From Wikipedia, the free encyclopedia
జహనారా బేగం ( 1614 మార్చి 23 - 1681 సెప్టెంబరు 16) మొఘలు యువరాణి, షాజహాను చక్రవర్తి, ఆయన భార్య ముంతాజు మహలు ప్రథమ సంతానం.[2] తరచుగా బేగం సాహిబు (యువరాణి యువరాణి) అని పిలుస్తారు. ఆమె యువరాజు దారా షికో, చక్రవర్తి ఔరంగజేబులకు అక్క.
జహనారా బేగం | |
---|---|
Shahzadi of the Mughal Empire Padshah Begum | |
జననం | 23 March 1614[1] Ajmer, Rajasthan, India |
మరణం | 1681 సెప్టెంబరు 16 67) Delhi, India | (వయసు
Burial | Nizamuddin Dargah, Delhi |
House | Timurid |
తండ్రి | Shah Jahan |
తల్లి | Mumtaz Mahal |
మతం | Islam |
1631 లో ముంతాజు మహలు అకాల మరణం తరువాత 17 ఏళ్ల జహానారా తన తండ్రికి మరో ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ, మొఘలు సామ్రాజ్యానికి ప్రథమ మహిళ (పాద్షా బేగం) గా తన తల్లి స్థానాన్ని పొందింది. ఆమె షాజహాను అభిమాన కుమార్తె. ఆమె తండ్రి పాలనలో తన రాజకీయ ప్రభావాన్ని చూపింది. ఆ సమయంలో "సామ్రాజ్యంలో అత్యంత శక్తివంతమైన మహిళ"గా అభివర్ణించబడింది.[3]
జహనారా తన సోదరుడు దారా షికో తీవ్రమైన పక్షపాతి. ఆమె తండ్రి ఎంచుకున్న వారసుడిగా అతనికి మద్దతు ఇచ్చింది. 1657 లో షాజహాను అనారోగ్యం తరువాత జరిగిన వారసత్వ యుద్ధంలో జహానారా వారసుడుగా నిర్ణయించబడిన దారాతో కలిసి ఉంది. చివరికి ఆగ్రా కోటలో ఆమె తండ్రితో చేరింది. అక్కడ ఆయనను ఔరంగజేబు గృహ నిర్బంధంలో ఉంచారు. అంకితభావంతో కూడిన కుమార్తెగా ఆమె 1666 లో మరణించే వరకు షాజహానును చూసుకుంది. తరువాత, జహనారా ఔరంగజేబుతో రాజీ పడింది. ఆమెకు " యువరాణి చక్రవర్తిని " అనే బిరుదు ఇవ్వబడింది. ఆమె తరువాత ఆమె చెల్లెలు యువరాణి రోషనారా బేగం ప్రథమ మహిళగా మారింది.[4] ఔరంగజేబు పాలనలో జహనారా అవివాహితగానే మరణించింది.
జహంగీరు జహానారా ప్రారంభ విద్య బాధ్యతను కవి తాలిబు అములీ సోదరి సతీ అలు-నిసా ఖానానికి అప్పగించారు. సతీ అల్-నిసా ఖనాం ఖురాను పర్షియా సాహిత్యం మీద ఆమెకు విసేషపరిజ్ఞానం ఉంది. ఆమె రాజకుటుంబ మర్యాదలు, గృహనిర్వాహకం, ఔషధాల పరిజ్ఞానం వంటి ప్రత్యేకతలు ఆమెకు ప్రసిద్ధి సంతరించి పెట్టాయి. ఆమె తల్లి ముంతాజు మహలు ప్రధాన లేడీ-ఇను-వెయిటింగుగా కూడా పనిచేసింది.[5]
సామ్రాజ్య గృహంలోని చాలామంది మహిళలలా ఆమె కవిత్వం, చిత్రలేఖనం, చదవడం, వ్రాయడం సాధించింది. చదరంగం, పోలో, వేటలలో పాల్గొన్నది. ప్రపంచ మతాలు, పర్షియా, టర్కీ, భారతీయ సాహిత్యాలకు సంబంధించిన పుస్తకాలతో నిండిన దివంగత చక్రవర్తి అక్బరు గ్రంథాలయంలో మహిళలకు ప్రవేశం ఉంది.[6] జహానారా కూడా దీనికి మినహాయింపు కాదు.
