పశ్చిమాఫ్రికా దేశం From Wikipedia, the free encyclopedia
గునియా-బిస్సొ పశ్చిమ ఆఫ్రికాలోని దేశాలలో ఇది ఒకటి. 36,125 చదరపు కిలోమీటర్లు. (3.8885 × 1011 చ.) కన్నా 18,15,698.
Republic of Guinea-Bissau | |
---|---|
నినాదం: "Unidade, Luta, Progresso" (Portuguese) "Unity, Struggle, Progress" | |
గీతం: Esta é a Nossa Pátria Bem Amada (Portuguese) This is Our Beloved Homeland | |
Location of గినియా-బిస్సావు (dark blue) – in Africa (light blue & dark grey) | |
రాజధాని | Bissau 11°52′N 15°36′W |
అధికార భాషలు | Portuguese |
గుర్తించిన జాతీయ భాషలు | Upper Guinea Creole |
జాతులు |
|
పిలుచువిధం | Bissau-Guinean[1] |
ప్రభుత్వం | Unitary semi-presidential republic |
• President | José Mário Vaz |
• Prime Minister | Aristides Gomes |
శాసనవ్యవస్థ | National People's Assembly |
Independence from Portugal | |
• Declared | 24 September 1973 |
• Recognized | 10 September 1974 |
విస్తీర్ణం | |
• మొత్తం | 36,125 కి.మీ2 (13,948 చ. మై.) (134th) |
• నీరు (%) | 22.4 |
జనాభా | |
• 2016 estimate | 1,815,698[2] (148th) |
• జనసాంద్రత | 46.9/చ.కి. (121.5/చ.మై.) (154th) |
GDP (PPP) | 2018 estimate |
• Total | $3.391 billion[3] |
• Per capita | $1,951[3] |
GDP (nominal) | 2018 estimate |
• Total | $1.480 billion[3] |
• Per capita | $851[3] |
జినీ (2002) | 35 medium |
హెచ్‌డిఐ (2017) | 0.455[4] low · 177th |
ద్రవ్యం | West African CFA franc (XOF) |
కాల విభాగం | UTC+0 (GMT) |
వాహనాలు నడుపు వైపు | right |
ఫోన్ కోడ్ | +245 |
ISO 3166 code | [[ISO 3166-2:Lua error in package.lua at line 80: module 'Module:ISO 3166/data/GN' not found.|Lua error in package.lua at line 80: module 'Module:ISO 3166/data/GN' not found.]] |
Internet TLD | .gw |
గినియా-బిస్సూ ప్రాంతం గతంలో గాబు సామ్రాజ్యంలో, అలాగే మాలి సామ్రాజ్యంలో భాగంగా ఉంది. ఈ సామ్రాజ్యం భాగంగా ఈ ప్రాంతం 18 వ శతాబ్దం వరకు (ఇతర ప్రాంతాలు 16 వ శతాబ్దం నుండి పోర్చుగీసు సామ్రాజ్యం పాలనలో ఉండేవి) కొనసాగింది. 19 వ శతాబ్దంలో ఇది పోర్చుగీస్ గినియా పేరుతో వలసప్రాంతం అయింది. తరువాత 1973 లో స్వాతంత్ర్యం ప్రకటించి 1974 లో గుర్తింపు పొందింది. దాని రాజధాని బిస్సా పేరు గినియా (గతంలో ఫ్రెంచ్ గినియా) తో చేర్చి దేశం పేరుగా (గందరగోళాన్ని నివారించడానికి) నిర్ణయించబడింది. స్వాతంత్ర్యం తరువాత గినియా-బిసవులో రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఎన్నికచేయబడిన అధూక్షుడు పూర్తి ఐదు సంవత్సరాల కాలానికి పదవిలో కొనసాగుతాడు.
జనాభాలో కేవలం 14% మంది మాత్రమే అధికారిక, జాతీయ భాషగా స్థిరపడిన పోర్చుగీస్ భాషను మాట్లాడగలరు. పోర్చుగీసు క్రియోలే కంటిన్యూంలో క్రియోలో అనబడుతుంది. ఇది పోర్చుగీస్ క్రియోల్ జనాభాలో సగము జనాభా (44%) వాడుక భాషగా ఉంటూ పెద్ద సంఖ్యలో రెండవ భాషగా ఉంది. మిగిలిన స్థానిక ఆఫ్రికన్ భాషలలో వివిధ రకాల భాషలు వాడుక భాషలుగా ఉన్నాయి. గినియా-బిస్సాలో విభిన్న మతాలు ఉన్నాయి. సి.ఐ.ఎ. వరల్డ్ ఫాక్ట్ బుక్ (2018) ఆధారంగా 40% ముస్లింలు, 22% క్రైస్తవులు, 15% యానిమేటర్లు, 18% పేర్కొనబడని ఇతర మతవిశ్వాసులు ఉన్నారు. ప్రపంచంలో అతి తక్కువ తలసరి స్థూల దేశీయోత్పత్తి ఉంది.
