ఆఫ్రికాలో ఒక దేశం From Wikipedia, the free encyclopedia
టోగో అధికారికంగా " టోగోలీసు రిపబ్లికు " పశ్చిమ ఆఫ్రికాలో ఒక దేశం. పశ్చిమసరిహద్దులో ఘానా, తూర్పు సరిహద్దులలో బెనిన్ ఉత్తరసరిహద్దులో బుర్కినా ఫాసో ఉన్నాయి. సార్వభౌమ దేశం అయిన టోగో దక్షిణప్రాంతంలో గినియా గల్ఫు వరకు విస్తరించింది. ఇక్కడే రాజధాని లోమే ఉంది. టోగో 57,000 చ.కి.మీ (22,008 చదరపు మైళ్ళు)ఉంది. ఇది ఆఫ్రికాలోని అతి చిన్న దేశాలలో ఒకటిగా ఉంది. దేశంలో సుమారు 7.6 మిలియన్ల జనాభా ఉంది.
Togolese Republic République togolaise (French) | |
---|---|
గీతం: "Terre de nos aïeux" (French) (English: "Land of our Forefathers") | |
Location of టోగో (dark blue) in the African Union (light blue) | |
రాజధాని and largest city | Lomé 6°7′N 1°13′E |
అధికార భాషలు | French |
గుర్తించిన జాతీయ భాషలు | Ewe • Kabiyé |
జాతులు | 99% Ewe, Kabye, Tem, Gourma, and 33 other African groups 1% European, Syrio-Lebanese[2] |
పిలుచువిధం | Togolese |
ప్రభుత్వం | Unitary dominant-party presidential republic |
• President | Faure Gnassingbé |
• Prime Minister | Komi Sélom Klassou |
శాసనవ్యవస్థ | National Assembly |
Independence | |
• from France | 27 April 1960 |
విస్తీర్ణం | |
• మొత్తం | 56,785 కి.మీ2 (21,925 చ. మై.) (123rd) |
• నీరు (%) | 4.2 |
జనాభా | |
• 2017 estimate | 7,965,055[2] (99th) |
• 2010 census | 6,337,000 |
• జనసాంద్రత | 125.9/చ.కి. (326.1/చ.మై.) (93rde) |
GDP (PPP) | 2017 estimate |
• Total | $12.433 billion[3] (150th) |
• Per capita | $1,468[3] |
GDP (nominal) | 2017 estimate |
• Total | $4.797 billion[3] |
• Per capita | $621[3] |
జినీ (2011) | 46[4] high |
హెచ్‌డిఐ (2017) | 0.503[5] low · 165th |
ద్రవ్యం | West African CFA franc (XOF) |
కాల విభాగం | UTC+0 (GMT) |
వాహనాలు నడుపు వైపు | right |
ఫోన్ కోడ్ | +228 |
ISO 3166 code | TG |
Internet TLD | .tg |
|
11 వ నుండి 16 వ శతాబ్దం వరకు వివిధ తెగలకు చెందిన ప్రజలు అన్ని దిశల నుండి ఈ ప్రాంతంలో ప్రవేశించారు. 16 వ శతాబ్దం నుంచి 18 వ శతాబ్దం వరకు తీర ప్రాంతం ఐరోపావారు వాణిజ్యం కొరకు బానిసలను వెతకటానికి కేంద్రంగా ఉండేది. టోగో, దాని పరిసరప్రాంతాలు "ది స్లేవు కోస్టు" పేరు సంపాదించాయి. 1884 లో టోగోల్యాండు అనే పేరుతో ప్రస్తుత టోగోప్రాంతం జర్మనీ రక్షకప్రాంతంగా ప్రకటించబడింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టోగో పాలన ఫ్రాంసుకు బదిలీ చేయబడింది. 1960 లో టోగో ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందింది.[2] 1967 లో గ్నాసింగ్బే ఇయాడెమా నాయకత్వంలో సైనిక తిరుగుబాటు జరిగిన తరువాత ఆయన కమ్యూనిస్టు వ్యతిరేక, ఏకై పార్టీ దేశానికి అధ్యక్షుడు అయ్యాడు. 1993 లో ఇయాడెమా బహుళపార్టీ ఎన్నికలను ఎదుర్కొంది. ఎన్నికలలో ఇది అక్రమాలకు పాల్పడి అధ్యక్ష పదవిని మూడు సార్లు గెలుచుకుంది. ఆయన మరణం సమయంలో ఇయాడెమా ఆధునిక ఆఫ్రికా చరిత్రలో సుదీర్ఘకాలం అద్యక్షుడుగా పనిచేసిన నాయకుడుగా (38 సంవత్సరాలు) గుర్తింపు పొందాడు.[6] 2005 లో ఆయన కొడుకు ఫోరే గ్నాస్సింగ్బె అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.
టోగో ఒక ఉష్ణమండల, ఉప-సహారా దేశం. దీని ఆర్థిక వ్యవస్థ అధికంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. దేశ వాతావరణం వ్యవసాయపంటలు అభివృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది. అధికారిక భాష ఫ్రెంచి అయినప్పటికీ టోగోలో ముఖ్యంగా అనేక ఇతర భాషలు (ముఖ్యంగా గోబీ కుటుంబానికి చెందిన భాషలు) వాడుకలో ఉన్నాయి. టోగోలో అతిపెద్ద మత సమూహం స్థానిక మతవిశ్వానికి చెందిన ప్రజలు సంఖ్యాపరంగా ఆధిక్యత కలిగి ఉన్నారు. అలాగే గణనీయమైన క్రైస్తవ, ముస్లిం అల్పసంఖ్యాక ప్రజలు ఉన్నారు. టోగో ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికా సమాఖ్య, ఇస్లాం సహకార సంస్థ, సౌత్ అట్లాంటిక్ పీస్ అండ్ కోఆపరేషన్ జోన్, ఫ్రాంకోఫొనీ, ఎకనామికు కమ్యూనిటీ ఆఫ్ వెస్టర్ను ఆఫ్రికా స్టేట్సు వంటి సంస్థలలో సభ్యదేశంగా ఉంది.
టోగో ప్రాంతంలో నివసించిన పురాతన తెగలు మృణ్మయపాత్రలు, ఇనుప ఉపకరణాలు తయారుచేయగలిగిన సామర్ధ్యం కలిగి ఉండేవారని పురావస్తు పరిశోధనలు సూచిస్తున్నాయి. టొగో అనే పేరు ఈవె భాషలో "లాగోనులు నివసించిన భూమి"గా అని అర్ధం. 1490 లో పోర్చుగీసు రాకకు ముందు కాలం గురించి స్పష్టమైన వివరణ లేదు. 11 వ శతాబ్దం నుండి 16 వ శతాబ్దం వరకు వివిధ తెగలు ఈ ప్రాంతంలోకి అన్ని దిశలనుండి ప్రవేశించారు: తూర్పు నుండి ఎవె, పశ్చిమం నుండి మినా, గను. వీరిలో ఎక్కువమంది తీరప్రాంతాలలో స్థిరపడ్డారు.