1631 లో ముంతాజు మహలు మరణించిన తరువాత 17 సంవత్సరాల వయసున్న జహానారా తన తండ్రికి మరో ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ ఆమె తల్లి స్థానంలో ఆమె ప్రథమ మహిళగా చక్రవర్తిని స్థానం పొందింది.[7] తన తమ్ముళ్లను సోదరీమణులను చూసుకోవడంతో పాటు, తన తల్లి మరణ నుండి తన తండ్రిని దుఃఖం నుండి బయటకి తీసుకురావడం, ఆమె తండ్రి దుఃఖంతో అంధకారంలో ఉన్న రాజసభను సాధారణ స్థితిని తీసుకువచ్చిన వంటి ఘనత కూడా ఆమెకు ఉంది.
తల్లి మరణించిన తరువాత ఆమె చేసిన ఒక పని సతీ అల్-నిసా ఖనాం సహాయంతో ఆమె సోదరుడు దారా షికోతో బేగం నాదిరా బానుకు వివాహం జరిపించింది. ఇది ముంతాజు మహలు మొదట ప్రణాళిక చేసినప్పటికీ కాని అది ఆమె మరణం కారణంగా అది వాయిదాపడింది. [8]
ఆమె తండ్రి తరచూ ఆమె సలహా తీసుకొని ఇంపీరియల్ సీల్ బాధ్యతను ఆమెకు అప్పగించారు. 1644 లో ఔరంగజేబు తన తండ్రి షాకు కోపం తెప్పించినప్పుడు జహానారా తన సోదరుడి తరపున మధ్యవర్తిత్వం వహించి అతనిని క్షమించి అతని హోదాను పునరుద్ధరించాలని షాజహానును ఒప్పించింది.
షాజహాను తన కుమార్తె పట్ల చూపిన అభిమానం ఆయన ఆమెకు ఇచ్చిన పలు బిరుదులలో ప్రతిబింబిస్తుంది. వీటిలో: సాహిబాత్ అల్-జమాని (లేడీ ఆఫ్ ది ఏజ్), పాడిషా బేగం (లేడీ చక్రవర్తి), లేదా బేగం సాహిబు (యువరాణి). ఆమె శక్తి ఆమెను ఇతర సామ్రాజ్య యువరాణుల మాదిరిగా కాకుండా, ఆగ్రా కోట పరిమితుల వెలుపల తన సొంత ప్యాలెసులో నివసించడానికి అనుమతించబడింది.[9]
1644 మార్చి లో[10] ఆమె ముప్పయ్యవ పుట్టినరోజు తర్వాత జహానారా శరీరానికి తీవ్రమైన కాలిన గాయాలు అయ్యాయి. ఆమె గాయాలతో దాదాపు మరణం దరిదాపులకు చేరుకుంది. షాజహాను పేదలకు అపారమైన భిక్ష ఇవ్వాలని, ఖైదీలను విడుదల చేయాలని, యువరాణి కోలుకోవాలని ప్రార్థనలు చేయాలని ఆదేశించాడు. ఔరంగజేబు, మురాదు, షైస్తా ఖాను ఆమెను చూడటానికి ఢిల్లీకి తిరిగి వచ్చారు.[11][12] ఏమి జరిగిందో వివరించే కథనాలు భిన్నంగా ఉంటాయి. సువాసనగల నూనెలతో కప్పబడిన జహానారా వస్త్రాలకారణంగా మంటలు అంటుకున్నాయని కొందరు అంటున్నారు.[12] యువరాణికి ఇష్టమైన నర్తకీమణి దుస్తుల కారణంగా మంటలు చెలరేగాయని ఆమె సహాయానికి వస్తున్న చెలికత్తె తనకుతాను కాల్చుకోవడం ద్వారా ఛాతీ తగలబడిందని ఇతరులు పేర్కొన్నారు.[13]
ఆమె అనారోగ్య సమయంలో షాజహాను తన అభిమాన కుమార్తె సంక్షేమం కోసం చాలా శ్రద్ధ వహించాడు. ఆయన దివాన్-ఇ-ఆమ్ లోని తన రోజువారీ దర్బారు వద్ద మాత్రమే కనిపించాడు.[14] జహనారా కాలిన గాయాలను నయం చేయడంలో రాజ వైద్యులు విఫలమయ్యారు. ఒక పర్షియను వైద్యుడు ఆమెకు చికిత్స చేయటానికి వచ్చాడు. ఆమె పరిస్థితి చాలా నెలలు జరిగాయి కాని పరిస్థితి మెరుగుపడలేదు. చెలా అనే ఒక రాజవైద్యుడు లేపనం కలిపే వరకు మెరుగుదల కనిపించలేదు. చివరకు మరో రెండు నెలల తరువాత గాయాలు మూసుకుపోయాయి. ప్రమాదం జరిగిన ఒక సంవత్సరం తరువాత జహానారా పూర్తిగా కోలుకుంది.[15]
ప్రమాదం తరువాత యువరాణి అజ్మీరులోని మొయినుద్దీను చిష్తి మందిరానికి తీర్థయాత్రకు వెళ్ళింది.
