From Wikipedia, the free encyclopedia
ప్రాథమిక రుచులైన షడ్రుచులలో ఒకటి చేదు. చేదు రుచి గల ఆహార పదార్థాలు నోటికి రుచించవు. ఔషధాలు ముఖ్యంగా చేదు రుచిని కల్గి ఉంటాయి. వేప ఆకులు, వేప పూత చేదు రుచిని కలిగి ఉంటాయి. వేప పుల్లలు చేదుగా ఉన్నప్పటికి ఆ పుల్లతో పళ్లు తోముకోవడం వలన నోటిలోని క్రిములు చనిపోయి పళ్లు శుభ్రం అవుతాయి. చేదు తీపికి వ్యతిరేకమని చెప్పవచ్చు. కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువ చేదు రుచిని, కొన్ని ఆహార పదార్థాలు తక్కువ చేదు రుచిని కలిగి ఉంటాయి. చేదు పదార్థాలు గాఢమైన వాసన కలిగి ఉంటాయి.
కొన్ని ఆహార పదార్థాములను నిల్వ చేయుటకు చేదు రుచిగల వేప ఆకులను వాడుతారు, దీని వల్ల ఆహార పదార్థములు చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. బియ్యంలో పురుగు పట్టకుండా ఉండేందుకు అందులో వేపాకులను ఉంచుతారు.
కాకర - కాయర కాయలు చేదు రుచిని కలిగి ఉంటాయి, వీటిని కూర చేసుకొనేటప్పుడు కూరలో చక్కెర కలపడం ద్వారా చేదుదనం తగ్గిస్తారు.
జీవితంలో ఎదురయ్యే కొన్ని బాధాకరమైన సంఘటనలను చేదు అనుభవాలు అంటారు.
ఉగాది రోజున తయారు చేసే ఉగాది పచ్చడిలో చేదు రుచి కోసం వేప పూతను ఉపయోగిస్తారు.
చేదు రుచి గల ఆహార పదార్థాలను కొందరు ఇష్టంగా భుజిస్తారు. ఆరోగ్య సంరక్షణ కొరకు కొందరు చేదు రుచి గల ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటారు.
చేదు అనునది అన్ని రుచులలో అతి సున్నితమైన రుచి. ఇది చాలా మందికి అప్రియమైన, కఠినమైన లేదా అంగీకారయోగ్యంగా లేని రుచి. కానీ కొన్ని సమయాలో ఇది అవసరమైనది, ఉద్దేశ్యపూర్వకంగా కొన్ని చేదు గల పదార్థాలను తీసుకోవససి వస్తుంది. సాధారణ చేదు పదార్థములు, కాఫీ వంటి పానీయాలు, తీపిగా లేని "హాట్ చాక్లెట్", దక్షిణ అమెరికా లో "మేట్" అనే పానీయం, కొన్ని రకాల మిఠాయి దినుసులు, కాకరకాయ, బీరు(చేదుగా గల ఒక ఔషథం), ఆలివ్(ఫలం), పీల్(ఫలం), బ్రెసికాసి వర్గానికి చెందిన అనేక చెట్లు, డాండెలియన్(ఒక రకపు అడవి మొక్క) ,వైల్డ్(చికోరీ), క్వినైన్ వంటీ వాటిలో కూడా చేతు తత్వము ఉంటుంది. టోనిక్ నీటిలో కూడా చేదు తత్వం ఉంటుంది.
చేదుదనము అనునది జీవపరిమాణం అధ్యయనం, ఆరోగ్య పరిశోధనలు చేయువారికి యిష్టంగా ఉంటుంది.[1][2] చేదుగా ఉన్న పదార్థములలో చాలా పదార్థములు విషపూరితమైనవి. చేదుగా గల పదార్థములలో విషపూరితమైన వాటిని గుర్తించు సామర్థ్యం కలిగి యుండటం ఒక ముఖమైన రక్షణ ప్రమేయంగా ఉంటుంది.[1][2][3] మొక్కల పత్రాలు తరచుగా విషపదార్థాలను కలిగి ఉంటుంది. ఆకులు తిని జీవించే వానర జాతి జంతువులు అపక్వమైన ఆకులను మాత్రమే తీసుకొనుటకు యిష్టపడతాయి. ఎందువలనంటే వాటిలో అధిక ప్రోటీన్లు(మాంసకృత్తులు), తక్కువ ఫైబర్(పీచుపదార్థం), విషపదార్థములు పక్వమైన ఆకులకంటే తక్కువ ఉంటుంది.[4] మానవుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆహార పదార్థములలో గల విషమయ పదార్థాలు లేకుండాచేసి రుచికరంగా తయారుచేసే అనేక ఆహార విశ్లేషణా పద్ధతులు కలిగి ఉన్నారు.[5]
క్వినైన్ లో చేదు తత్వం యొక్క గాఢత సుమారు 0.000008 M ఉంటుంది[1] .యితర చేదు పదార్థములలో చేదు స్వభావం క్వినైన్ తో సాపేక్షంగా రిఫరెన్స్ ఇండెక్స్ 1 గా ఉంటుంది[1][6]. ఉదాహరణకు "బ్రూసైన్" కు ఇండెక్స్ 11 ఉంటుంది. ఇది క్వినైతో పోల్చితే చాలా ఎక్కువ చేదుదనము, ఇది చాలా విలీన ద్రావణంలో కూడా ఉంటుంది. [1] సంశ్లేషణా రసాయన పదార్థమైన డినాటోనియం లో అధికమైన చేదు ఉంటుంది.ఇది అతి చేదుగా ఉన్న పదార్థము. దీని ఇండెక్స్ 1,000 వరకు ఉంటుంది[6]. దీనిని "అవెర్సివ్ కారకం" గా అకస్మాత్తుగా మ్రింగుటను నిరోధించుటకు యితర పదార్థాలతో కలిపి ఉపయోగిస్తారు. దీనిని 1958 లో లిగ్నోకైన్ పరిశోధనా ఫలితంగా కనుగొన్నారు. ఇది స్థానిక ఎలస్థీటిక్ అయిన "మాక్ ఫార్లన్ స్మిత్" , స్కాట్లండ్ చే కనుగొనబడింది.
Seamless Wikipedia browsing. On steroids.