From Wikipedia, the free encyclopedia
జ్ఞానేశ్వరుడు (1275–1296) [2] మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు, తత్వవేత్త, నాథ సంప్రదాయానికి చెందిన సన్యాసి. 21 సంవత్సరాల అతి తక్కువ జీవిత కాలంలోనే భగవద్గీత మీద ఆయన రచించిన జ్ఞానేశ్వరి, అమృతానుభవం అనే గ్రంథాలు మరాఠీ సాహిత్యంలో మైలురాళ్ళుగా పరిగణిస్తారు. దేవగిరి యాదవులచే పరిరక్షించబడిన ఈ గ్రంథాలు మరాఠీ భాషలో లభిస్తున్న అత్యంత ప్రాచీనమైన గ్రంథాలు.[3]
జ్ఞానేశ్వరుడు మహారాష్ట్రను 13 వ శతాబ్దంలో యాదవ రాజైన రామదేవర పరిపాలిస్తున్న కాలంలో జన్మించాడు. [4] 1296లో ఢిల్లీ సుల్తానులు ఆ రాజ్యం మీద దాడి చేసేవరకు ప్రశాంతంగా, సుసంపన్నంగా ఉండేది.[5][6] యాదవ రాజుల పాలనలో కళలు, సైన్సు మొదలైన రంగాలు బాగా అభివృద్ధి సాధించాయి. భారతదేశం నలుమూలల నుంచి అనేకమంది పండితులు ఆ రాజ్యానికి విచ్చేసేవారు.[7] కానీ అదే సమయంలోనే ప్రజల్లో మతమౌఢ్యం, సాంఘిక దురభిమానం, మూఢ నమ్మకాలు లాంటివి పెరిగి గ్రామదేవతలకు మూగజీవాలను బలి ఇవ్వడం ఎక్కువైంది.[8] జ్ఞానేశ్వరుడు తను రాసిన జ్ఞానేశ్వరి అనే గ్రంథంలో ఈ మూఢాచారాలను విమర్శించాడు.[9] బి.పి బహీరత్ అనే పండితుని ప్రకారం ఆ కాలంలో మరాఠీలో రచనలు చేసిన తొలి తత్వవేత్త జ్ఞానేశ్వరుడు.[10]
Seamless Wikipedia browsing. On steroids.