కపూర్తలా
పంజాబ్ రాష్ట్రంలోని నగరం From Wikipedia, the free encyclopedia
పంజాబ్ రాష్ట్రంలోని నగరం From Wikipedia, the free encyclopedia
కపూర్తలా పంజాబ్ రాష్ట్రంలోని నగరం. ఇది కపూర్తలా జిల్లా ముఖ్యపట్టణం. ఇది బ్రిటిష్ ఇండియాలోని కపూర్తలా సంస్థానానికి (అహ్లువాలియా రాజవంశం పాలించింది) రాజధాని కూడా. ఫ్రెంచ్, ఇండో-సారాసెనిక్ వాస్తుశైలితో కూడుకున్న దాని ప్రముఖ భవనాలతో కూడిన ఈ నగరపు లౌకిక, సౌందర్య మిశ్రమం దాని రాచరిక గతాన్ని పట్టి చూపుతాయి. దీనిని ప్యాలెస్ & గార్డెన్స్ నగరం అని కూడా పిలుస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో అత్యల్ప జనాభా కలిగిన నగరం కపూర్తలా. [2]
కపూర్తలా | |
---|---|
నగరం | |
Coordinates: 31.38°N 75.38°E | |
దేశం | India |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | కపూర్తలా |
Founded by | రణాధీర్ కపూర్[1] |
Government | |
• Body | మునిసిపల్ కార్పొరేషన్, కపూర్తలా |
Elevation | 225 మీ (738 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,01,854 |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 144 601 |
టెలిఫోన్ కోడ్ | 01822 |
Vehicle registration | PB-09 |
కపూర్తలా స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలో కపూర్తలా సంస్థానానికి రాజధానిగా ఉంది. దీనిని అహ్లువాలియా సిక్కు పాలకులు పాలించారు. కపూర్తలా జెండాకు రెండు రంగుల నేపథ్యంతో "ప్రో రీజ్ ఎట్ పాట్రియా" అనే లాటిన్ నీతి వాక్యంతో ("రాజు కొరకు, దేశం కొరకు") ఉంటుంది.
2011 జనాభా లెక్కల ప్రకారం తాత్కాలిక సమాచారం ప్రకారం కపుర్తాల జనాభా 101,854, వీరిలో పురుషులు 55,485, మహిళలు 46,169. అక్షరాస్యత రేటు 85.82 శాతంగా ఉంది. [3]
కపూర్తలాలో మతం[4] | ||||
---|---|---|---|---|
మతం | శాతం | |||
సిక్కు మతం | 72.79% | |||
హిందూ మతం | 24.74% | |||
ఇస్లామ్ | 1.26% | |||
క్రైస్తవం | 0.59% | |||
ఇతరులు | 0.64% |
కపూర్తలా నగరంలో సైనిక్ స్కూల్ (పూర్వం జగత్జిత్ ప్యాలెస్ ), షాలిమార్ బాగ్ (గార్డెన్స్), జిల్లా కోర్టు భవనాలు, మూరిష్ మసీదు, పంచ మందిరం ("ఐదు దేవాలయాలు"), గడియార స్థంభం, స్టేట్ గురుద్వారా, కంజ్లి వెట్ ల్యాండ్స్, 15,000 మంది కూర్చోగల ఫీల్డ్ హాకీ మైదానమైన గురు నానక్ స్టేడియం, జగత్జిత్ క్లబ్, ఎన్జెఎస్ఏ ప్రభుత్వ కళాశాల వంటి అనేక భవనాలు, ఆసక్తి కలిగించే ప్రదేశాలూ ఉన్నాయి. దేశంలోని మొదటి వాతావరణ మార్పు థియేటర్ ఈ నగరంలోనే ఉంది.
కపూర్తలా నగరం పంజాబ్ లోను, ఉత్తర భారతదేశం లోనూ ఉన్న ప్రధాన రవాణా మార్గాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. ఇది జలంధర్ నగరం నుండి 19 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిక్కున ఉంది. [5]
జాతీయ రహదారి 703 ఎ, శ్రీ గురు నానక్ దేవ్ జీ మార్గ్ (ఎన్హెచ్ 703 ఎఎ) లు కపూర్తలాను పక్క రాష్ట్రాలతో కలుపుతాయి. [6] [7]
జలంధర్-ఫిరోజ్పూర్ మార్గంలో ఉన్న కపూర్తలా రైల్వే స్టేషను, రెండు ప్రధాన రైల్వే జంక్షన్ స్టేషన్లైన జలంధర్, ఫిరోజ్పూర్ ల ద్వారా నగరాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు కలుపుతుంది. [8]
కపూర్తలాకు అత్యంత సమీపం లోని విమానాశ్రయం, శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం 75 కిలోమీటర్ల దూరం లోని అమృత్సర్ వద్ద ఉంది.[5]
కపూర్తలా లోని ప్రధానమైన ఉన్నత విద్యాసంస్థలు
కపూర్తలాలో అనేక ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.