16 వ శతాబ్దంలో బానిస వాణిజ్యం మొదలైంది. తరువాతి రెండు వందల సంవత్సరాలుగా బానిసల అన్వేషణలో ఐరోపియన్లకు ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. టోగో పరిసర ప్రాంతం "స్లేవు కోస్టు" పేరు సంపాదించింది.
1884 లో టోగోవిల్లేలో రాజు మూడవ మ్లఫాతో ఒక ఒప్పందం మీద సంతకం చేసాడు. తద్వారా జర్మనీ రక్షితప్రాంతం తీరం వెంట భూభాగాన్ని విస్తరించి క్రమంగా దాని నియంత్రణ భూభాగాన్ని పొడిగించింది. జర్మనీ సైనికబలగాలు హింటర్లాండును స్వాధీనం చేసుకుని తరువాత ఫ్రాంసు, బ్రిటనులతో ఒప్పందాలు సంతకం చేసిన తరువాత టోగో సరిహద్దులు నిర్ణయించబడ్డాయి. 1905 లో ఇది టోగోల్యాండు జర్మనీ కాలనీగా మారింది. స్థానిక ప్రజలు పత్తి, కాఫీ, కోకో తోటలలో బలవంతగా పనిచేయాలన్న వత్తిడికి గురైయ్యారు. అలాగే ప్రజలు అధిక పన్నులు చెల్లించవలసిన అగత్యం ఏర్పడింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి రైల్వే, లోమ్మే, పోర్టులు నిర్మించబడ్డాయి. జర్మనులు కోకో, కాఫీ, పత్తి ఉత్పత్తిలో ఆధునిక సాంకేతికతలను ప్రవేశపెట్టి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు.
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో టోగోలాండు మీద ఆంగ్లో-ఫ్రెంచి ఆక్రమణ సాగించి ఆంగ్లో & ఫ్రెంచి కండోమినం ప్రకటించారు. 1916 డిసెంబరు 7 న కండోమినియం కూలిపోయింది. టోగో బ్రిటిషు, ఫ్రెంచి మండలాలుగా విభజించబడింది. 1922 జూలై 20 న " లీగు ఆఫ్ నేషన్సు ఆదేశంతో టోగో పశ్చిమ భాగాన్ని పాలించడానికి బ్రిటను, టొగో తూర్పు భాగాన్ని పాలించడానికి ఫ్రాంసు అనుమతి పొందాయి. 1945 లో ఫ్రెంచి పార్లమెంటుకు మూడు ప్రతినిధులను పంపే హక్కును టోగోకు లభించింది.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఈ ప్రాంతాలు యు.ఎన్. ట్రస్టు భూభాగాలుగా మారాయి. 1957 లో బ్రిటిషు టోగోలాండ్ నివాసితులు కొత్త స్వతంత్ర దేశంగా రూపొందిన ఘనాలో భాగంగా ఉన్న గోల్డ్ కోస్టులో చేరడానికి ఓటు వేశారు. ఫ్రెంచి టోగోల్యాండు 1959 లో ఫ్రెంచి యూనియనులో స్వతంత్రంగా గణతంత్ర రాజ్యంగా మారింది. ఫ్రాన్సు రక్షణ, విదేశీ సంబంధాలు, ఆర్ధిక నియంత్రణలను నియంత్రించే హక్కును నిలుపుకుంది.
1960 ఏప్రెలు 27 న టోగోలిసు రిపబ్లికు ప్రకటించబడింది. 1961 లో తొలి అధ్యక్ష ఎన్నికలలో సిల్వానసు ఒలింపీయో మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికలలో 100% ఓట్లు సాధించాడు. ఎన్నికలను ప్రతిపక్షాలు బహిష్కరించాయి. 1961 ఏప్రెలు 9 లో టోగోలేస్ రిపబ్లికు రాజ్యాంగం స్వీకరించింది. టోగో జాతీయ అసెంబ్లీని " సుప్రీం శాసనసభ " అంటారు.[ఆధారం చూపాలి]
1961 డిసెంబరులో ప్రభుత్వ వ్యతిరేక కుట్రను తయారు చేయాడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టు చేశారు. తరువాత ప్రతిపక్ష పార్టీల రద్దుపై ఒక డిక్రీ జారీ చేయబడింది. ఒలింపియో యునైటెడు స్టేట్సు, గ్రేటు బ్రిటను, జర్మనీలతో సహకారం పొందడం ద్వారా ఫ్రాంసు మీద ఆధారపడటానికి తగ్గించడానికి ప్రయత్నించింది. అల్జీరియా యుద్ధం తర్వాత నిషేధించబడిన ఫ్రెంచి సైనికులు టోగోలేస్ సైన్యంలో స్థానాన్ని పొందేందుకు ప్రయత్నించడాన్ని ఒలింపియా తిరస్కరించాడు. ఈ కారణాలు చివరకు జనవరి 13, 1963 జనవరి 13 న ఒక సైనిక తిరుగుబాటుకు దారితీశాయి. ఆ సమయంలో అతను సెర్జెంట్ గ్నాసింగ్బే ఐడెమా ఆధ్వర్యంలో సైనికుల బృందం చేతిలో ఒలిపియో హత్య చేయబడ్డాడు.[7] టోగోలో అత్యవసర పరిస్థితి ప్రకటించబడింది.
సైన్యం నికోలసు గ్రునిటుజ్కీ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చింది. 1963 మే లో గ్రునిటుజ్కీ రిపబ్లికు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కొత్త నాయకత్వం ఫ్రాంసుతో సంబంధాలు అభివృద్ధి చేసే విధానాన్ని అనుసరించింది. ఆయన ఉత్తర, దక్షిణానికి మధ్య విభజనలను తొలగించడం, కొత్త రాజ్యాంగంను ప్రకటించడం, బహుళ వ్యవస్థను ప్రవేశపెట్టడం లక్ష్యంగా పనిచేసాడు.
సరిగ్గా నాలుగు సంవత్సరాల తరువాత 1967 జనవరి 13 న ఐడెమా గ్నాసింగ్బే గ్రునిజ్కిని రక్తపాతరహిత తిరుగుబాటుతో పదవి నుండి తొలగించి అధ్యక్ష పదవిని సాధించాడు. అతను టోగోలేసు పీపులు " పార్టీ ఆఫ్ ర్యాలీని " సృష్టించాడు. తరువాత ఇతర రాజకీయ పార్టీల కార్యకలాపాలను నిషేధించాడు. 1969 నవంబరులో ఏకపార్టీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఆయన 1979, 1986 లో తిరిగి ఎన్నికయ్యారు. 1983 లో ప్రైవేటీకరణ కార్యక్రమం ప్రారంభించబడింది. 1991 లో ఇతర రాజకీయ పార్టీలు అనుమతించబడ్డాయి . 1993 లో యు.యస్.ఎ. 1993, 1998, 2003 లో ఇయాడమా అధికార స్వాధీనం చేసుకోవడాన్ని వివరిస్తూ, భాగస్వామ్యాన్ని స్తంభింపచేసింది. 2004 ఏప్రిల్ ఏప్రెలులో బ్రస్సెల్సులో ఐరోపా సమాఖ్య, టోగోల మద్య సహకారం పునఃస్థాపించడానికి చర్చలు జరిగాయి.
