ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం మండల పట్టణం From Wikipedia, the free encyclopedia
నరసాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం. ఇక్కడ గోదావరి నదీతీరం, ఎంబర్ మన్నార్ దేవాలయం, దగ్గరలోగల సముద్రతీరం పర్యాటక ఆకర్షణలు.
పట్టణం | |
Coordinates: 16.43°N 81.68°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి జిల్లా |
మండలం | నరసాపురం మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 11.32 కి.మీ2 (4.37 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 58,770 |
• జనసాంద్రత | 5,200/కి.మీ2 (13,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1041 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8814 ) |
పిన్(PIN) | 534275 |
Website |
దీని అక్షాంశ రేఖాంశాలు 16° 27' 0" ఉత్తరం, 81° 40' 0" తూర్పు. జిల్లా కేంద్రమైన భీమవరంకు ఆగ్నేయంలో 31 కి.మీ దూరంలో ఉంది.
చరిత్రలో నరసాపుర పేట అనే వాడుక ఉంది. 'నృసింహపురి', 'అభినవభూతపురి' అన్న పేర్లు కూడా కొన్ని (సాహితీ) సందర్భాలలో వాడుతారు. 1580 నుంచి 17వ శతాబ్ది మధ్యభాగం వరకు నరసాపురం నౌకా నిర్మాణ పరిశ్రమకు స్వర్ణయుగం. ఎగువ గోదావరి చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం నుంచి కొట్టిన కలప నౌకా మార్గంలో గోదావరిలో నరసాపురం చేరేది. ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతంలోని అడవులు, గోదావరి లంకల్లో పెరిగిన వృక్ష సంపద వంటివి నరసాపురం నౌకా నిర్మాణానికి కలప దొరికే వనరులుగా నిలిచాయి. దక్కన్ ప్రాంతంలో ఇనుం లభ్యత తక్కువ ఉండడంతో ఇక్కడి నౌకా నిర్మాణంలో మేకుల వాడకం తక్కువగా ఉండేది. కానీ నరసాపురం ప్రాంతానికి మాత్రం ఆంధ్ర ప్రాంతంలోని విస్తారమైన ఇనుప ఖనిజం వల్ల ఆ సమస్య ఉండేది కాదు. కలప, ఇనుం, ఇతర అవసరమైన ముడి సరుకులు ఈ ప్రాంతంలో లభిస్తూండడం ఇక్కడ పరిశ్రమ ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది.[2][3] వీటితో పాటు చవకగా పనిచేసేందుకు మనుషులు దొరుకుతూండడం కూడా ఈ ప్రాంతంలో నౌకా నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడింది. నరసాపురంలో భారీ నౌకల నిర్మాణం సాగేది. ఆ నిర్మాణమైన నౌకలను ఎగువన వరదలతో గోదావరి పోటు మీదున్న సమయంలో నదీ మార్గంలోంచి సముద్రంలోకి ప్రవేశపెట్టేవారు.[4] నరసాపురంలో తయారైన నౌకలను ప్రధానంగా మచిలీపట్నం నౌకాశ్రయానికి చెందిన వ్యాపారులు వాడేవారు. ఈ నౌకలు బంగాళాఖాతం నుంచి ఎర్ర సముద్రం వరకూ వాణిజ్యం కోసం ప్రయాణించేవి. 1670ల నుంచి పోర్చుగీసు నౌకలు భారతీయ వాణిజ్యంలో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తూ పోవడంతో డిమాండ్ పడిపోయి ఇక్కడి నౌకా నిర్మాణ పరిశ్రమ క్రమేపీ కనుమరుగైంది.[2]
2011 జనగణన ప్రకారం, పట్టణ జనాభా 58,870.
2001 జనాభా లెక్కల ప్రకారం నరసాపురం పట్టణం జనాభా 58,508. ఇందులో పురుషుల సంఖ్య 49%, స్త్రీల సంఖ్య 51% ఉన్నారు. నరసాపురం అక్షరాస్యత 75% (దేశం సగటు అక్షరాస్యత 59.5%). పురుషులలో అక్షరాస్యత 78%, స్త్రీలలో 71%. మొత్తం పట్టణ జనాభాలో 11% వరకు 6 సంవత్సరాల లోబడిన వయసువారు. జనాభా ప్రధానంగా హిందువులు ఉన్నారు గాని ముస్లిం, క్రైస్తవ, జైన మతాలవారు కూడా గణనీయంగా ఉన్నారు.
నరసాపురం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
జాతీయ రహదారి 216 పై ఈ పట్టణం ఉంది. ఇక్కడ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ డిపో ఉంది. భీమవరం - నిడదవోలు లూపు లైనులో భీమవరం - నరసాపురం శాఖా మార్గంలో ఇది అంతిమ రైలునిలయం.
వరి వ్యవసాయం, చేపల పెంపకం
నరసాపురం లేసు ఉత్పాదనలకు ప్రసిద్ధి చెందింది. పట్టణంలో సుమారు 50 లేసు ఎగుమతిదారులున్నారు. పట్టణంలోను, దాని చుట్టుప్రక్కల సీతారాంపురం, పాలకొల్లు, వెంకటరాయపాలెం, అంతర్వేది. రాయపేట, మొగల్తూరు వంటి పట్టణాలు, గ్రామాలలోను 2 లక్షల పైగా మహిళలకు ఇది జీవనాధారమైన వృత్తిగా ఉంది. డోలీలు, అలంకరణ సామాగ్రి, వస్త్రాలు, టేబుల్మ్యాట్లు వంటి అల్లికలను తయారు చేసే ఈ పరిశ్రమ 168 సంవత్సరాలనుండి ఇక్కడ నడుస్తుంది. 1844లో ఇక్కడికి సేవా కార్యక్రమాలకోసం వచ్చిన మాక్రియా అనే స్కాటిష్ యువతి ఇక్కడి గృహిణులకు ఈ అల్లికను నేర్పింది. అప్పటి నుండి ఈ నైపుణ్యత తరతరాలుగా ఇక్కడ కుటీర పరిశ్రమగా వృద్ధిచెందింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.