ఆ అమ్మాయిని చూసి, వెంటబడి, ప్రేమించినట్లు నటించి, ఆ అమ్మాయి చేత ప్రేమింపజేసుకుంటాడు. అతడిది నిజమైన ప్రేమ అని నమ్మిన భారతి అతడికి మనసుతో పాటు తనువు కూడా అర్పిస్తుంది. తల్లిదండ్రుల మాటలను కూడా లెక్కచేయదు. నెలతప్పుతుంది. తీరా పెళ్లిమాట ఎత్తితే సురేష్ నవ్వేస్తాడు. ప్రేమ వేరని, పెళ్లి వేరని అంటాడు. భారతి లాయర్ దయానిధి వద్దకు వెళ్ళి నిలదీస్తుంది. దయానిధి ఆమెను అవమానిస్తాడు. అబార్షన్ చేయించుకోమని తండ్రి ఇచ్చిన సలహాను భారతి త్రోసిపుచ్చుతుంది. తనను మోసం చేసిన సురేష్‌ను కోర్టుకు ఈడ్చి నవ్వులపాలు చేయాలని నిశ్చయించుకుని లాయర్ శకుంతల దగ్గరకు వెళుతుంది. లాయర్ శకుంతల భారతి తరఫున కోర్టులో వాదిస్తున్న సమయంలో ఒక కొత్త సంగతి బయటపడుతుంది[1].

నటీనటులు

సాంకేతికవర్గం

పాటలు

  • అమ్మో నాకు భయం, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన: వేటూరి సుందరరామమూర్తి
  • ఈరోజే ఆదివారము , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల, రచన: వేటూరి
  • బుడి బుడి బిడియంగా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన:వేటూరి
  • న్యాయం కావాలి స్త్రీలకు న్యాయం జరగాలి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన:వేటూరి
  • అబలను కాను సబలని స్త్రీ విజయం, రచన: వేటూరి, గానం.పి . సుశీల కోరస్
  • యత్ర నార్యస్తు పుజ్యంతే, రచన:వేటూరి, మనువు శ్లోకం.

మూలాలు

బయటిలింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.