ఐడెమా గ్నాసింగ్బే 38 సంవత్సరాల తర్వాత 2005 ఫిబ్రవరి 5 న మరణించారు. ఆఫ్రికా దేశాలలో నియంత దీర్ఘకాల ఆధీనతగా భావించబడింది. తన కుమారుడైన ఫోర్రే గ్నాసింగ్బె సైనికాధికారిని తక్షణమే అధ్యక్షుడుగా నియమించడాన్ని ఫ్రాన్సు నుండి మినహా మిగిలిన అంతర్జాతీయ దేశాలు ఖండించారు. సెనెగలుకు చెందిన అబ్యుయులేయ్ వాడే, నైజీరియాలోని ఒలుసగను ఒబాసాన్జో వంటి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఆఫ్రికా నేతలు ఈ చర్యను సమర్ధించిన కారణంగా ఆఫ్రికా సమాఖ్యలో చీలిక ఏర్పడింది.[8]
గ్నాసింగ్బే పదవి నుండి వైదొలిగి ఎన్నికలు నిర్వహించబడ్డాయి. రెండు నెలల తరువాత ఆయన ఎన్నికలలో గెలిచాడు. ప్రతిపక్షం ఎన్నికల ఫలితాలు మోసపూరితంగా ఉన్నాయని ప్రకటించింది. 2005 లో జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం నిబద్ధత గురించి ప్రశ్నలు లేవనెత్తడానికి దారి తీసింది. ఇది ఐరోపా సమాఖ్యతో సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇది 1993 లో టోగో మానవ హక్కుల పరిస్థితుల గురించి ప్రశ్నలు వేసినందుకు సహాయపడింది. అంతేకాక ఐక్యరాజ్య సమితి నివేదిక ఆధారంగా అధ్యక్ష ఎన్నికలలో జరిగిన హింసాకాండలో 400 మంది మరణించారని భావించారు. సుమారుగా 40,000 టోగోలీస్ పొరుగు దేశాలకు పారిపోయారు. 2010, 2015 లో ఫ్యూరు గ్నాసింగ్బె తిరిగి ఎంపిక చేయబడ్డాడు.
2017 చివరిలో టోగోలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు 2005 నాటి ఎన్నికల తరువాత తీవ్రరూపందాల్చాయి. చాలా కాలం అధికారంలో ఉన్న కుటుంబంలో భాగమైన గ్నాసింబెబే రాజీనామా చేయాలని నిరసనకారులు వారు డిమాండు చేసారు. టోగోలేస్ సెక్యూరిటీ దళాల జోక్యంతో సాధించిన ఫలితాన్ని ఐక్యరాజ్యసమితి ఖండించింది. గ్నాసింగ్బే రాజీనామా చేయాలని చెప్పిన తర్వాత గాంబియా విదేశాంగ మంత్రి ఓషినొవ్ దర్బో ఒక సవరణను జారీ చేయాల్సి వచ్చింది.[9]
టోగో వైశాల్యం 56,785 చ.కి.మీ (21,925 చ.మై). ఇది ఆఫ్రికాలో అతి చిన్న దేశాలలో ఒకటి. ఇది దక్షిణసరిహద్దులో బెనిను బైటు, పశ్చిమసరిహద్దులో ఘనా, తూర్పు సరిహద్దులో బెనిన్, ఉత్తరసరిహద్దులో బుర్కినా ఫాసో ఉన్నాయి. టోగో 6 ° నుండి 11 ° ఉత్తర అక్షాంశం, 0 ° నుండి 2 ° తూర్పు రేఖాంశంలో ఉంటుంది.
గినియా గల్ఫులోని టోగో తీరం 56 కి.మీ పొడవు ఉంది. ఇది ఇసుక తీరాలతో ఉన్న లాగూన్లను కలిగి ఉంటుంది. ఉత్తరం ప్రాంతంలో సవన్న ఉంటుంది. టోగోకు దక్షిణప్రాంతంలో సవన్న, వృక్షాలతో నిండిన భూములు ఉంటాయి. ఇవి క్రమంగా విస్తారమైన చిత్తడి నేలలు, మడుగులతో నిండిన సముద్రతీరానికి చేరుకుంటాయి.
దేశంలోని ఎత్తైన పర్వతం మాంట్ అగువు. ఇది సముద్ర మట్టానికి 986 మీ. పొడవు ఉంటుంది. 400 కిలోమీటర్ల పొడవైన మోనో నది దేశంలో అతి పెద్ద నదిగా గుర్తించబడుతుంది. ఇది దేశంలో ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తుంది.
టోగోలో ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. సముద్రతీర ఉష్ణోగ్రతలు 23 °C (73 °F) ఉత్తరప్రాంత ఉష్ణోగ్రతలు 30 °C (86 °F) ఉంటుంది. ఉష్ణమండల సవన్నగా వర్గీకరించబడిన పొడి వాతావరణం నెలకొని ఉంటుంది. దక్షిణప్రాంతంలో రెండు సీజన్లలో వర్షపాతం (మొదటిది ఏప్రెల నుండి జూలై వరకు ఉంటుంది. రెండవది సెప్టెంబరు నండి నవంబరు వరకు ఉంటుంది) ఉంటుంది.
మానవ జనాభా పెరుగుదల వేగవంతమైన అటవీ నిర్మూలనకు దారితీస్తుంది. ఇది అనేక జీవజాతులు క్షీణతకు దరితీసింది. నాలుగు పార్కులు, నిల్వలు ఏర్పాటు చేయబడ్డాయి:అబ్దౌలాయె ఫౌనలు రిజర్వు, ఫజావు మల్ఫకాస్సా నేషనలు పార్కు, ఫోస్సే ఆక్సు లయన్సు నేషనలు పార్కు, కెరాను నేషనలు పార్కు. చాలా తరచుగా కనిపించే జంతువులలో జిరాఫీలు, కేప్ గేదెలు, హైనాలు, సింహాలు ఉన్నాయి. ఏనుగులు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. సాధారణంగా పక్షులు కొంగలు, మరాబౌ కొంగలు అధికంగా కనిపిస్తుంటాయి.