గినియా-బిస్సౌ సార్వభౌమ దేశంగా ఉంది. ఇది ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికన్ యూనియన్, పశ్చిమ ఆఫ్రికన్ స్టేట్స్ ఆర్థిక సమాజం, ఇస్లామిక్ సహకార సంస్థ, పోర్చుగీస్ భాష దేశాల సమాజం, లా ఫ్రాంకోఫోనీ, దక్షిణ అట్లాంటిక్ పీస్ అండ్ కోఆపరేషన్ జోన్ లో సభ్యదేశంగా ఉంది. ప్రస్తుతం అమలులో లేని లాటిన్ యూనియన్ సభ్యదేశంగా ఉంది.
గినియా-బిస్సా ఒకసారి మాలి సామ్రాజ్యం సామంతరాజ్యం గాబు రాజ్యంలో భాగంగా ఉండేది. 18 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతం మాలి సామ్రాజ్యంలో భాగంగా కొనసాగింది. ప్రస్తుత దేశంలోని ఇతర ప్రాంతాలు పోర్చుగీసు వారి సామ్రాజ్యంలో భాగంగా ఉండివుంటాయని భావిస్తున్నారు.[5] పోర్చుగీస్ గినియాను స్లేవ్ కోస్టు (బానిసతీరం) అని పిలిచేవారు. యురేపియన్లు ఆఫ్రికన్ బానిసలను పశ్చిమార్ధగోళానికి ఎగుమతి చేయడానికి ఇది ప్రధాన కేంద్రంగా ఉండడమే ఇందుకు కారణం.
వెనీషియన్ ఆల్విస్ కాడామోస్టో 1455 లో సముద్రయానం,[6] 1479-1480 లో ఫ్లెమిష్-ఫ్రెంచ్ వ్యాపారి " ఇస్టాచీ డి లా ఫోస్సే " సముద్రయానకథనం,[7] డియాగో కాయో 1479-1480 ప్రయాణం ఈ ప్రాంతానికి చేరుకున్న యూరోపియన్ల ప్రారంభ నివేదికగా పరిగణనలోకి తీసుకొనబడింది. 1480 లలో ఈ పోర్చుగీస్ అన్వేషకుడు కాంగో నది, బొక్కోంగ్ భూభాగాలను చేరుకున్నాడు. ఇది ఆధునిక అంగోలా పునాదులను స్థాపించింది. ఇది గినియా-బిస్సా నుండి ఆఫ్రికన్ తీరంలో 4200 కిమీ దూరంలో ఉంది.[8]
16 వ శతాబ్దంలో పోర్చుగీసు వారు వలసలకు ఈ ప్రాంతం నదులు, సముద్రతీరం మొదటి స్థావరాలుగా ఉన్నప్పటికీ వారు 19 వ శతాబ్దం వరకు అంతర్గతంగా స్థావరాలు స్థాపించబడలేదు. గినియాలోని స్థానిక ఆఫ్రికన్ పాలకులలో కొందరు బానిస వాణిజ్యం నుండి గొప్పగా అభివృద్ధి చెంది లోతట్టు వాణిజ్యాన్ని నియంత్రించారు. ఫలితంగా యూరోపియన్లను అంతర్గతంగా అనుమతించలేదు. వారిని కోటలు నిర్మించి సంరక్షించబడిన తీరప్రాంత తీరప్రాంతాలకు మాత్రమే పరిమితం చేసారు.[9] బానిస వ్యాపారులకు వ్యతిరేకంగా పోరాడిన ఆఫ్రికన్ కమ్యూనిటీలు కూడా ఐరోపా సాహసికులను, స్థావరాలను విశ్వసించలేదు. గినియాలోని పోర్చుగీసు స్థావరాలు అధికంగా బిసాబు, కాచే ఓడరేవులకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. కొంతమంది ఐరోపా స్థిరనివాసులు బిసౌ, లోతట్టు నదీప్రాంతాలలో జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాలలో తోటలు ఏర్పాటు చేశారు.[9]
1790 లలో కొంతకాలం బోలమాలో సమీపంలోని ద్వీపంలో ప్రత్యర్థి స్థావరం ఏర్పాటు చేయడానికి బ్రిటిషు ప్రభుత్వం ప్రయత్నించింది.[10] 19 వ శతాబ్దం నాటికి పోర్చుగీస్ సరిహద్దు తీరప్రాంత సమీపంలో ఉన్న తీరప్రాంతాన్ని వారి సొంత ప్రత్యేక భూభాగంగా (దక్షిణ సెనెగల్ ఉత్తరప్రాంతం వరకు ) ఉన్నట్లుగా భావిస్తారు.
