జనరేషన్ Z
From Wikipedia, the free encyclopedia
ఇది ఆంగ్ల వికీపీడియా "Generation Z" అను వ్యాసంనుంచి కొంతభాగం అనువాదం, మరికొంత చేర్పులతో.
జనరేషన్ Z ను సంక్షిప్తంగా జెన్ Z అని పిలుస్తారు. ఇది దీని ముందు తరం జనరేషన్ ఆల్ఫా లేదా మిలీనియల్స్ తరువాత వచ్చే జనాభా సమూహం.[1] జనరేషన్ Z అనే పేరు, జనరేషన్ X తర్వాత జనరేషన్ Y (మిలీనియల్స్) నుండి అక్షర క్రమంగా వస్తున్న తరం.[2].
పదం వ్యుత్పత్తి
ఈ తరానికి ప్రతిపాదించిన ఇతర పేర్లలో ఐ జెనరేషన్[3], ది హోమ్ల్యాండ్ జనరేషన్[4], నెట్ జెనరేషన్[3], డిజిటల్ నేటివ్స్, [3] నియో - డిజిటల్ నేటివ్స్[5], ప్లూరలిస్ట్ జనరేషన్[3], ఇంటర్నెట్ జనరేషన్[6], సెంటెనియల్స్[7], పోస్ట్ - మిలీనియల్స్ ఉన్నాయి.[8]. మనస్తత్వ శాస్త్రంలో ఆచార్యులు జీన్ ట్వెంగే తన 2017 పుస్తకం ఐజెన్ కోసం ఈ ఐజెనరేషన్ (లేదా ఐజెన్) అనే పదాన్ని ఉపయోగించింది. ఆ సమయంలో ఐప్యాడ్లు, ఐమాక్ కంప్యూటర్లు, ఐఫోన్లు ఉన్నాయి. సెప్టెంబరు 11 దాడుల తరువాత డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వంటి రక్షణాత్మక నిఘా రాష్ట్ర చర్యలు అమల్లోకి వచ్చిన తరువాత బాల్యంలోకి ప్రవేశించిన మొదటి తరాన్ని హోమ్ల్యాండ్ అనే పదం సూచిస్తారు. 2014లో రచయిత నీల్ హోవ్, విలియం స్ట్రాస్తో కలిసి తమ స్ట్రాస్ - హోవ్ తరాల సిద్ధాంతానికి కొనసాగింపుగా హోంల్యాండ్ జనరేషన్ అనే పదాన్ని ఉపయోగిం చారు.[4] ప్యూ రీసెర్చ్ సెంటర్ వారి పరిశోధనలో జనరేషన్ జెడ్ లేదా జెన్ జెడ్ అనే పదం అమెరికాలో ప్రాచుర్యం పొందింది.[9] జనరేషన్ Z పదం, మెరియం -వెబ్స్టర్, ఆక్స్ఫర్డ్ నిఘంటువులు రెండింట్లో ఉంది.[10]
జపాన్లో ఈ సమూహాన్ని నియో - డిజిటల్ స్థానికులు అని వర్ణించారు, డిజిటల్ స్థానికులు ప్రధానంగా పాఠ్యము ( టెక్స్ట్) లేదా కంఠధ్వని (వాయిస్) ద్వారా తెలియచేస్తారు, నియో - డిజిటల్ స్థానికులు దృశ్య మాధ్యమం, దూరవాణి చలనచిత్రాలను ఉపయోగిస్తారు. ఇది నియో - డిజిటల్ జనాభా, పర్సనల్ కంప్యూటర్ నుండి మొబైల్ ఇంకా పాఠ్యము నుండి దృశ్య మాధ్యమానికి మారడాన్ని సూచిస్తోంది.[5]
తరాల వివరణ
ఈ తరాలకు సంబంధించిన కాల పరిధులు వివరించడంలో, భౌగోళిక అంశాలను అనుసరించి కూడా పరిశోధకుల మధ్య కొద్దిగా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి[11]. మెరియం - వెబ్స్టర్, ఆక్స్ఫర్డ్ అంతర్జాల నిఘంటువులు జనరేషన్ Zని " 1990ల చివర, 2000ల ప్రారంభంలో జన్మించిన వ్యక్తుల తరం"గా నిర్వచించింది.[1][12] కాల్లిన్స్ నిఘంటువు" 1990ల మధ్య 2010ల మధ్య జన్మించిన వ్యక్తుల తరానికి, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేవారు" అని నిర్వచించింది.[13] ప్యూ రీసెర్చ్ సెంటర్ 1997ను జనరేషన్ జెడ్ ప్రారంభ సంవత్సరంగా నిర్వచించింది. ఇది " ప్రపంచంలో కొత్త సాంకేతిక, సామాజిక ఆర్థిక పరిణామాలు, సెప్టెంబరు 11 దాడుల వంటి అనుభవాలు కలిగి ఉన్న తరంయని పేర్కొంది.[10]. 2019 నివేదిక 2012 ను ఈ తరం తాత్కాలిక ముగింపు సంవత్సరంగా ఉపయోగించింది.[10] మనస్తత్వవేత్త జీన్ ట్వెంగే జనరేషన్ Zని 1995, 2012 మధ్య జన్మించిన వారిని " iGeneration " శ్రేణితోగా నిర్వచించింది.