ఆమె కోలుకున్న తరువాత షాజహాను జహానారాకు అరుదైన రత్నాలు, ఆభరణాలను ఇచ్చాడు. సూరతు నౌకాశ్రయం ఆదాయాన్ని ఆమెకు ఇచ్చాడు.[9] ఆమె ముత్తాత అక్బరు చెప్పిన ఉదాహరణను అనుసరించి ఆమె తరువాత అజ్మీరును సందర్శించింది.[16]
జహానారా చాలా ధనవంతురాలు. 1628 ఫిబ్రవరి 6 న ఆమెకు గౌరవసూచకంగా పట్టాభిషేకం జరిగింది.[17] షాజహాను జహానారా తల్లి తన భార్య ముంతాజు మహలుకు 1,00,000 అష్రాఫీలు (రెండు మోహర్స్ విలువైన పెర్షియన్ బంగారు నాణేలు), 600,000 రూపాయలు, ఒక మిలియన్ రూపాయల వార్షిక ప్రైవేటు పర్స్ ను ప్రదానం చేసాడు. జహానారాకు 1,00,000 అష్రాఫీలు, 4,00,000 రూపాయలు, వార్షిక సాదరు వ్యయం కొరకు 6,00,000 లభించింది.[18][19] ముంతాజు మహలు మరణం తరువాత ఆమె వ్యక్తిగత సంపదను షాజహాను జహానారా బేగం (సగం అందుకుంది), ముంతాజు మహలు మిగిలిన పిల్లలకు విభజించారు.[20]
జహానారాకు అనేక గ్రామాలు, యాజమాన్యంలోని తోటల నుండి ఆదాయం పొందడానికి అనుమతించబడింది. బాగ్-ఇ-జహానారా, బాగ్-ఇ-నూరు, బాగ్-ఇ-సఫా వంటి తోటలకు యాజమాన్యం వహించింది.[21]
తనకు లభించిన ఆదాయం తోటల నిర్వహణకు కేటాయించబడింది, "ఆమె జాగీర్‌లో అచ్చోలు, ఫర్జహారా, సర్కార్సు ఆఫ్ బచ్చోలు గ్రామాలు ఉన్నాయి. సఫాపూరు, దోహారా. పానిపట్టు పరగణ కూడా ఆమెకు మంజూరు చేయబడింది.[22] పైన చెప్పినట్లుగా ఆమెకు సుసంపన్నమైన నగరం సూరతు కూడా ఇవ్వబడింది.