అధ్యక్షుడు 5 సంవత్సరాలకు ఒకసారి సార్వత్రిక ఓటు ద్వారా ఎన్నుకోబడతారు. అధ్యక్షుడు సాయుధ దళాల కమాండరుగా ఉంటాడు. శాసనసభను ప్రారంభించడానికి, పార్లమెటును రద్దు చేసే హక్కును కలిగి ఉంటాడు. అధ్యక్షునికి, ప్రభుత్వానికి సమైక్యంగా కార్యనిర్వాహక అధికారం ఉంటుంది. అధ్యక్షుడి చేత నియమింపబడిన ప్రధాన మంత్రి, ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తాడు.
టోగో ప్రజాప్రభుత్వం విధానానికి మార్పుచెందే ప్రక్రియ నిలిచిపోయింది. కొత్తగా జనించిన ప్రజాస్వామ్య సంస్థలు బలహీనంగా ఉన్నాయి. టోగోను ఏక-పార్టీ వ్యవస్థలో పాలించిన అధ్యక్షుడు గ్నాసిగ్బే ఐడెమా 2005 ఫిబ్రవరి 5 న విదేశీయరక్షణ కొరకు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో (ట్యునీషియాపై ప్రయాణిస్తున్న సమయంలో) గుండెపోటుతో మరణించాడు. టోగోలీ రాజ్యాంగవిధానం అనుసరించి పార్లమెంటు అధ్యక్షుడు "ఫంబరే క్వతారా నట్చాబా " దేశ అధ్యక్షుడిగా చేసి కొత్త అధ్యక్ష ఎన్నికల కొరకు 60 రోజులోపు పిలుపునివ్వాలి. దేశం వెలుపల ఉన్న నట్చాబా పారిసు నుండి ఎయిరు ఫ్రాన్సు విమానంలో తిరిగి వచ్చాడు.[10]
" ఫోర్సెసు ఆర్మీసు టోగోలైసేసు ", టోగోలేసు ఆర్మీ ఫోర్సెసు అనే టోగో సైన్యం అంటారు. దేశం సరిహద్దులను మూసివేసి బెనిను సమీపంలో విమానాన్ని దించాలని నిర్బంధించింది. పార్లమెంటు అరవై రోజులలో ఎన్నిక నిర్వహించాలి అన్న రాజ్యాంగ నిబంధనను తొలగించటానికి ఓటు వేసింది. అధ్యక్షుడి వారసుడిగా ఐమడెమా కుమారుడు " ఫోర్రే గ్నస్జింగ్బె " అధ్యక్ష పదవిలో కొనసాగుతాడని టోగో ఆర్మీ ఫోర్సు ప్రకటించింది.[10] వారసత్వం అంతర్జాతీయ విమర్శలు ఉన్నప్పటికీ ఫ్యూరు 2005 ఫిబ్రవరి 7 న ప్రమాణ స్వీకారం చేసాడు.[11]
ఆఫ్రికా సమాఖ్య సైనిక తిరుగుబాటుగా అధికారం స్వాధీనం చేసుకున్నట్లు వర్ణించింది.[12] అంతర్జాతీయ ఒత్తిడి, యునైటెడు నేషన్సు నుండి కూడా వచ్చింది. టోగోలో స్వాధీనం చేసుకున్నందుకు ప్రతిపక్షాల నిర్వహించిన అల్లర్లలో అనేక వందలమంది మరణించారు. అనేక నగరాలు, పట్టణాలలో తిరుగుబాటులు (ప్రధానంగా దేశంలోని దక్షిణ భాగంలో) జరిగాయి. అనెహొ పట్టణంలో పెద్ద ఎత్తున జరిగిన ఊచకోత గురించిన నివేదికలు వెలువరించబడలేదు. ప్రతిస్పందనగా ఫ్యూరు గ్నాసింగ్బె ఎన్నికలను నిర్వహించటానికి అంగీకరించాడు. ఫిబ్రవరి 25 న గ్నాసింగ్బే అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసి ఏప్రిల్‌లో పదవికి పోటీ చేయడానికి నామినేషను అంగీకరించబడింది.[13]
2005 ఏప్రెలు 24 న టోగో అధ్యక్షుడిగా జిన్సింగ్బె ఎన్నికయ్యారు. అధికారిక ఫలితాల ప్రకారం 60% ఓట్లను పొందారు. రేసులో అతని ప్రధాన ప్రత్యర్థిగా " యూనియన్ డెసు ఫోర్సెసు డు ఛాంగ్మెంటేషను " (యూనియన్ ఆఫ్ చేంజి)చెందిన " ఇమ్మాన్యూలు బాబు-అకితాని " ఉన్నాడు. ఐరోపా సమాఖ్య, ఇతర స్వతంత్ర పర్యవేక్షణ లేకపోవడంతో ఎన్నికల ఫలితాలు సందేహాస్పదంగా మారాయి.[14] కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు పదవీప్రమాణం చేసేవరకు పార్లమెంటు డిప్యూటీ ప్రెసిడెంటు బోన్ఫొ అబ్బాసును తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది.[13] 2005 మే 3 న ఫ్యూరు గాంసింగ్బే కొత్త అధ్యక్షుడిగా పదవీప్రమాణం చేసాడు. ప్రతిపక్ష వాదనలకు మద్దతుగా ఐరోపా సమాఖ్య టోగోకు సాయం నిలిపివేసింది. ఆఫ్రికా సమాఖ్య, యునైటెడ్ స్టేట్సు " రీజనబుల్లీ ఫెయిరు " అని ప్రకటించింది. నైజీరియా అధ్యక్షుడు (ఆఫ్రికా సమాఖ్య చైరు పర్శను) ఒలసువర్గను క్వుబాసంజొ సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపించడానికి ప్రస్తుత ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య చర్చలు చేయాలని కోరుకున్నాడు. మాజీ జాంబియా అధ్యక్షుడు కెన్నెత్ కౌండా టోగోకు ప్రత్యేక ఆఫ్రికా సమాఖ్య రాయబారిగా నియామకం చేయబడడం తిరస్కరించబడింది.[15][16] జూను నెలలో అధ్యడు గ్నాసింగ్బె ప్రతిపక్ష నాయకుడు ఎడెం కొడ్జోను ప్రధానమంత్రిగా నియమించాడు.
