భారత ప్రభుత్వ పరిశోధన సంస్థ From Wikipedia, the free encyclopedia
జాతీయ ధ్రువ, మహాసముద్ర పరిశోధనా కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ - NCPOR), భారతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ. ఇది గోవాలోని వాస్కోడిగామాలో ఉంది. గతంలో దీన్ని నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCAOR) అనేవారు. ఇది భారత ప్రభుత్వంలోని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖలోని ఓషన్ డెవలప్మెంట్ విభాగానికి (DOD) చెందిన స్వయంప్రతిపత్త సంస్థ. ఇది భారతీయ అంటార్కిటిక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారత ప్రభుత్వ అంటార్కిటిక్ పరిశోధనా కేంద్రాలలైన భారతి, మైత్రిలు దీని నిర్వహణ లోనే ఉంటాయి. ఈ సంస్థను 1998 మే 25 న NCAOR పేరుతో డా. ప్రేమ్ చంద్ పాండే సారథ్యంలో స్థాపించారు.[4][5][6][7][8] [9] [10] NCPOR, ప్రపంచ స్థాయి ప్రయోగాలకు, అంతర్జాతీయ సమావేశాల నిర్వహణకూ, అంటార్కిటిక్ సైన్స్‌కు సంబంధించిన అంతర్జాతీయ కమిటీల నాయకత్వానికీ ప్రసిద్ధి చెందింది. 2022 నాటికి NCPOR ఛైర్మన్‌గా డాక్టర్ M. రవిచంద్రన్ [11] ఉన్నాడు. ఇతను ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కూడా. 2022 నాటికి NCPOR డైరెక్టర్ మీర్జా జావేద్ బేగ్.[12]
సంకేతాక్షరం | NCPOR |
---|---|
అవతరణ | 25 మే 1998 |
కేంద్రస్థానం | వాస్కోడాగామా, గోవా |
అక్షాంశ,రేఖాంశాలు | 15.397°N 73.793°E |
సేవలందించే ప్రాంతం | భారతదేశం |
చైర్మన్ | ఎం.రవిచంద్రన్[1][2] |
ప్రధాన విభాగం | గవర్నింగ్ కౌన్సిల్ |
బడ్జెట్ | ₹1,897 crore (US$240 million) (2021 - 2022) [3] |
వెబ్సైటు | http://www.ncaor.gov.in/ |
NCPOR కాంప్లెక్సు, ప్రత్యేక స్వల్ప-ఉష్ణోగ్రత ప్రయోగశాలకు నిలయం. ఇది నేషనల్ అంటార్కిటిక్ డేటా సెంటర్, ధ్రువీయ మ్యూజియంలను ఏర్పాటు చేస్తోంది.
NCPOR కింది రంగాల్లో లేదా టాస్క్‌లలో పనిచేస్తుంది:
ఈ కేంద్రాన్ని గతంలో అంటార్కిటిక్ అధ్యయన కేంద్రం అని పిలిచేవారు. 1997 మే 12 న డా. పి.సి.పాండే [15] డైరెక్టర్‌గా చేరడంతో ఇది ఉనికిలోకి వచ్చింది.
2016 అక్టోబర్ 9 న, నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCAOR) హిమాలయాలో హిమాన్ష్ అనే పరిశోధనా కేంద్రాన్ని స్థాపించింది. [16] [17] ఈ స్టేషను హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితిలో ఒక మారుమూల ప్రాంతంలో 4000 మీ. ఎత్తున ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.