సాధారణంగా పాతిక ముఫై ఏళ్లను ఒక తరంగా భావించేవారు. ఇప్పుడు పదేళ్లకే తరాలమధ్య అంతరం కనపడుతోంది. గత అర్ధ శతాబ్దంలో అంతరం తెచ్చిన మార్పులు ఇవి.[14]
- బేబీ బూమర్స్: రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జననాల సంఖ్య పెరిగింది. 1946-64 మధ్య పుట్టిన వారిని 'బేబీ బూమర్స్' అని పిలుస్తున్నారు. కష్టపడి పైకి వచ్చి ఇప్పటి వారికి మార్గదర్శకులైన బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ ఈ తరం వారే.
- జనరేషన్ ఎక్స్: 1965-84 మధ్య పుట్టిన వారు. రాజకీయ ప్రాధాన్యత ఉన్న ఘటనలని చూసిన తరం ఇది. విశాల దృక్పధం కలిగి ఉండి వైవిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ తరం ప్రత్యేకత.
- జనరేషన్ వై: 1985-95 మధ్య పుట్టిన వారిని 'జనరేషన్ వై' తరం అని 'మిలేనియేల్స్' అని కూడా అంటారు. ఇది సాంకేతికంగా పురోగమించిన (టెక్ సావీ) తరం.ఉద్యోగుల ఆత్మవిశ్వాసం, ఎదో సాధించాలన్న స్ఫూర్తితో ఉంటారు. ఉద్యోగుల అభీష్టాలకు అనుగుణంగా మారడం వీరితరం నుంచేనని ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక తెలియ చేస్తోంది.
- జనరేషన్ జెడ్: 1996-2010 మధ్య పుట్టిన వ్యక్తులను జనరేషన్ జెడ్ అని, 'మిలేనియేల్స్ తరువాత తరం' (పోస్ట్-మిలేనియేల్స్) అని పిలుస్తారు. ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలని సామర్ధ్యంతో వినియోగించే వీరిని డిజిటల్ తరం అని అంటారు. రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా పెనుమార్పులకు కారణమయ్యే సత్తా జనరేషన్ జెడ్ కు ఉందని రేపటి ప్రపంచ నిర్మాతలు వీరేనని 'ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక చెపుతోంది.[14] జనరేషన్ Z ప్రస్తుతం భూమిపై అతిపెద్ద తరం.[15] ఐక్యరాజ్యసమితి డేటా 2019 లో జెనరేషన్ జెడ్ సభ్యులు 2.47 బిలియన్లు (భూమిలోని 7,7 బిలియన్ల నివాసితులలో 32%) ఉన్నారు, ఇది మిలీనియల్ జనాభాను 2.43 బిలియన్లను అధిగమించింది.[16]
తరం | కాల వ్యవధి
(సుమారుగా) |
ఇతర పేర్లు | |
---|---|---|---|
1 | నిశ్శబ్ద తరం | 1928-1945 | |
2 | బేబీ బూమర్స్ | 1946-1964 | |
3 | జనరేషన్ ఎక్స్ | 1965-1984. * | |
4 | జనరేషన్ వై | 1985-1995. ** | మిలేనియేల్స్ |
జిలేనియేల్స్ | 1993-1998 | ||
5 | జనరేషన్ జెడ్ | 1996-2010 *** | జెన్ జెడ్, నెట్ జెనరేషన్, ఐ జెనరేషన్,
ది హోమ్ల్యాండ్ జనరేషన్, పోస్ట్ మిలేనియేల్స్ |
6 | జనరేషన్ ఆల్ఫా | 2012లు - 2020ల
వరకు |
మినీ మిలీనియల్స్, జెన్ ఆల్ఫా,
"జెన్ సి" లేదా "జనరేషన్ కోవిడ్ |
* 1965-80 ** 1981-96. ***. 1997 -2012[11][17] |