2007 అక్టోబరులో అనేక వాయిదాల తర్వాత ఎన్నికలు నిర్వహించబడ్డాయి. దీనివల్ల తక్కువ జనాభా ఉన్న ఉత్తరప్రాంతంలో దక్షిణప్రాంతం కంటే అధిక సంఖ్యలో ఎంపీ స్థానం గెలుచుకున్నారు. అధ్యక్షుడు వెనుకనుండి మద్దతు ఇచ్చిన " ర్యాలీ ఆఫ్ టోగోలీసు పీపులు " ఆధిక్యత సాధించింది. యు.ఎఫ్.సి. రెండవ స్థానంలో నిలిచింది. ఐరోపాసమాఖ్య పరిశీలకుల మిషను ఉన్నప్పటికీ రద్దు చేయబడిన బ్యాలెట్లు, చట్టవిరుద్ధమైన ఓటింగు జరిగాయి. ఈ ఎన్నికలను అంతర్జాతీయ సమాజం ఫెయిర్‌గా ప్రకటించించింది. మొట్టమొదటిసారిగా తక్కువ బెదిరింపు, కొన్ని హింసాత్మక చర్యలు మాత్రమే జరిగాయని పేర్కొన్నది. 2007 డిసెంబరు 3 న ఆర్.పి.టి కొంలను మాల్లై ప్రధానమంత్రిగా నియమితుడయ్యాడు. 2008 సెప్టెంబరు 5 న పదవ నెలలు మాత్రమే పదవీబాధ్యత వహించిన తరువాత టోగో ప్రధాన మంత్రిగా మాల్లీ రాజీనామా చేశారు. 2010 మార్చి అధ్యక్ష ఎన్నికలలో ఫ్యూరు గ్నాసింగ్బే ప్రతిపక్షనాయకునికి వ్యతిరేకంగా 61% ఓట్లు సాధించి తిరిగి ఎన్నికయ్యాడు.[17] 2010 మార్చి ఎన్నికలు ఎక్కువగా శాంతియుతంగా ఉన్నప్పటికీ పరిశీలకులు "విధానపరమైన లోపాలు", సాంకేతిక సమస్యలను ఉన్నాయని గుర్తించారు. ప్రతికూల ఫలితాలు ఫలితాన్ని ప్రభావితం చేశాయని భావించిన ప్రతిపక్షాలు ఫలితాలను గుర్తించలేదు.[18][19] ఎన్నికల తరువాత నిరసన అలలు కొనగాయి.[20] 2010 మేలో దీర్ఘకాలిక ప్రతిపక్ష నేత గిలుక్రిస్టు ఒలింపియో ప్రభుత్వంతో అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రవేశపెడతానని ప్రకటించాడు. యు.ఎఫ్.సి నుండి ఎనిమిది మందికి మంత్రివర్గ పదవులు మంజూరు చేసే సంకీర్ణ ఏర్పాటు చేయబడింది.[21][22] 2012 జూనులో ఎన్నికల సంస్కరణలు చేయాలని ప్రతిపాదిస్తూ నిరసనకారులు పలు రోజులు లోమెలో వీధిలో నిరసనప్రదర్శనలు నిర్వహించారు. 1992 నాటి రాజ్యాంగాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని, అధ్యక్షుని పదవీకాలానిక్ పరిమితులు నిర్ణయిమాలని నిరసనకారులు కోరారు.[23] 2012 జూలై ప్రధాన మంత్రి గిల్బర్టు హౌంగ్బో రాజీనామా ఆశ్చర్యకరంగా మారింది.[24] కొన్ని రోజుల తరువాత వాణిజ్య మంత్రి క్వేసీ అహోమోమీ-జునూ, కొత్త ప్రభుత్వాన్ని పేరు పెట్టాడు. అదే నెలలో ప్రతిపక్ష నేత జీను పియరీ ఫెబ్రే నివాసం మీద భద్రతా దళాలు దాడి చేసిన తరువాత ప్రభుత్వ అణిచివేతకు వ్యతిరేకంగా వేలాది నిరసనకారులు బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు.[25]
టోగో 5 పాలనా విభాగాలుగా విభజించబడింది. అవి 30 ప్రెఫెక్చ్యురీలుగా విభజించబడ్డాయి. ఉత్తరప్రాంతం నుండి దక్షిణప్రాంతం వరకు సవానె, కరా, సెంట్రలె, ప్ల్టియక్సు, మారీటైం.
టోగోకు పశ్చిమ ఐరోపా (ముఖ్యంగా ఫ్రాన్సు, జర్మనీతో) దేశాలతో బలమైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. టోగో " రిపబ్లికు ఆఫ్ చైనా, ఉత్తర కొరియా, క్యూబాలను గుర్తించింది. ఇది 1987 లో ఇజ్రాయెలుతో సంబంధాలను తిరిగి స్థాపించింది.
టోగో ఒక చురుకైన విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుంది. అనేక అంతర్జాతీయ సంస్థలలో భాగస్వామ్యం వహిస్తుంది. ఇది ముఖ్యంగా పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ వ్యవహారాలలో, ఆఫ్రికా యూనియనులో చురుకుగా ఉంటుంది. టోగో, పొరుగు దేశాలమధ్య సుముఖమైన సంబంధాలు ఉన్నాయి.
టోగో సైన్యాలను " టోగోలేస్ ఆర్మీ ఫోర్సెసు " పదాతిదళం, నౌకాదళం, వైమానిక దళం, జెండర్మెరీలు ఉన్నాయి. 2005 లో ఆర్థిక సంవత్సరంలో మొత్తం జి.డి.పి.లో 1.6% సైన్యం కొరకు వ్యయం చేసింది.[2] సైనిక స్థావరాలు లోమే, టెమెడజా, కారా, నియంతుగౌ , దపాంగు లలో సైనిక స్థావరాలు ఉన్నాయి.[26] 2009 మే 19 న జనరలు స్టాఫు ప్రస్తుత చీఫుగా బ్రిగేడియరు జనరలు టైటిక్పైన అచా మహ్మదు బాధ్యతలు స్వీకరించాడు.[27] ఎయిరు ఫోర్సు అల్ఫా జెట్లు ఉపయోగించబడుతున్నాయి.[28]