1956 లో అమిల్కర్ కాబ్రాల్ నాయకత్వంలో " గినియా, కేప్ వెర్డే ఆఫ్రికన్ పార్టీ " ప్రారంభించిన సాయుధ తిరుగుబాటు అప్పటి పోర్చుగీసు గినియాలో క్రమంగా పట్టు సాధించింది.[11] ఇతర పోర్చుగీసు కాలనీలలో గెరిల్లా కదలికల వలె కాకుండా పి.ఎ.ఐ.జి.సి. ఈ ప్రాంతంలోని భాగాలపై సైనిక నియంత్రణ వేగంగా విస్తరించింది. ఇది అడవి భూభాగంతో పొరుగునున్న మిత్రరాజ్యాలతో సరిహద్దు రేఖలను చేరుకుని క్యూబా, చైనా, సోవియట్ యూనియన్, లెఫ్ట్-లీనింగ్ ఆఫ్రికా దేశాల నుండి పెద్ద పరిమాణంలో ఆయుధాలు సేకరించింది.[12] ఫిరంగి నిపుణులు, వైద్యులు, సాంకేతిక నిపుణులను సరఫరా చేయడానికి క్యూబా అంగీకరించింది.[13] పి.ఎ.ఐ.జి.సి. వైమానిక దాడికి వ్యతిరేకంగా తనను కాపాడుకోవడానికి గణనీయమైన విమాన విధ్వంసక సామర్ధ్యాన్ని సంపాదించగలిగింది. 1973 నాటికి పి.ఎ.ఐ.జి.సి. గినియాలోని పలు ప్రాంతాల్లో నియంత్రణలోకి తీసుకుంది. 1973 జనవరిలో కబ్రాల్ హత్యకు గురైనప్పుడు ఈ ఉద్యమం ఎదురుదెబ్బ తగిలింది.[14]
1973 సెప్టెంబరు 23 లో గినియా-బిస్సావు స్వతంత్రం ప్రకటించబడింది. 1974 ఏప్రిల్ 25 న పోర్చుగీసులో సామ్యవాద-ప్రేరేపిత సైనిక తిరుగుబాటు తరువాత లిస్బన్ ఎస్టాడో నోవో పాలన ముగింపు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది.[15]
అమిల్కారు సోదరుడు, పి.ఎ.ఐ.జి.సి. సహ-వ్యవస్థాపకుడు లూయిస్ కాబ్రాల్ గినియా-బిస్సా మొదటి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. స్వాతంత్ర్యం తరువాత పి.ఎ.ఐ.జి.సి పోలీసు సైన్యం, గెరిల్లాలకు వ్యతిరేకంగా పోరాడిన వేలమంది స్థానిక గినియా సైనికులను చంపింది. కొంతమంది తప్పించుకుని పోర్చుగలు లేదా ఇతర ఆఫ్రికన్ దేశాలలో స్థిరపడ్డారు.[16] వీటిలో బిసోరా పట్టణంలో జరిగిన ఊచకోత సంఘటన ఒకటి. 1980 లో పి.ఎ.ఐ.జి.సి. వార్తాపత్రిక " నోవో పిన్ట్చా " (1980 నవంబరు 29 న తేదీన) లో అంగీకరించింది. అనేకమంది గినియాన్ సైనికులు కుమార్, పోర్టోగోల్, మన్సాబా అడవులలో ఉరితీయబడి సామూహికంగా ఖననం చేశారు.
1984 వరకు ఈ దేశం " రివల్యూషన్ కౌంసిల్ " నియంత్రణలో ఉంది. 1994 లో మొట్టమొదటి బహుళ-పార్టీ ఎన్నికలు జరిగాయి. 1998 మేలో సైన్యం తిరుగుబాటు గైనీ-బిసుయో సివిల్ వార్ తరువాత 1999 జూన్ లో అధ్యక్షుడిని తొలగించబడ్డాడు.[17] 2000 లో నిర్వహించిన ఎన్నికలలో కుంబ ఐలా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[18]
2003 సెప్టెంబరులో ఒక సైనిక తిరుగుబాటు జరిగింది. " సమస్యలను పరిష్కరించలేకపోవడం " అనే ఆరోపణపై మిలటరీ ఐలాను అరెస్టు చేసింది.[19] అనేక సార్లు జాప్యం చేసిన తరువాత 2004 మార్చి మార్చిలో శాసన ఎన్నికలు జరిగాయి. 2004 అక్టోబరులో సైనిక దళాల తిరుగుబాటు సమయంలో సైనిక దళాల అధిపతి మరణంతో విస్తృతమైన అశాంతి ఏర్పడడానికి కారణమైంది.
2005 జూన్ లో ఐలాయాను తొలగించిన తరువాత మొదటిసారిగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఐలా పి.ఆర్.ఎస్. అభ్యర్థిగా పోటీ చేసి తిరిగి దేశ చట్టబద్ధమైన అధ్యక్షుడుగా రావడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ 1999 లో పదవీచ్యుతుడైన మాజీ అధ్యక్షుడు " జోవో బెర్నార్డో వియెరా " ఎన్నికలలో విజయం సాధించాడు. వియారా ఎన్నికలో మలాం బకాయ్ సంహాను ఓడించాడు. సంహా ప్రారంభంలో అపజయాన్ని నిరాకరించాడు. ఎన్నికలలో రాజధాని బిసావుతో సహా రెండు నియోజకవర్గాలలో మోసం జరిగిందని సంహా ఆరోపించారు. [20]