జహంగీరు తల్లికి సూరతు, ఎర్ర సముద్రం మధ్య వర్తకం చేసే ఓడ ఉంది. నూరు జహాను ఇండిగో, వస్త్రాలు వంటి వ్యాపారం కొనసాగించింది. తరువాత ఈ జహానారా సంప్రదాయాన్ని కొనసాగించారు.[23] ఆమె అనేక నౌకలను కలిగి ఉంది. ఇంగ్లీషు, డచ్లతో వాణిజ్య సంబంధాలను కొనసాగించింది.[24]
జహనారా పేదలను చూసుకోవడంలో, మసీదుల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయడంలో ఆమె చురుకైన పాత్రకు ప్రసిద్ది చెందింది.[25] ఆమె ఓడ సాహిబీ తన మొదటి ప్రయాణం (1643 అక్టోబరు 29 న) ప్రయాణించవలసి వచ్చినప్పుడు ఓడ మక్కా, మదీనాకు ప్రయాణించాలని ఆమె ఆదేశించింది. "... ప్రతి సంవత్సరం యాభై కోని (ఒక కోని 4 మున్సు లేదా 151 పౌండ్ల బియ్యం మక్కా నిరాశ్రయులకు, పేదవారికి పంపిణీ కోసం ఓడ ద్వారా పంపాలి. "[26]
మొఘలు సామ్రాజ్యం ప్రాధమిక రాణిగా, జహానారా స్వచ్ఛంద విరాళాలకు బాధ్యత వహించారు. ఆమె ముఖ్యమైన రాజ్య, మతదినాలలో భిక్షాటనను నిర్వహించింది. కరువు నివారణ, మక్కా తీర్థయాత్రలకు మద్దతు ఇచ్చింది.[27]
విద్యార్జన, కళలకు మద్దతుగా జహానారా ముఖ్యమైన ఆర్థిక సహకారాన్ని అందించారు. ఇస్లామికు ఆధ్యాత్మికత మీద వరుస రచనల ప్రచురణకు ఆమె మద్దతు ఇచ్చింది. మొఘలు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక రచన అయిన రూమి రచించిన " మత్నావి " కి వ్యాఖ్యానాలు ఉన్నాయి.[28]
ఆమె సోదరుడు దారా షికోతో కలిసి ఆమె ముల్లా షా బదాక్షి శిష్యురాలుగా ఉంది. ఆమెను 1641 లో ఖాదిరియా సూఫీ క్రమంలో ప్రవేశపెట్టారు. జహానారా బేగం సూఫీ మార్గంలో మరింత పురోగతి సాధించారు. ముల్లా షా ఆమెకు తన వారసురాలిగా ఖాదిరియాలో పేరు పెట్టారు. కాని ఆర్డరు నియమాలు దీనిని అనుమతించలేదు.[16]
ఆమె భారతదేశంలో చిష్టియా ఆర్డరు స్థాపకుడు మొయినుద్దీను చిష్తి జీవిత చరిత్రను మునిసు అల్-అర్వే పేరుతో పాటు ముల్లా షా జీవిత చరిత్రను రిసాలా-ఇ ఇబియా అనే పేరుతో రాసింది. దీనిలో ఆమె తన దీక్షను కూడా వివరించింది.[29] మొయినుద్దీను చిష్తి జీవిత చరిత్ర దాని తీర్పు, సాహిత్య నాణ్యతకు ఎంతో గౌరవం కలిగించింది. అందులో ఆమె మరణించిన నాలుగు శతాబ్దాల తరువాత ఆమె తనకుతాను ఆధ్యాత్మికంగా ప్రారంభించినట్లు ఆమె భావించింది. అజ్మీరుకు ఆమె చేసిన తీర్థయాత్రను వివరించింది. సూఫీ మహిళగా తన వృత్తిని సూచించడానికి తనను తాను ఫకారా అని చెప్పింది.[30]
తైమూరు వారసులు ఆమె సోదరుడు డెరా మాత్రమే సూఫీయిజాన్ని స్వీకరించామని అని జహానారా బేగం పేర్కొన్నది.[31] అయినప్పటికీ ఔరంగజేబు సూఫీ మతాన్ని అనుసరించే వ్యక్తిగా ఆధ్యాత్మికంగా శిక్షణ పొందాడు. సూఫీ సాహిత్య పోషకురాలిగా ఆమె శాస్త్రీయ సాహిత్యం అనేక రచనలకు అనువాదకులను, వ్యాఖ్యానకారులను నియమించింది.[32]
1657 లో షాజహాను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన నలుగురు కుమారులు దారా షికో, షా షుజా, ఔరంగజేబు, మురాదుబక్షిల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది.[33]