- జిలేనియేల్స్: 'మిలేనియేల్స్'కి, జనరేషన్ జెడ్ కి మధ్య తరం అంటే 1993-98 సంవత్సరాల మధ్య పుట్టిన వ్యక్తులని 'జిలేనియేల్స్' అంటారు. వీరు రెండు తరాలకు వారధులు. రెండు తరాలకు చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నవాళ్ళు. ముంబైదాడులు, ఆర్థిక మాంద్యం చూసిన వారు. అన్ని రంగాలలో ఉత్పత్తి పెంచుతూ సంపద సృష్టించే వాళ్ళు.[18]
- జనరేషన్ ఆల్ఫా: జెన్ జెడ్ తరువాత తరం 2010 - 2025 మధ్యకాలంలో జన్మించిన లేదా పుట్టబోయే వ్యక్తులను వివరించడానికి జనరేషన్ ఆల్ఫా లేదా జెన్ ఆల్ఫా అని పిలుస్తారు. 'జెన్ ఆల్ఫా' పదాన్ని మార్క్ మెక్‌క్రిండిల్ అనే ఆస్ట్రేలియన్ సామాజిక పరిశోధకుడు మొదట ఈ అంశాన్ని 2008 నివేదికలో ప్రవేశపెట్టారు. X, Y, Z తరాలను అనుసరించి లాటిన్ వర్ణమాల కాకుండా గ్రీకు అక్షరంతో పేరు పెట్టబడిన మొదటి తరం ఆల్ఫా. జెన్ ఆల్ఫా వారు కోవిడ్ 19 మహమ్మారి, దాని ప్రతిస్పందనలు తాకిన ప్రపంచంలో పూర్తిగా ఎదగే మొదటి తరం. కొంతమంది పరిశోధకులు ఈ తరాన్ని "జెన్ సి" లేదా "జనరేషన్ కోవిడ్" అని పేర్కొన్నారు.[11]
జెన్ Z తరం లక్షణాలు
మునుపటి తరాలతో పోలిస్తే జనరేషన్ జెడ్ మరింత విద్యావంతులై, మంచి ప్రవర్తన కలిగిన, ఒత్తిడికి గురైన తరం అని 'ది ఎకనామిస్ట్ 'అభివర్ణించింది.[19]
అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశము, ఇండోనేషియా, ఇజ్రాయెల్, జపాన్, న్యూజిలాండ్, రష్యా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ దేశాలలో జనరేషన్ Z యువత వారి వ్యక్తిగత జీవితాల్లోని వ్యవహారాలు, పరిస్థితులతో మొత్తంగా సంతోషంగా ఉన్నారని (59%) ' హ్యాపీనెస్ స్కోర్ ' తెలియ చేస్తోంది. అత్యంత అసంతృప్తులు దక్షిణ కొరియా (29%), జపాన్ (28%) లు అయితే సంతోషకరమైనది ఇండోనేషియా (90%), నైజీరియా (78%) తదితరులు.

వారి వ్యక్తిగత విలువలు వారి కుటుంబాలకు, తాము జీవితంలో ముందుకు సాగడానికి సహాయపడుతున్నాయి. యువతకు ముఖ్యమైన అంశాలు వారి కుటుంబాలు (47%), ఆరోగ్యం (21%), ప్రపంచ సంక్షేమం (4%) వాటి స్థానిక సంఘాలు (1%) వరుసగా ఉన్నాయి.[20]
వివిధ యువత ఉప సంస్కృతుల మధ్య సరిహద్దులు అస్పష్టంగా ఉన్నాయి. వ్యామోహం, మనోభావాలు పెరిగాయి.[21][22]
ప్రపంచవ్యాప్తంగా 21వ శతాబ్దపు మొదటి రెండు దశాబ్దాలలో, కాల్పనిక రచనల రాయడం, చదవడం అభిమానాలను సృష్టించడం ప్రబలమైన కార్యకలాపంగా మారింది. అభిమానుల కథలు చదివి వ్రాసినవారు వారి కౌమారంలో, ఇరవైలలో స్త్రీలు అధికంగా యువత ఉన్నారు.[23]
జనరేషన్ Zలో సంగీత వినియోగం విషయానికి వస్తే సంగీతం వినేవారికి 'స్పాటిఫై' మొదటి స్థానంలో నిలిచింది.[24]