ఎన్నికల ముందు దేశంలోకి ప్రవేశించే ఆయుధాల నివేదికలు, "ప్రచార సమయంలో కొన్ని ఆటంకాలు", గుర్తించని ముష్కరులు, విదేశీ ఎన్నికల పర్యవేక్షకుల, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు వంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ 2005 ఎన్నికల మొత్తం "ప్రశాంతంగా, వ్యవస్థీకృత"గా నిర్వహించబడ్డాయని పేర్కొన్నారు.[21]
మూడు సంవత్సరాల తరువాత 2008 నవంబరులో నిర్వహించబడిన పార్లమెంటరీ ఎన్నికలలో పి.ఎ.ఐ.గి.సి. 100 లో 67 సీట్లతో బలమైన పార్లమెంటరీ మెజారిటీని గెలుచుకుంది.[22] 2008 నవంబరులో అధ్యక్షుడు వియారా అధికారిక నివాసం సైనిక దళాల సభ్యులచే దాడి చేయబడి ఒక గార్డును చంపింది కానీ అధ్యక్షుడు క్షేమంగా తప్పించుకున్నాడు.[23]
జనరల్ బాటిస్టా టాగే నా వై, జాయింట్ చీఫ్ అధిపతి బాంబుపేలుడులో మరణించినందుకు ప్రతీకారంగా మరుసటిరోజు 2009 మార్చి 2 న వైయారా ఒక సైనికబృందం చేతిలో హత్యకు గురయ్యాడు.[24] వియారా మరణం హింసాకాండను ప్రేరేపించనప్పటికీ కానీ న్యాయవాదిబృందం స్విస్పేస్ దేశంలో సంక్షోభ సంకేతాలు ఉన్నాయని పేర్కొన్నది. [25] దేశంలో సైనిక నాయకులు రాజ్యాంగ వారసత్వాన్ని గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేశారు. 2009 జూన్ 28 న దేశవ్యాప్తంగా ఎన్నికల వరకు జాతీయ అసెంబ్లీ స్పీకర్ రమందో పెరెరా తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించబడ్డాడు.[26] ఎన్నికలలో పిఆర్ఐసీ అభ్యర్థిగా కుంబా ఇలాకు వ్యతిరేకంగా, పి.ఎ.ఐ.జి.సి. మలామ్ బకాయి సన్హాకు విజయం లభించింది.
2012 జనవరి 9 న అధ్యక్షుడు సంహ మధుమేహం కారణంగా తీవ్రమైన ఆరోగ్యసమస్యలను ఎదుర్కొన్నాడు. పెరీరా తిరిగి తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 2012 ఏప్రిల్ 12 న సాయంత్రం దేశ సైనికాధికారులు ఒక తిరుగుబాటు కార్యక్రమాన్ని నిర్వహించి తాత్కాలిక అధ్యక్షుడు, ప్రముఖ అధ్యక్ష అభ్యర్థిని ఖైదు చేశారు.[27] మాజీ ఉపాధ్యక్షుడు జనరల్ మమదు తూర్ కురుమా తాత్కాలికంగా దేశ నియంత్రణను చేపట్టి ప్రతిపక్ష పార్టీలతో చర్చలు ప్రారంభించారు.[28][29]
గినియా-బిస్సా ఉత్తర సరిహద్దులో సెనెగల్, దక్షిణ, తూర్పున గినియా, పశ్చిమ సరిహద్దులో అట్లాంటిక్ మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. ఇది 11 ° నుండి 13 ° ఉత్తర అక్షాంశంలో (చిన్న ప్రాంతం 11 ° దక్షిణానికి), 13 ° నుండి 17 ° పశ్చిమరేఖాంశంలో ఉంది.
36,125 చదరపు కిలోమీటరు (13,948 చ.మై) దేశంవైశాల్యపరంగా తైవాన్, బెల్జియం పరిమాణంలో పెద్దది. ఇది తక్కువ ఎత్తులో ఉంది. అత్యధిక ఎత్తైన శిఖరం ఎత్తు 300 మీటర్లు (984 అడుగులు). తూర్పున గినియాన్ అటవీ-సవన్నా పెరిగిన గినియా మడ అడవుల చిత్తడి నేలలు, చాలా తక్కువ తీరప్రాంత మైదానం ఉన్నాయి.[30] వేడి వాతావరణ సీజన్ తరువాత వర్షాకాలం మొదలౌతుంది. సహారా నుండి పొడిగా ఉండే హర్మట్టన్ గాలులు వీస్తుంటాయి.[31]
సంవత్సారం అంతా వెచ్చని వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఉంటాయి. సగటు ఉష్ణోగ్రతలు 26.3 ° సెంటీగ్రేడు (79.3 ° ఫారెన్ హీటు) ఉంటుంది. బిస్సావు సగటు వర్షపాతం 2,024 మిల్లీమీటర్లు (79.7 లో). దాదాపు పూర్తిగా జూన్ నుండి సెప్టెంబరు / అక్టోబరు మధ్య వర్షాలు ఉంటాయి. డిసెంబరు నుండి ఏప్రిల్ వరకూ దేశం కరువును అనుభవిస్తుంది.[32]
గినియా-బిస్సా తలసరి జ్.డి.పి. ప్రపంచంలోనే అతి తక్కువగా ఉంది. దేశ మానవాభివృద్ధి సూచిక ప్రపంచదేశాలలో అతి తక్కువగా ఉంది. జనాభాలో మూడింట రెండు వంతులకు పైగా దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు.[33] ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. చేపలు, జీడిపప్పులు, వేరుచనగలు ప్రధానంగా ఎగుమతి చేయబడుతుంది.