1972 - 1998 వరకు ఫ్రీడం హౌసు టోగోను "నాట్ ఫ్రీ " దేశంగా వర్గీకరించింది. 2002 నుంచి 2006 వరకు తిరిగి " నాట్ ఫ్రీ " దేశంగా వర్గీకరించింది. 1999 నుండి 2001 వరకు, తిరిగి 2007 నుండి ఇప్పటి వరకు " పార్ట్లీ ఫ్రీ"గా వర్గీకరించబడింది. ఇది చాలా తీవ్రమైన, సుదీర్ఘ మానవ హక్కుల సమస్యలను కలిగి ఉంది. 2010 లో పరిస్థితులపై ఆధారపడిన యు.ఎస్.స్టేట్ డిపార్ట్మెంటు నివేదిక ఆధారంగా దేశంలో "మరణం గాయాలు, అధికార శిక్షలు, కఠినమైన, ప్రాణాంతక జైలు పరిస్థితులు, నిర్హేతుక నిర్బంధాలు, న్యాయవ్యవస్థపై ఎగ్జిక్యూటివ్ ప్రభావం, పౌరుల హక్కుల ఉల్లంఘన, పత్రికా, అసెంబ్లీ, ఉద్యమ స్వేచ్ఛలపై పరిమితులు, అధికారిక అవినీతి, మహిళలపై వివక్షత, హింస, మహిళా జననాంగ విరూపణం (FGM), లైంగిక దోపిడీ పిల్లలపై, ప్రాంతీయ, జాతి వివక్షత, వ్యక్తుల, ముఖ్యంగా మహిళలు ఖత్నా ఆచారం, పిల్లల అక్రమ రవాణా, వైకల్యాలున్న వ్యక్తులపై సామాజిక వివక్ష, స్వలింగ సంపర్కులపై అధికారిక, సామాజిక వివక్ష, హెచ్.ఐ.వి వ్యాధి బాధితుల పట్ల సామాజిక వివక్షత, పిల్లలతో సహా నిర్బంధ కార్మిక వ్యవస్థ " వంటి మానవహక్కుల ఉల్లంఘన కార్యక్రమాలు జరిగుతున్నాయని భావిస్తున్నారు.[29]
టోగో ఆఫ్రికాలో అతిచిన్న దేశాలలో ఒకటి. దాని ఖరీదైన ఫాస్ఫేటు నిలువలు, కాఫీ వంటి వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడిన అభివృద్ధి చెందిన ఎగుమతి రంగం కారణంగా ఖండంలోని అత్యున్నతజీవన ప్రమాణాలు కలిగినదేశాలలో ఇది ఒకటిగా ఉంది. కాఫీ,కోకో బీన్; వేరుశెనగ (వేరుశెనగ) సుమారుగా 30% ఎగుమతి ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుంది. పత్తి అత్యంత ముఖ్యమైన నగదు పంటగా ఉంది.[30]
దేశంలో సారవంతమైన వ్యవసాయభూములు 11.3% ఉన్నాయి. వీటిలో అధికభాగం అభివృద్ధి చేయబడింది. పంటలు కాసావా, జాస్మిను బియ్యం, మొక్కజొన్న, చిరుధాన్యాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఇతర ముఖ్యమైన రంగాలగా బ్రూవరీ, వస్త్ర పరిశ్రమ ఉన్నాయి. శాశ్వత సమస్య విద్యుత్తు కొరత శాశ్వత సమస్యగా ఉంది. దేశం దాని వినియోగంలో మూడింట ఒక వంతు మాత్రమే ఉత్పత్తి చేయగలదు. మిగిలినది ఘనా, నైజీరియా నుండి దిగుమతుల ద్వారా భర్తీ చేయబడుతుంది. అయితే టోగో ప్రధాన ఎగుమతులలో తక్కువ మార్కెట్టు ధరలు 1990 లలో, 2000 ల ప్రారంభంలో జరిగిన అస్థిర రాజకీయ పరిస్థితి ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.[31]
టోగో తక్కువగా అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటి. ఆర్థిక పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా ఉంది. టోగో ప్రాంతీయ వాణిజ్యానికి కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సహకారంతో దశాబ్ధకాలంగా ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు చేపట్టడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆదాయం, వినియోగం మధ్య సంతులనాన్ని సృష్టించడం మొదలైన ప్రయత్నాలు చేపట్టింది. 1992 - 1993 సంవత్సరాలలో ప్రైవేటు, ప్రభుత్వ రంగ సమ్మెలతో సహా రాజకీయ అశాంతి, సంస్కరణ కార్యక్రమాలను అంతమొందించింది.
టొగో దిగుమతులలో యంత్రాలు, ఉపకరణాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఆహారం ప్రాధాన్యత వహిస్తున్నాయి. ప్రధాన దిగుమతి భాగస్వాములలో ఫ్రాన్సు (21.1%), నెదర్లాండ్సు (12.1%), కోటు డి ఐవోరే (5.9%), జర్మనీ (4.6%), ఇటలీ (4.4%), దక్షిణాఫ్రికా (4.3%) చైనా (4.1%) ఉన్నాయి. ప్రధాన ఎగుమతులలో కోకో, కాఫీ, వస్తువులు, ఫాస్ఫేట్లు, పత్తి పునః ఎగుమతి ఉన్నాయి. ఎగుమతి చేయబడుతున్న దేశాలలో బుర్కినా ఫాసో (16.6%), చైనా (15.4%), నెదర్లాండ్సు (13%), బెనిను (9.6%), మాలి (7.4%) ఉన్నాయి.
నిర్మాణాత్మకమైన సంస్కరణల పరంగా టోగో ఆర్థిక వ్యవస్థ సరళీకరణలో, వాణిజ్య, పోర్టు కార్యకలాపాల రంగాలలో పురోగతిని సాధించింది. అయితే, పత్తి రంగం, టెలీకమ్యూనికేషన్సు, నీటి సరఫరా ప్రైవేటీకరణ కార్యక్రమం నిలిచిపోయింది. వెలుపల నుండి ఆర్థిక సహాయం కారణంగా ప్రస్తుతం దేశంలో రుణాలు లేవు. హెచ్చుగా రుణపడి ఉన్న పేద దేశాలలో నిధి సహాయంతో అత్యధికంగా ప్రయోజనం పొందిన ఆఫ్రికాదేశాలలో టోగో ఒకటి.
