కారకోరం
భారత, చైనా, పాకిస్తాన్ల సరిహద్దుల వద్ద వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి From Wikipedia, the free encyclopedia
భారత, చైనా, పాకిస్తాన్ల సరిహద్దుల వద్ద వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి From Wikipedia, the free encyclopedia
కారకోరం లేదా కారాకోరమ్ ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వత శ్రేణి. ఇది పాకిస్థాన్, భారతదేశం, చైనా దేశాల సరిహద్దులో ఉంది. ఈ పర్వతశ్రేణి హిందూకుష్ నుండి హిమాలయాల వరకు విస్తరించి ఉంది.[1][2] ఈ పర్వతశ్రేణి ఆసియా లో అతి పెద్ద శ్రేణులలో ఒకటి. ఈ శ్రేణిలో 8000 మీ. కంటే ఎక్కువ ఎత్తున్న శిఖరాలు నాలుగున్నాయి. అత్యంత ఎత్తైన శిఖరం 8,611 మీ. (28,251 అ.) ఎత్తున్న కె2. ఇది ప్రపంచంలో రెండవ అత్యంత ఎత్తైన శిఖరం.
కారకోరం | |
---|---|
అత్యంత ఎత్తైన బిందువు | |
శిఖరం | K2, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు |
ఎత్తు | 8,611 మీ. (28,251 అ.) |
నిర్దేశాంకాలు | 35°52′57″N 76°30′48″E |
భౌగోళికం | |
దేశాలు | ఆఫ్ఘనిస్తాన్, చైనా, భారత దేశం, పాకిస్తాన్ and తజికిస్తాన్ |
ప్రాంతాలు | గిల్గిట్ బల్టిస్తాన్, లడాఖ్, జింజియాంగ్ and బదక్షణ్ |
Range coordinates | 36°N 76°E |
సరిహద్దు | పామీర్ పర్వతాలు, హిందూ కుష్, కున్లున్ పర్వతాలు, హిమాలయాలు and లడాఖ్ శ్రేణి |
ఈ పర్వత శ్రేణిలో ఉన్న అతిపెద్ద పర్వత శిఖరాలు, వాటి ఎత్తులతో:
ఎత్తైన శిఖరాలలో ఎక్కువ భాగం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్గిట్ - బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉన్నాయి. బల్టిస్తాన్లో సముద్ర మట్టం నుండి 6,100 మీటర్లు (20,000 అడుగులు) కంటే ఎక్కువ ఎత్తున్న పర్వత శిఖరాలు 100 కు పైగా ఉన్నాయి.
పడమర నుండి తూర్పు వరకు
కారకోరం శ్రేణిలో ఖుంజేరబ్ కనుమ ఒక్కటే మోటారు వాహనాలు పోగలిగే కనుమ. ఇది కాకుండా షిమ్షాల్ కనుమ ఒక్కటే ఇప్పటికీ సాధారణ వాడుకలో ఉన్న ఇతర కనుమ దారి. అయితే, ఇది అంతర్జాతీయ సరిహద్దును దాటదు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.