దీర్ఘకాలిక రాజకీయ అస్థిరత ఆర్థిక కార్యకలాపాల సంక్షోభానికి, క్షీణిస్తున్న సాంఘిక పరిస్థితులు, స్థూల ఆర్థిక అసమానతలు అధికరించడానికి కారణంగా మారింది. సురినామ్ మినహా ప్రపంచంలో ఏ ఇతర దేశానికంటే గినియా-బిస్సాలో కొత్త వ్యాపారాన్ని నమోదు చేసుకోవటానికి సగటున ఎక్కువ (233 రోజులు) సమయం పడుతుంది.[34]
దేశం ప్రధాన రాజకీయ పార్టీలు.ఎం.ఎఫ్. ఆధారిత నిర్మాణాత్మక సంస్కరణ కార్యక్రమం ప్రారంభించిన తరువాత గినియా-బిస్సాలో కొన్ని ఆర్థిక పురోగతులు ప్రారంభం అయ్యాయి.[35] ఆర్థిక క్రమశిక్షణను సాధించడం, ప్రజా పరిపాలన పునర్నిర్మించడం, ప్రైవేటు పెట్టుబడుల కోసం ఆర్థిక వాతావరణాన్ని మెరుగుపరచడం, ఆర్థిక విస్తరణను ప్రోత్సహించడం వంటివి దేశంలో కీలక సవాళ్లుగా మారాయి. 1974 లో పోర్చుగల్ నుండి స్వతంత్రం పొందిన తరువాత, పోర్చుగీస్ కలోనియల్ యుద్ధం, కార్నేషన్ రివల్యుషన్ కారణంగా పోర్చుగీసు పౌర, సైనిక, రాజకీయ అధికారుల వేగవంతమైన నిష్క్రమణ ఫలితంగా దేశం ఆర్థికరంగం, సాంఘిక జీవితం, జీవన ప్రమాణం గణనీయంగా దెబ్బతిన్నాయి.
అనేక సంవత్సరాల ఆర్థిక తిరోగమనం, రాజకీయ అస్థిరత తరువాత, 1997 లో గినియా-బిస్సా సి.ఎఫ్.ఎ. ఫ్రాంక్ ద్రవ్యనిధి వ్యవస్థలోకి ప్రవేశించి కొన్ని అంతర్గత ద్రవ్య స్థిరత్వాన్ని తీసుకువచ్చింది.[36] 1998 - 1999 లో జరిగిన అంతర్యుద్ధం 2003 సెప్టెంబరులో సైనిక తిరుగుబాటుతో మళ్లీ ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. ఆర్థిక, సాంఘిక మౌలిక సదుపాయాల గణనీయమైన భాగాన్ని వాశనం చేసి అప్పటికే విస్తృతంగా ఉన్న పేదరికాన్ని తీవ్రం చేసింది. 2004 మార్చిలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు, 2005 జూలైలో జరిగిన అధ్యక్ష ఎన్నికలు తరువాత సున్నితమైన రాజకీయ పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ దీర్ఘ కాల అస్థిరత్వం నుండి దేశం తిరిగి రావడానికి ప్రయత్నిస్తోంది.
2005 లో ప్రారంభంలో లాటిన్ అమెరికాలోని మాదక ద్రవ్యాల సరఫరాదారులు కొకైన్‌ను ఐరోపాకు తరలించడానికి పొరుగు పశ్చిమ ఆఫ్రికన్ దేశాలతో కలిసి గినియా-బిస్సాను ట్రాంషిప్మెంటు కేంద్రంగా ఉపయోగించడం ప్రారంభించారు.[37] ఒక ఐక్యరాజ్యసమితి అధికారి ఈ దేశం "నార్కో-స్టేట్" అయ్యే ప్రమాదానికి గురైనట్లు వర్ణించబడింది.[38] మాదకద్రవ్య అక్రమ రవాణాను ఆపడానికి ప్రభుత్వం, సైన్యం చేసిన ప్రయత్నం చాలా పేలవంగా ఉంది. 2012 తిరుగుబాటు తరువాత పెరిగింది.[39]
గినియా-బిస్సా ఆఫ్రికా ఆర్గనైజేషన్ ఫర్ హార్మోనైజేషన్ ఆఫ్ బిజినెస్ లా ఇన్ ఆఫ్రికా సభ్యదేశంగా ఉంది.[40]
Severe environmental problems include deforestation; soil erosion; overgrazing and overfishing.[30]
ప్రపంచ జనాభా గణాంకాల ఆధారంగా గినియా బిసావు జనసంఖ్య 1950 లో 5,18,000 ఉండగా 2018 లో 18,15,698 గా ఉంది. 2010 లో 15 ఏళ్ళ కన్నా తక్కువ వయస్సు ఉన్న జనాభా నిష్పత్తి 41.3%, 15 నుండి 65 సంవత్సరాల వయస్కులు 55.4%, 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు 3.3% ఉన్నారు.[41]
గినియా-బిస్సౌ జనాభా జాతిపరంగా వైవిధ్యం కలిగినది. ఇందులో అనేక విభిన్న భాషలు, ఆచారాలు, సామాజిక నిర్మాణాలు ఉన్నాయి.