1994 జనవరి 12 న ద్రవ్య విలువను 50 % తగ్గించడం చేయబడిన నిర్మాణాత్మకమైన సర్దుబాటుకు ఒక ముఖ్యమైన ప్రేరణనిచ్చింది. 1994 లో కలహాలు ముగిసిన తరువాత చేసిన ఈ ప్రయత్నాలు రాజకీయ ప్రశాంతతకు తిరిగి స్థాపించబడడానికి సహకరించాయి. ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాల్లో అధికరించిన పారదర్శకత (పెరుగుతున్న సాంఘిక సేవా వ్యయాలకు అనుగుణంగా) సాయుధ దళాల పరిమాణాన్ని తగ్గించటానికి ఆస్కారం ఇచ్చింది. నిధి సాహాయం కొరత, కోకో ధరల తగ్గింపుతో 1998 లో జి.డి.పి.లో 1% పతనం సంభవించింది. 1999 లో తిరిగి అభివృద్ధి ప్రారంభమైంది. " ఆర్గనైజేషను ఫర్ ది హార్మోనైజేషను ఆఫ్ బిజినెస్ లా ఇన్ ఆఫ్రికా "లో టొగో సభ్యదేశంగా ఉంది.[32]
వ్యవసాయం అనేది ఆర్థిక వ్యవస్థ వెన్నెముకగా ఉంది. అయితే ఇది నీటిపారుదల పరికరాలు, ఎరువులు కొనుగోలు కోసం నిధుల కొరతతో దీర్ఘకాలంగా పోరాడుతున్నందున ఇది గణనీయంగా పనితీరును తగ్గించింది. 2012 లో వ్యవసాయం జిడిపిలో 28.2 % ఉత్పత్తి చేసింది. 2010 లో కార్మికవర్గంలో 49% మందికి వ్యవసాయం ఉద్యోగం కల్పించింది. దేశంలో ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా ఉంది. పశువుల పెంపకం ద్వారా పశుసంపద ఉత్పత్తి జరుగుతుంది.[33][34][ఆధారం చూపాలి]
మైనింగ్ 2012 లో జి.డి.పి.లో 33.9% ఉత్పత్తి చేసింది. 2010 లో జనాభాలో 12% మంది ఉద్యోగులను కలిగి ఉంది. టోగో ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఫాస్ఫేట్ డిపాజిట్లను కలిగి ఉంది. ఫాస్ఫేటు ఉత్పత్తి సంవత్సరానికి 2.1 మిలియన్ల టన్నులు ఉంది. 90 వ దశకం మధ్యకాలం నుండి మైనింగ్ పరిశ్రమలో క్షీణత ఏర్పడింది. ప్రభుత్వం దానిని కొనసాగించడానికి భారీగా పెట్టుబడి పెట్టాలి. ప్రపంచ మార్కెట్లలో ఫాస్ఫేటు ధరలు పడిపోవడం, విదేశీ పోటీని అధికరించడం వలన మైనింగు పరిశ్రమ కష్టాలను ఎదుర్కొంటోంది. సున్నపురాయి, పాలరాయి, ఉప్పులు కూడా ఉన్నాయి. పరిశ్రమ కేవలం 20.4% జాతీయ ఆదాయాన్ని మాత్రమే అందిస్తుంది. ఎందుకంటే ఇది కొద్దిస్థాయిలో చిన్న పరిశ్రమిక రంగం, బిల్డర్లను కలిగి ఉంటుంది. సున్నపురాయి పెద్ద నిల్వలు టొగో సిమెంటును ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తుంది.[33][35]
Population[36] | |||
---|---|---|---|
Year | Million | ||
1950 | 1.4 | ||
2000 | 5.0 | ||
2016 | 7.6 |
2010 నవంబరు జనాభా లెక్కలు ఆధారంగా టోగో జనసంఖ్య 61,91,155. చివరి జనాభా గణనలో రెండింతల కంటే అధికం. 1981 లో సేకరించిన జనాభా గణన దేశ జనసంఖ్య 27,19,567. రాజధాని, అతిపెద్ద నగరమైన లోమే. 1981 లో 3,75,499 ఉంది. 2010 లో 8,37,437 కు పెరిగింది. 2010 లో గోల్ఫు ప్రిఫెక్చరు చుట్టుపక్కల పట్టణ జనాభా జోడించినప్పుడు, పరిసరప్రాంతాల జనసంఖ్యతో కలిసిన లోమే జనసంఖ్య 14,77,660 ఉంది.[37][38]
టోగోలోని ఇతర నగరాలలో స్కోడె (95,070), కారా (94,878), క్పలిం (75,084), అటక్పమె (69,261), డపాంగు (58,071),త్సెవీ (54,474). జనసంఖ్యా పరంగా టోగో ప్రపంచదేశాలలో అత్యధిక జనసంఖ్య కలిగిన దేశాలలో 107 వ స్థానంలో ఉంది. ప్రజలలో 75% మంది గ్రామీణప్రాంతాలలో నివసిస్తూ వ్యవసాయం, పశుపోషణతో జీవనం సాగిస్తుంటారు. టోగో జనసంఖ్యాభివృద్ధి చాలా బలంగా ఉంది. [37][38]
టోగోలో సుమారు 40 విభిన్న జాతుల సమూహాలు ఉన్నాయి. వీరిలో దక్షిణప్రాంతంలో ఉన్న ఈవు జనాభాలో 32% మంది ఉన్నారు. దక్షిణ తీరప్రాంతంలో వారు 21% మంది జనాభా ఉన్నారు. మధ్యలో కొటోకొలి (టాం), త్చంబా, ఉత్తరప్రాంతంలో కాంబే ప్రజలు (22%) ఉన్నారు. ఓచుజిలు జనాభాలో 14% ఉన్నారు. కొన్నిసార్లు ఎవెసు, ఓయుచ్విస్లు ఒకే రకంగా పరిగణించబడుతుంటారు. కానీ రెండు సమూహాలను అధ్యయనం చేసిన ఫ్రెంచి వారు వేర్వేరు వ్యక్తులని భావించారు.[39] ఇతర జాతి సమూహాలలో మినా, మోస్సీ, అజా ప్రజలు (సుమారు 8%) ఉన్నారు. స్వల్పసంఖ్యలో ఐరోపా జనాభా కూడా ఉంది
2012 లో యు.ఎస్. ప్రభుత్వ మత స్వేచ్ఛల నివేదిక ప్రకారం 2004 లో లోమే విశ్వవిద్యాలయం జనాభాలో 33% సాంప్రదాయ అనిమిస్టులు, 28% రోమన్ క్యాథలిక్కు, 14% మంది సున్నీ ముస్లింలు, 10% మంది ప్రొటెస్టంటు, మరొక 10% మంది ఇతరులు క్రిస్టియను తెగల ప్రజలు ఉన్నారని భావిస్తున్నారు. మిగిలిన 5% మంది ఏ మత సమూహంతో సంబంధంలేని వ్యక్తులుగా నమోదు చేసుకున్నారని నివేదించబడింది. చాలామంది క్రైస్తవులు, ముస్లింలు స్థానిక మత సంప్రదాయాలను కొనసాగించారని కూడా ఈ నివేదిక పేర్కొంది.[41]
సి.ఐ.ఎ. వరల్డు ఫాక్టు బుకు ప్రకారం జనాభాలో 29% క్రిస్టియన్లు, 20% ముస్లింలు 51% స్థానిక విశ్వాసాల అనుచరులుగా ఉన్నారని భావిస్తున్నారు.[33]
పోర్చుగీసు, కాథలికు మిషనరీల రాక తరువాత 15 వ శతాబ్దం మధ్యకాలం నుండి క్రైస్తవ మతం వ్యాపించింది. 19 వ శతాబ్దం రెండవ అర్ధభాగంలో జర్మన్లు ప్రొటెస్టంటిజాన్ని ప్రవేశపెట్టారు. బ్రూమెన్ మిషనరీ సొసైటీకి చెందిన వంద మిషనరీలు టోగో, ఘానా తీర ప్రాంతాలకు పంపబడ్డాయి. టొగో ప్రొటెస్టంట్లను "బ్రెమా" ( "బ్రెమెన్" పదానికి వికృతి) అని పిలిచేవారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ మిషనరీలు విడిచిపెట్టవలసి వచ్చింది. ఇది ఈవ్ ఎవాంజెలికల్ చర్చి ప్రారంభ స్వయంప్రతిపత్తికి జన్మనిచ్చింది.[42]
టోగో ఒక బహుభాషా దేశం. ఎథ్నోలాగు ప్రకారం దేశంలో 39 విభిన్న భాషలు వాడుకలో ఉన్నాయి. వీటిలోలో చాలాభాషా కమ్యూనిటీలలో 10,00,000 కంటే తక్కువ మంది సభ్యులు ఉన్నారు.[43] 39 భాషలలో ఏకైక అధికారిక భాష ఫ్రెంచి. 1975 లో వాడుకలో ఉన్న రెండు స్థానిక భాషలను రాజకీయంగా జాతీయ భాషలుగా పేర్కొనబడ్డాయి: ఎవే, కబీ. ఇవి రెండు అత్యంత విస్తారంగా వాడుకలో ఉన్న దేశీయ భాషలు కూడా ఉన్నాయి.
