కౌగిలి, కవుగిలి లేదా ఆలింగనం (Hug) అనేది మానవ సంబంధాలలో అన్యోన్యతను సూచించే పద్ధతి. ఇది సాధారణంగా ఒకరిని మరొకరు చేతులతో చుట్టుకొని తెలియజేస్తారు. ఇది మానవులలో ప్రేమ, అభిమానాన్ని చూపేందుకు ఎక్కువమంది ముద్దు పెట్టుకోవడంతో సహా ప్రయోగిస్తారు.[1] చాలా దేశాలలో ఇది బహిరంగ ప్రదేశాలలో ఏమాత్రం జంకు, భయం లేకుండా వారి కుటుంబ సభ్యులతోనే కాకుండా అన్ని మతాలలో, సంస్కృతులలో, అన్ని వయస్సులవారు, స్త్రీపురుషులు అతి సామాన్యంగా అభిమానాన్ని చూపే విధానం.

Thumb
A closeup of a hug
Thumb
Two men hugging

ఆనందాన్ని, సంతోషాన్ని మాత్రమే కాక, కౌగిలించుకోవడం కష్టాలలో వున్న వ్యక్తిని ఓదార్చడానికి, నేనున్నానని ధైర్యం చెబుతుంది. కొన్ని దేశాలలో కొత్త వ్యక్తిని కలిసేటప్పుడు కౌగిలితో పలకరిస్తారు. కౌగిలించుకోవడం మనుషులలోనే కాకుండా కొన్ని జంతువులలో కూడా కనిపిస్తుంది.

కౌగిలించుకోవడం ఆరోగ్యపరంగా మంచిదని తెలియజేస్తారు. ఒక పరిశోధనలో కౌగిలించుకోవడం వలన స్త్రీలలో ఆక్సిటోసిన్ విడుదలౌతుందని రక్తపోటు తగ్గుతుందని గుర్తించారు.[2]

భాషా విశేషాలు

తెలుగు భాష[3] ప్రకారంగా కౌగిలి [ kaugili ] or కవుగిలి kaugili భూజాంతరము. కౌగిట చేర్చు to take in one's arms, to embrace. కౌగిలించు or కవుగిలించు kaugilinṭsn. n. To embrace. ఆలింగనముచేయు. కౌగిలింత, కవుగిలింత or కౌగిలింపు kaugilinta. n. An embrace. ఆలింగనము.

రకాలు

కౌగిలింతలలో చాలా రకాలున్నాయని వాత్స్యాయనుడు కామసూత్రలో తెలియజేశాడు. ప్రేమికులు, దంపతులు రతి సమయంలో ఎక్కువకాలం కౌగిలించుకోవడం సాధారణంగా జరుగుతుంది.[4] వ్యక్తులిద్దరూ ఒకరికి మరొకరు ఎదురెదురుగా పడుకొని కౌగిలించుకుంటే దానిని "కడ్లింగ్" (Cuddling) అంటారు. అదే ఒకరి వెనుక మరొకరు పడుకొని కౌగిలించుకుంటే దానిని "స్పూనింగ్" (Spooning) అంటారు.[5]

మానవేతరుల్లో

Thumb
కౌగలించుకుంటున్న పిల్లులు

పాట్రికా మెక్ కానెల్ అన్న శాస్త్రజ్ఞుడు కౌగలించబడడాన్ని కుక్కలు, మానవులు ఇతర ప్రిమేట్ జంతువుల కన్నా తక్కువ ఇష్టపడతాయనీ, ఎందుకంటే ఇతర జంతువులపై కాళ్ళు పెట్టడం ఆధిపత్య సంకేతం.[6]

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.