బిస్సా-గినియానులు క్రింది జాతి సమూహాలలో విభజించబడి ఉన్నారు:
మిగిలినవి వారిలో మెస్టికోలు (మిశ్రమ పోర్చుగీసు, ఆఫ్రికన్ సంతతికి చెందిన వారు) కేప్ వెర్డిన్ అల్పసంఖ్యాకులు ఉన్నారు.[42]
బిసావు-గినియాన్లలో పోర్చుగీస్ స్థానికులు చాలా తక్కువ శాతం ఉన్నారు. గినియా-బిస్సావు స్వాతంత్ర్యం పొందిన తరువాత పోర్చుగీసు జాతీయులు చాలామంది దేశం విడిచివెళ్ళారు. దేశంలో స్వల్పంగా చైనా జనాభా ఉంది.[43] వీటిలో పూర్వపు ఆసియన్ పోర్చుగీస్ కాలనీలో మకోలో పోర్చుగీసు, చైనా వ్యాపారుల సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు.
గినియా - బిసావులో ప్రధాన నగరాలు:[44]
ర్యాంకు | నగరం | జనసంఖ్య | |
---|---|---|---|
2015 అంచనా | ప్రాంతం | ||
1 | బిసావు | 492,004 | బిసావు |
2 | గాబు | 48,670 | గాబూ |
3 | బఫాటా | 37,985 | బఫాటా |
4 | బిస్సొరా | 29,468 | ఒయియొ |
5 | బొలామా | 16,216 | బొలామా |
6 | చాచౌ | 14,320 | చాచౌ |
7 | బుబాక్యూ | 12,922 | బొలామా |
8 | కాషియో | 11,498 | టాంబలి |
9 | మంసోయా | 9,198 | ఒయియొ |
10 | బుబా | 8,993 | క్వినారా |
ఒక చిన్న దేశంగా ఉన్నప్పటికీ గినియా-బిస్సాలో అనేక జాతులకు చెందిన సమూహాలు ఉన్నాయి. ఇవి తమ సొంత సంస్కృతులు, భాషలతో చాలా విభిన్నమైనవిగా ఉన్నాయి. ఆఫ్రికాలో కొనసాగిన వలసల కారణంగా గినియా-బిస్సా ఒక శరణార్థ భూభాగంగా ఉంది. కాలనైజేషన్ మిస్సిజెనరేషన్ పోర్చుగీసు, పోర్చుగీసు క్రియోల్, క్రియోల్ (క్రియోలౌ)ను తీసుకువచ్చింది.[45]
స్వాతంత్ర్యం తరువాత గినియా-బిసావు భాష జాతీయ భాషలలో ఒకటిగా గుర్తించినప్పటికీ, ప్రామాణిక పోర్చుగీసు ద్వితీయభాషగా వాడుకలో ఉంది. పోర్చుగీసు మాట్లాడేవారు తరచుగా రాజకీయ ఉన్నత శ్రేణులకు చెందిన ప్రజలుగా పరిగణించబడుతుంటారు. వలసరాజ్య పాలన వారసత్వంగా పోర్చుగీసు ప్రభుత్వ భాషగా, సమాచార భాషగా ఉంది. పోర్చుగీగీసు భాష మాత్రమే అధికారిక హోదాతో కలిగిన భాషగా ఉంది. పోర్చుగీసు భాష ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు బోధనాభాషగా ఉంది. 67% మంది పిల్లలకు విద్య అందుబాటులో ఉంది. పోర్చుగీస్ మాట్లాడేవారి సంఖ్య 11% నుండి 15% వరకు ఉంటుంది. పోర్చుగీసు క్రియోలు 44% మందికి వాడుక భాషగా ఉంది. ఇది జనాభాలో అధికభాగం ప్రత్యేకమైన సమూహాల మధ్య అనుసంధాన జాతీయ భాష సమర్థవంతంగా పనిచేస్తుంది. క్రియోల్ ఇప్పటికీ విస్తరిస్తోంది. క్రియోలు భాషను జనాభాలో చాలామంది అర్థం చేసుకుంటారు. అయినప్పటికీ ప్రామాణిక పోర్చుగీసు ప్రాధాన్యత అధికరిస్తున్న కారణంగా క్రియోలు ప్రాధాన్యత తగ్గుతూ ఉంది.[45]
మిగిలిన గ్రామీణ ప్రజలలో స్థానిక జాతికి చెందిన ప్రత్యేకమైన ఆఫ్రికన్ భాషలలో వివిధ భాషలు వాడుకలో ఉన్నాయి: ఫులా (16%), బాలంట (14%), మండింగ (7%), మంజకో (5%), పాపెల్ (3%), ఫెలూపే (1% ), బీఫాడా (0.7%), బీజాగ్ (0.3%), నలు (0.1%) ప్రజలకు వాడుకభాషలుగా ఉన్నాయి.[45][46] చాలా మంది పోర్చుగీసు మేటికోస్ మాట్లాడేవారు కూడా ఆఫ్రికా భాషలలో ఒకటి, క్రియోల్ బాడుక భాషలుగా ఉన్నాయి. ఆఫ్రికన్ భాషలు ప్రోత్సాహించబడుతూ ఉంటాయి. స్థానికభాషలు ఒకే జాతి నేపథ్యం, గ్రామాలలో రోజువారీ లేదా స్నేహితుల మధ్య సాంప్రదాయ, మతపరమైన వేడుకలు, పట్టణ, గ్రామీణ ప్రజల అనుసంధాన భాషలుగా ఉన్నాయి. గినియా బిసావులో స్థానిక భాషలకు అధికార హోదా లేదు.[45] ఫ్రెంచ్ భాష మాట్లాడే దేశాలు గినియా-బిస్సా చుట్టూ ఉన్న కారణంగా ఫ్రెంచ్ భాష ఒక విదేశీ భాషగా బోధించబడుతుంది. గినియా-బిస్సా ఫ్రాంకోఫొనీలో పూర్తి స్థాయి సభ్యదేశంగా ఉంది.[47]