ఫ్రెంచి అధికారికంగా విద్య, శాసనసభ, అన్ని రకాల మీడియా, పరిపాలన, వాణిజ్యంలో వాడుకలో ఉంది. దక్షిణప్రాంతంలో విస్తారమైన కమ్యూనికేషను భాష ఈవు. ఇది కొన్ని ఉత్తర పట్టణప్రాంతాలలో వాణిజ్య భాషగా పరిమితమైనది.[44] అధికారికంగా ఈవు, కబియే "జాతీయ భాషలు". ఇవి టోగోలేస్ మాధ్యమంలో అధికారిక విద్యలో వాడుకలో ఉన్నాయి.
దేశం జర్మనీ కాలనీగా ఉన్నప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్రెంచి స్వాధీనం చేసుకునే వరకు జర్మనీ భాష విస్తారంగా వ్యాపింప చేయబడలేదు. ప్రస్తుతం దానికి అధికారిక హోదా లేదు.
Education in Togo is compulsory for six years.[45] In 1996, the gross primary enrollment rate was 119.6%, and the net primary enrollment rate was 81.3%.[45] In 2011, the net enrollment rate was 94%, one of the best in the West African sub-region. The education system has suffered from teacher shortages, lower educational quality in rural areas, and high repetition and dropout rates.[45]
టోగో సంస్కృతిని అనేక జాతుల సమూహాలు ప్రభావితం చేసాయి. వీటిలో అతిపెద్ద, అత్యంత ఇవు, మినా, టెం, తమ్బా, కబ్రే ప్రభావవంతమైనవిగా ఉంటాయి.
టోగోలో క్రైస్తవులు, ముస్లిములు సంఖ్యాపరంగా ఆధిక్యతలో ఉన్నప్పటికీ 50% టోగో ప్రజలు స్థానికంగా ఆనిమిజం విశ్వాసాలను, సంప్రదాయాలను ఆచరిస్తున్నారు.
ఇబెజి ఆరాధనను విశదీకరించే ప్రసిద్ధ ఇవే విగ్రహాలు ఉన్నాయి. ఆఫ్రికా ముసుగుల కంటే శిల్పాలు, వేట ట్రోఫీలు ఉపయోగించబడ్డాయి. కలప వడ్రంగి (క్లోటో) "వివాహం గొలుసులు" ప్రసిద్ధి చెందాడు: రెండు పాత్రలను చెక్కతో కూడిన రింగులు మాత్రమే కలపబడి ఉంటాయి.
క్లోటో కళాత్మక కేంద్రం రంగులద్దిన బాటిక్సు దుస్తులతో పురాతన రోజువారీ జీవితశైలిలోని రంగుల సన్నివేశాలను సూచిస్తుంది. అస్హౌను చేనేతకారుల ఉత్సవాల్లో ఉపయోగించే లోయినుక్లోత్సు ప్రసిద్ధి చెందాయి. ప్లాస్టికు సాంకేతిక నిపుణుడు పాలు ప్రస్తుతం అహీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఆయన "జోటాను"ను సాధించాడు.
అధికారిక టొగాలీయులు పానీయాన్ని సొడాబి అని పిలుస్తారు. తాటి చెట్ల చివరి భాగంలో గాటుపెట్టి దాని నుండి స్వవించే ద్రవాన్ని మట్టు కుండలలో సేకరించి తయారు చేయబడే కల్లు.
2008 ఆగస్టు 12 న బెంజమిను బౌక్కపేటి (టోగోలేసు తండ్రి, ఒక ఫ్రెంచి తల్లికి జన్మించాడు) పురుషుల కే 1 కయాక్ స్లాలోంలో ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది టోగోలీ బృందం మొట్టమొదటిసారిగా గెలిచిన తొలి పతకంగా గుర్తింపును పొందింది.
ఫుట్బాలు టోగో అత్యంత గుర్తింపు పొందిన జాతీయ క్రీడ. నైజీరియా, ఐవరీ కోస్ట్, కామెరూన్, ఘనా, సెనెగల్ లతో కేసు తరువాత 2006 లో ప్రపంచ కప్పుకు టోగో కూడా అర్హత సాధించింది. గ్రూపు దశలో టోగో విజయాన్ని నమోదు చేయలేదు. టోగో సి.ఎ.ఎఫ్.కు కూడా అర్హత సాధించింది. బచిరౌ సాలౌ మొదటిసారిగా పుట్ బాలు క్రీడాకారుడుగా గుర్తింపు పొంది టోగోకు చెందిన సాకరు నక్షత్రక్రీడాకారుల మార్గం సుగమం చేసాడు. ఎవరు మొదటి ప్రముఖ ఫుట్బాలు ఉంది. ఆయన జర్మనీ బండెస్లిగాలో 14 సంవత్సరాల కన్నా ఎక్కువగా క్రీడలలో పాల్గొన్నాడు. బోరుసియా మోనుచెంగ్లాబ్దాచు, ఎం.ఎస్.వి. డూయిస్బర్గు వంటి జర్మను క్లబ్బులకు లిజెండుగా మారాడు. సాలో తొమ్మిది సంవత్సరాల కాలంలో టోగో కోసం 38 ట్రోఫీలను సంపాదించాడు. అతను 300 ఆటలను ఆడాడు. జర్మనీ ప్రధాన లీగులో 69 గోల్సు సాధించాడు. అత్యంత ప్రసిద్ధ ఫుట్బాలు క్రీడాకారుడు ఇమ్మాన్యూలు అడేబెయోరు టోగోలో జాతీయ జట్టుకు 30 గోల్సు సాధించాడు. ఇంగ్లీషు ప్రీమియరు లీగులో 97 గోల్సు చేశాడు.
టోగోలో సెక్యులరు వేడుకలు ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో జనవరి 1 - "ఫెటీ నేషనల్" (ఫ్రెంచులో జాతీయ ఉత్సవం), 27 ఏప్రిలు - స్వాతంత్ర్య దినం మొదలైనవి ఉన్నాయి. ఈ ఉత్సవాలు ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తాయి. వారు మరింతమంది పర్యాటకులను ఆకర్షిస్తారు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.