COVID - 19 మహమ్మారి మాంద్యం ఉన్నప్పటికీ ఇప్పటికీ 'జనరేషన్ Z' తరం ప్రయాణాల మీద మక్కువ సూచిస్తుంది. వారు శారీరకంగా చురుకుగా ఉండి ప్రయాణాలకు ఇష్టపడతారు
'జనరేషన్ Z' తరం మొబైల్, స్నేహపూర్వక వెబ్సైట్లు, సామాజిక - మాధ్యమాలతో కాలం గడపడం ముఖ్యముగా పరిగణిస్తారు.[25] వారు అంతర్జాలంలో ఒకరితో ఒకరి పరస్పర చర్య (ఇంటరాక్షన్) చేసే విధానం ముందు తరాలకు భిన్నంగా ఉంటుంది. ఫేస్‌బుక్, ట్విటర్ లేదా బ్లాగ్‌లు వంటి సామాజిక మాధ్యమాలలో అత్యంత వ్యక్తిగత, బహిరంగ సమాచారం పంచుకుంటారు.[26]
ఈ వ్యక్తుల ఎంపిక, కొనుగోలు చాలావరకు అంతర్జాల వాణిజ్య వేదిక (ఇ -కామర్స్ వెబ్ సైట్) ల ద్వారా జరుగుతుంది. వారి కొనుగోళ్లు మీద సోషల్ మీడియా "ఇన్ఫ్లుయెన్సర్స్" ప్రభావం, తోటివారి ఒత్తిడి ఉంటుంది.[27]
జనరేషన్ Z తరం అప్పటి పెద్దవారి కంటే డిజిటల్ యుగంలో జీవితానికి చాలా మెరుగ్గా అలవాటు పడ్డారని తెలుస్తోంది. పర్యావరణ స్పృహ, కొన్ని ఆదర్శాలకు లోనై ఉంటారు. ఈ తరం భౌగోళికంగా భిన్నత్వం కలిగి ఉంటుంది. తమను తాము సరిదిద్దుకుంటూ ఇతరులను సంరక్షిస్తూ విభిన్న సమూహాల సమస్యలను సహకారము, విశ్వాసనీయత, ఔచిత్యం, అనుకూలత, క్రమానుగత విధానం, ఆచరణాత్మక వైఖరితో పరిష్కరించడానికి చేయవలసిన పని గురించి స్పష్టత కలిగి ఉంటారు.[28]
జనరేషన్ ఆల్ఫా, సహస్రాబ్ది (జనరేషన్ Y) తరంతో ముడిపడి ఉంటుంది, ఎందుకంటే జనరేషన్ ఆల్ఫాలోని చాలా మందికి సహస్రాబ్ది తల్లిదండ్రులు ఉన్నారు. అందుకని వారిని "మినీ మిలీనియల్స్" అని పిలుస్తారు. ఇది ప్రస్తుతం కొనసాగుతున్న తరం. వారు సాధారణంగా మిలీనియల్స్ తల్లిదండ్రుల ప్రభావంలో ఉన్నారు. కోవిడ్ మహమ్మారి జనరేషన్ ఆల్ఫాను ఇప్పటికే సాంకేతికతలో ఉన్న పద్ధతులను వేగవంతం చేసింది. మిలీనియల్స్ వారి పిల్లలు పుట్టినప్పటి నుండి అంతర్జాల ఉపకరణాలు, టాబ్లెట్లు, కంప్యూటర్లు, లాప్ టాప్లు ద్వారా ఛాయాచిత్రాలు, వీడియోలు, కథనాలను, సామజిక మాధ్యమాలలో పంచుకోవడం, బాల్యం నుండి దూర (రిమోట్) తరగతులకు, సర్వవ్యాప్త (స్ట్రీమింగ్) ప్రసారాలను వీక్షించడము, దృశ్య శ్రవణ యంత్రాల (వీడియో కాల్‌లు) ద్వారా సంభాషణలు, సంప్రదింపులు, సమావేశాలు, దూర తరగతులు మొదలైన వాటికి అలవాటుపడతారు. సిరి, అలెక్సా వంటి కంఠ ధ్వని (వాయిస్ అసిస్టెంట్‌లు) కి స్పందించే ఉపకరణాలు, చాట్ జిపిటి వంటి సహజ భాషాపద్ధతులు అనుసరించే సాధనాల ద్వారా కృత్రిమ మేధస్సు (AI) వినియోగాయానికి ఎక్కువగా ప్రభావితమవుతారు.[11]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.