Religion in Guinea-Bissau, 2010[48] | ||||
---|---|---|---|---|
Religion | Percent | |||
Christianity | 62% | |||
Islam | 38% |
2010 లో ప్యూ రీసెర్చ్ సర్వేలో క్రైస్తవ మతం దేశ జనాభాలో 62% మంది ఆచరిస్తున్నట్లు గుర్తించారు. ముస్లింలు 38% ఉన్నారు. [48] గునియా-బిస్సౌ ముస్లింలలో అహ్మదీయ వర్గానికి చెందిన 2%తో సున్నీ హోదాలో ఉన్నారు. [49]
చాలామంది నివాసితులు సాంప్రదాయిక ఆఫ్రికన్ విశ్వాసాలతో వారి మతాలను కలపడం ద్వారా ఇస్లామిక్, క్రైస్తవ విశ్వాసాలతో సంశ్లిష్ట రూపాలు కలిగిన మతాన్ని పాటిస్తారు.[30][50] ఉత్తర, తూర్పు ప్రాంతాలలో ముస్లింలు ఆధిపత్యం చేస్తున్నారు. అయితే క్రైస్తవులు దక్షిణ, తీరప్రాంత ప్రాంతాలకు ఆధిపత్యం వహిస్తున్నారు. రోమన్ కాథలిక్ చర్చ్ చాలామంది క్రిస్టియన్ కమ్యూనిటీని ప్రకటించింది.[51]
ఇతర అంచనాల ఆధారంగా క్రైస్తవ మతం అనేది 45% ముస్లింలు, 31% యానిమేటర్లు, 22% క్రైస్తవులు ఉన్నారు. ఏదేమైనా, వరల్డ్ అట్లాస్ క్రిస్టియానిటీ ఆధారంగా దేశంలో క్రైస్తవులు పెరుగుతున్నట్లు భావిస్తున్నారు (ప్రత్యేకంగా సాంప్రదాయిక మతాల అనుచరులు).
గినియా - బిసావులో 7 నుండి 13 సంవత్సరాల మద్య నిర్బంధ విద్య అమలులో ఉంది. మూడు నుంచి ఆరు ఏళ్ల వయస్సులోపు పిల్లలకు ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. విద్యలో ఐదు స్థాయిలు ఉన్నాయి: ప్రీ-స్కూల్, ఎలిమెంటరీ ప్రాథమిక విద్య, ద్వితీయ విద్య, మాధ్యమిక విద్య, సాంకేతిక, వృత్తిపరమైన బోధన, ఉన్నత విద్య (యూనివర్సిటీ, నాన్-యూనివర్శిటీలు). ప్రాథమిక విద్య సంస్కరణ స్థాయిలో ఉంది. ఇప్పుడు ఆరు సంవత్సరములు విద్య మొదటి స్థాయిగా ఉందిల్ సెకండరీ విద్య విస్తృతంగా అందుబాటులో ఉంది. ఇది రెండు స్థాయిలు (7 నుండి 9 వ తరగతి, 10 నుండి 11 వ తరగతి వరకు) ఉన్నాయి. సెంట్రో డి ఫోర్మాకా సావో జోవో బోస్కో (2004 నుండి), సెంట్రో డి ఫోర్మాకా లూయిస్ ఇన్యాసియో లూలా డా సిల్వా (2011 నుండి) వంటి ప్రైవేటు విద్యాసంస్థలు వృత్తి విద్యను అందిస్తున్నాయి.[45]
ఉన్నత విద్య పరిమితం చేయబడింది. చాలామంది విదేశాల్లో చదువుకునేందుకు ఇష్టపడతారు. ప్రధానంగా పోర్చుగల్‌లో నమోదు చేసుకునేందుకు ఇష్టపడతారు.[45] స్వయంప్రతిపత్తిగల పలు విశ్వవిద్యాలయాలలో లా ఫ్యాకల్టీ, ఔషధం ఫ్యాకల్టీ [52]
బాల కార్మికులు చాలా సాధారణం.[53] బాలికల నమోదు కంటే బాలల నమోదు అధికంగా ఉంది. 1998 లో స్థూల ప్రాథమిక నమోదు రేటు 53.5% ఉంది. బాలురు (67.7%) బాలికలు (40%).[53]
కమ్యూనిటీ పాఠశాలలలో, వయోజన విద్యాకేంద్రాలు ఉన్నాయి.[45] 2011 లో అక్షరాస్యతా శాతం 55.3% (పురుషులు 68.9%, స్త్రీలు 42.1%) గా అంచనా వేయబడింది.[54]
Usually, the many different ethnic groups in Guinea-Bissau coexist peacefully, but when conflicts do erupt, they tend to revolve around access to land.[55]
గినియా-బిసావు నుండి పోలెరిథమిక్ గంబే శైలితో సంగీతం ఎగుమతి చేయబడుతుంది. అయినప్పటికీ దేశంలో నెలకొన్న అశాంతి, ఇతర అంశాలు కలిసి గుంబే సజీవంగా చేసింది.[56]
