Remove ads
From Wikipedia, the free encyclopedia
భారత ప్రభుత్వ జాతీయ ఇ-పాలన ప్రణాళిక[1] ప్రధానోద్దేశాలలో ముఖ్యమైనవి: సరైన పాలన, సంస్థాగత పద్ధతులను తయారుచేయడం, మౌలిక సదుపాయాలేర్పాటు, పాలసీల తయారీ, ఇంకా కేంద్రంలో, రాష్ట్రాలలో లక్ష్యాధార ప్రాజెక్టులను అమలుచేయడం, సమీకృత ప్రజాసేవలను, పాలనకై వ్యాపార వాతావరణాన్ని ఏర్పాటుచేయడం. దీని 27 లక్ష్యాధార ప్రణాళికలు, 8 విభాగాలకు 2006 మే 18 న ప్రభుత్వ అనుమతి లభించింది .
ఎన్.ఇ.జి.డి పౌరులకు, వివిధ వ్యాపారాలకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక ఈ క్రింది సిధ్దాంతాన్ని లక్ష్యంగా పెట్టుకుంది: “సామాన్య మానవుడికి నివసించేచోటే ఉమ్మడి సేవా కేంద్రాలద్వారా అన్ని ప్రభుత్వసేవలూ అందించేటట్లుగా చూడాలి. ఆ సేవలు సామాన్య మానువుడి ప్రాథమిక అవసరాలు, అతను భరించగలిగే ఖర్చుతో తీరేలా సమర్ధవంతంగా, పారదర్శకంగా, విశ్వాసయోగ్యమైనవిగా, నమ్మకంగా అందించాలి.”
దీని ద్వారా ఇ-పాలన సేవలన్నీ పౌరులకు అందుతాయి. ఒక కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, నిరంతరాయంగా విద్యుత్శక్తి ఉపకరణము, వైర్లెస్ సంపర్క వ్యవస్థ వుంటాయి. విద్యావినోద పరికరాలు, దూర ఆరోగ్య వ్యవస్థ ఉపకరణాలు, పెద్ద తెర వ్యవస్థ కూడా వుంటాయి. దీనిని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తారు. గ్రామీణ స్థాయి వ్యవస్థాపకుడు క్రింది స్థాయిలో, సేవా కేంద్ర ఏజెన్సీ మధ్యస్థాయిలో, పేర్కొనబడిన రాష్ట్ర ఏజెన్సీ పై స్థాయిలో వుంటాయి. వీటిని దేశంలోని సుమారు 600 000 గ్రామాల్లో ఏర్పాటు చేస్తారు. దీనికోసం నాలుగేళ్లలో 5742 కోట్లు ఖర్చవుతుంది. కేంద్రం 856 కోట్లు, రాష్ట్రాలు 793 కోట్లు ఖర్చు చేస్తాయి.
ఇది కేవలం వివిధ ప్రభుత్వశాఖలమధ్య సంపర్కానికి తయారు చేసిన కంప్యూటర్ నెట్వర్క్. దీని ద్వారా జిటుజి (G2G), జిటుసి (G2C) సేవలు అందుతాయి. దీనికోసం 3334 కోట్లు ఖర్చవుతాయి. (మార్చి 2005 అంచనాలు). రాష్ట్ర ముఖ్య పట్టణంతో, జిల్లా ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాలు, కనీసం 2MBPS తో సంపర్కం చేస్తారు.
ప్రతి వ్యక్తి సమాచారం, రాష్ట్ర డాటా సెంటర్లులో వుంచబడుతుంది. 2010-2011 నాటికి ఇవి పని చేస్తాయి. ఐదేళ్లలో 1623 కోట్లు ఖర్చవుతుంది.
ప్రభుత్వ విభాగం | సేవలు |
---|---|
ఆదాయపు పన్ను | పాన్/టాన్ (PAN/TAN) నమోదు, రిటర్న్ ఇ-ఫైలింగ్ |
పాస్ పోర్ట్ / వీసా | ఆన్లైన్ విచారణ |
కంపెనీ విషయాలు | కంపెనీ నమోదు |
సెంట్రల్ ఎక్సైజ్ | రిటర్న్ ఇ-ఫైలింగ్ |
పింఛస్లు | ఆన్లైన్ విచారణ |
భూమి యాజమాన్య వివరాలు | భూమి యాజమాన్య వివరాల విచారణ |
ప్రాంతీయ రవాణా సంస్థ | వాహనాల నమోదు, డ్రైవింగ్ లైసెన్సు జారి |
ఆస్తి హక్కు నమోదు | ఆస్తి హక్కు నమోదు |
వ్యవసాయం | వ్యవసాయ ఉత్పత్తుల ధరలు |
మునిసిపాలిటీ | జనన, మరణ ధ్రువీకరణ పత్రాల వితరణ |
పోలీసు | దొంగిలించబడిన వాహనాల వివరాలు |
ఉద్యోగ వినిమయ కేంద్రం | ఉద్యోగార్ధుల, సంస్థల నమోదు |
ఈ-కోర్టు | దావా వివరము, కాజ్ చిట్టా, తీర్పులు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.