వారసత్వ యుద్ధంలో జహానారా షాజహాను పెద్ద కుమారుడు, తన సోదరుడు అయిన దారా షికోకు మద్దతు ఇచ్చాడు. ఔరంగజేబు చేతిలో ధర్మతు (1658) వద్ద దారా షికో సైనికాధికారులు ఓటమిని చవిచూసినప్పుడు జహానారా ఔరంగజేబుకు ఒక లేఖ రాసి తన తండ్రికి అవిధేయత చూపవద్దని తన సోదరుడితో పోరాడవద్దని సలహా ఇచ్చింది. ఆమె ప్రయత్నం విజయవంతం కాలేదు. సముగరు యుద్ధంలో (1658 మే 29) దారా షికో తీవ్రంగా ఓడిపోయి ఢిల్లీ వైపు పారిపోయాడు.[34]
ఆగ్రా మీద ప్రణాళికాబద్ధమైన దండయాత్రను ఆపడానికి షాజహాను తన వంతు సమస్తకృషి చేశాడు. ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడడానికి వెనుదీయవద్దని సోదరులైన మురాదు, షుజాలను ప్రోత్సహించమని జహానారాను కోరాడు.[35]
1658 జూనులో ఔరంగజేబు తన తండ్రి షాజహానును ఆగ్రా కోటలో ముట్టడించి నీటి సరఫరాను నిరోధించడం ద్వారా బేషరతుగా లొంగిపోవాల్సి వచ్చింది. సామ్రాజ్యం విభజనను ప్రతిపాదిస్తూ జహానారా జూను 10 న ఔరంగజేబు వద్దకు వచ్చింది. ప్రతిపాదన ఆధారంగా దారా షికోకు పంజాబు ప్రక్కనే ఉన్న భూభాగాలు ఇవ్వబడతాయి; షుజాకు బెంగాలు వస్తుంది; మురాదు గుజరాతు స్వాధీనం చేయబడుతుంది; ఔరంగజేబు కుమారుడు సుల్తాను ముహమ్మదు దక్కనును పొందుతాడు. మిగిలిన సామ్రాజ్యం ఔరంగజేబు పరమౌతుంది. దారా షికో ఒక అవిశ్వాసి అనే కారణం చూపుతూ జహనారా ప్రతిపాదనను ఔరంగజేబు తిరస్కరించాడు.[36]
ఔరంగజేబు సింహాసనం అధిరోహించినప్పుడు జహానారా తన తండ్రితో కలిసి ఆగ్రా కోటలో జైలు శిక్ష అనుభవించింది. అక్కడ ఆమె 1666 లో మరణించే వరకు తన తండ్రి సంరక్షణ కొరకు తనను తాను అంకితం చేసుకుంది.[37][38]
వారి తండ్రి మరణం తరువాత జహానారా ఔరంగజేబు రాజీ పడింది. ఆయన ఆమెకు యువరాణి చక్రవర్తిని అనే బిరుదును ఇచ్చాడు. తరువాత ఆమె రోషనార స్థానంలో ప్రథమ మహిళగా మారింది.[4]
అప్పుడప్పుడు ఔరంగజేబుతో వాదించడానికి ఇతర మహిళలకు లేని కొన్ని ప్రత్యేక అధికారాలతో జహానారా త్వరలోనే తన స్థితిలో తగినంత భద్రత పొందింది. సాంప్రదాయిక మత విశ్వాసాలకు అనుగుణంగా ఔరంగజేబు ప్రజాజీవితాన్ని కఠినంగా నియంత్రించడం ముస్లిమేతరుల మీద పోలు పన్నును పునరుద్ధరించడానికి 1679 లో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమె వాదించింది. ఇదిహిందూ ప్రజలను ఆయనకు దూరం చేస్తుందని ఆమె అన్నది.[39]
జహానారా తన జీవించినప్పుడే ఆమె సమాధిని నిర్మించింది. ఇది పూర్తిగా తెల్లని పాలరాయితో ట్రేల్లిసు పనిచేసిన తెరతో నిర్మించబడింది. ఇది పైకప్పు రహితంగా ఆకాశం కనిపించేలా తెరవబడింది.[40]
ఆమె మరణం తరువాత ఔరంగజేబు ఆమెకు మరణానంతర బిరుదు ఇచ్చారు: సాహిబాత్-ఉజ్-జమాని (యుగపు కన్య).[41] జహానారాను కొత్త ఢిల్లీలోని నిజాముద్దీను దర్గా సమూహంలోని ఒక సమాధిలో ఖననం చేశారు. ఇది " గొప్ప నిరాడంబర చిహ్నం"గా పరిగణించబడుతుంది. సమాధి మీద ఉన్న శాసనం ఈ క్రింది విధంగా లిఖించబడింది:
بغیر سبزہ نہ پو شد کسے مزار مرا
کہ قبر پوش غریباں ہمیں گیاہ و بس است
అల్లాహ్ జీవించేవాడు, నిలబెట్టేవాడు.