గినియా-బిస్సా ప్రధాన సంగీత వాయిద్యం కలాభాషు.[57] ఇది చాలా వేగంగా లయబద్ధంగా చేసే క్లిష్టమైన నృత్య సంగీతంలో ఉపయోగించబడుతుంది. గీతరచనలకు గినియా-బిస్సా పోర్చుగీసు ఆధారిత క్రియోల్ భాష సాహిత్యం ఉపయోగించబడుతుంది. గీతాలలో తరచుగా హాస్యభరితమైన, సమయోచితమైన, ప్రస్తుత సంఘటనలు, వివాదాల చోటుచేసుకున్నాయి.[58]
సాధారణంగా కొన్నిసార్లు దేశంలోని ఇతర సంగీతబాణీలను సూచించడానికి గంబేపదం ఉపయోగించబడుతుంది. అయితే ఇది ప్రత్యేకంగా పది జానపద సంగీత సంప్రదాయాలలో ఒక ప్రత్యేక శైలిని సూచిస్తుంది.[59] ఇతర ప్రబల సంగీత ప్రక్రియలలో టినా, టింగా వంటి జానపద సంగీతప్రక్రియలు అంత్యక్రియలు, దీక్షలు, ఇతర ఆచారాలలో ఉపయోగిస్తారు. బలాంటా బ్రోస్కా, కుసుండే, మండింగ డబ్బాడన్, బిస్సాగోస్ బిసాగోస్ ద్వీపముల ధ్వనిస్తుంది.[60]
సముద్రతీరానికి సమీపంలోని నివాసితుల ఆహారంలో బియ్యంతో చేసిన అన్నం ప్రధానాహారంగా ఉన్నాయి. లోతట్టు భూభాగంలో చిరుధాన్యాలు ప్రధానాహారంగా ఉన్నాయి. పండ్లు, కూరగాయలు సాధారణంగా తృణధాన్యాలతో తింటారు. పోర్చుగీసు వేరుశనగ ఉత్పత్తిని ప్రోత్సహించింది. విగ్నా సబ్టెర్రనియా (బంబారా వేరుశెనగ), మాక్రోటిలోమా జియోకార్పం (హౌసా పొలల) కూడా పండించబడుతుంటాయి. బ్లాక్-ఐడ్ పీస్ కూడా ఆహారంలో భాగంగా ఉంటాఉఇ. పామ్ నూనె గింజలు పండించబడుతుంటాయి.
సాధారణ వంటలలో సూపు, స్ట్యూలు ఉంటాయి. సాధారణ ఆహారపదార్థాలలో యమ్లు, చిలగడదుంప, కాసావా, ఉల్లిపాయ, టమాటో, అరటి ఉంటాయి. వంటలలో మసాలా దినుసులు, మిరియాలు, మిరపకాయలు, అఫ్రామొంమం మెలెగెట్టా గింజలు (గినియా పెప్పర్) ఉపయోగించబడుతుంటాయి.
ఫ్లోరా గొమెస్ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన దర్శకుడు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలలో అత్యంత ప్రసిద్ధ చిత్రం నా ఫలా (ఆంగ్లం: మై వాయిస్).[61] గోమ్స్ మోర్టు నేగ (మరణం తిరస్కరించబడింది) (1988)[62] అనేది మొట్టమొదటి కల్పిత చలన చిత్రం. ఇది గినియా-బిస్సాలో రూపొందించిన రెండవ చలన చిత్రం. (1987 లో దర్శకుడు ఉమ్బన్ యు కెస్ట్ దర్శకత్వం వహించిన మొదటి చలనచిత్రం నెట్టురుడు). 1989 లో ఫెస్పాకోలో మోర్టు నెగ గెలుచుకున్న ఒమార్మా గాండ బహుమతిని వివాదాస్పదంగామారింది. 1992 లో గోంసు దర్శకత్వం వహించిన ఉజుజ అజుల్ డి యోంటో,[63] 1992 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అన్ సెంట్ రిగర్డ్ విభాగంలో ప్రదర్శించబడింది.[64] గోంసు అనేక ఆఫ్రికన్-సెంట్రిక్ ఫిల్ము ఫెస్టివల్సు బోర్డులలో కూడా పనిచేశారు.[65]
గినియా-బిస్సాలో ఫుట్ బాల్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా ఉంది. " గునియా-బిస్సా జాతీయ ఫుట్‌బాల్ జట్టు " జాతీయ జట్టుగా ఉంది. దీనిని ఫెడెరాకో డి ఫ్యూట్బోల్ డీ గ్యునీ-బిసాయు నియంత్రిస్తుంది. దీనికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్‌బాల్, ఎఫ్.ఐ.ఎఫ్.ఎ.లో సభ్యత్వం ఉంది. ఇతర ఫుట్‌బాల్ క్లబ్‌లలో డెస్పోర్టివో క్యులేలె, ఎఫ్.సి. కాటాక్వాంబా, ఎఫ్.సి. కాటకాంబా సావో డొమింగోస్, ఎఫ్.సి. కప్లూబా గబు, ఎఫ్.సి. జరాఫ్, ఎఫ్.సి. ప్రబిస్, ఎఫ్.సి. బాబాక్ ప్రాధాన్యత వహిస్తున్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.