పచ్చదనంతో తప్ప ఎవరూ నా సమాధిని కప్పకూడదు,
ఈ గడ్డి పేదలకు సమాధి కవచంగా సరిపోతుంది.
మరణించిన నిరాడంబరమైన యువరాణి జహానారా,
ఖ్వాజా మొయిన్-ఉద్-దిన్ చిష్తి శిష్యురాలు,
విజేత షాజహాను కుమార్తె
అల్లాహ్ తన రుజువును ప్రకాశింపజేస్తాడు.
1092 [సా.శ. 1681]
సర్ థామసు థియోఫిలసు మెట్కాల్ఫు 1843 ఆల్బం ఆధారంగా చాందిని జహనారా బేగం చౌకును రూపకల్పన చేసిందని తెలుస్తుంది.
ఆగ్రాలో ఆమె పాత నగరం నడిబొడ్డున 1648 లో జామి మసీదు లేదా శుక్రవారం మసీదు నిర్మాణానికి ంధిసహాయం చేసింది.[42] ఈ మసీదుకు జహానారా తన వ్యక్తిగత భత్యం నుండి పూర్తిగా నిధులు సమకూర్చింది.[43] ఆమె విద్యను ప్రోత్సహించడానికి జామా మసీదుతో జతచేయబడిన మదర్సాను స్థాపించింది.[44]
రాజధాని నగరం షాజహానాబాదు నిర్మాణరూపకల్పనలో కూడా ఆమె గణనీయమైన ప్రభావాన్ని చూపింది. మహిళలు ఆధ్వర్యంలో షాజహానాబాదు నగరంలోని పద్దెనిమిది భవనాలు నిర్మించబడ్డాయి. వాటిలో ఐదు భవనాలు జహనారా ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయి. షాజహానాబాదు నగర ప్రాకారం లోపల నిర్మించబడిన జహానారా భవన నిర్మాణ ప్రాజెక్టులన్నీ 1650 సంవత్సరంలో పూర్తయ్యాయి. ఆమె ప్రాజెక్టులలో ఓల్డు ఢిల్లీ నగరప్రాకారంలోని ప్రధాన వీధి చాందిని చౌకు బాగా ప్రసిద్ధిచెందింది.
వీధికి తూర్పు వైపున వెనుక తోటలతో ఒక సొగసైన కారవాన్సరై నిర్మించింది. హెర్బర్టు చార్లెసు ఫాన్షావు సెరాయి (1902 లో) ప్రస్తావించాడు:
"చాందిని చౌకు పైకి వెళుతూ ఆభరణాలు, ఎంబ్రాయిడరీలు, ఢిల్లీ హస్తకళలు వంటి పలు ఉత్పత్తులలోని ప్రధాన డీలర్ల అనేక దుకాణాలను దాటిన తరువాత నార్తుబ్రూకు క్లాకు టవరు క్వీన్సు గార్డెంసు ప్రధాన ద్వారం చేరుకోవచ్చు. పూర్వం షా బేగం అనే బిరుదుతో పిలువబడే యువరాణి జహానారా బేగం (పేజి 239) కారవను సారాయి పలైసు రాజభవనాలతో పోల్చాడు. దాని క్రింద ఆర్కేడ్లు, పైన గ్యాలరీలతో ఉన్న గదులు ఉన్నాయి.[45] ఇప్పుడు దీనిని టౌను హాలు అని పిలుస్తారు. చదరపు మధ్యలో ఉన్న కొలను స్థానంలో గ్రాండు క్లాకు టవరు (ఘంటాఘరు) ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.