ఈ-పుస్తకం

From Wikipedia, the free encyclopedia

ఈ-పుస్తకం

ఈ-పుస్తకం అనగా ఎలక్ట్రానిక్ పుస్తకం. దీనిని ఆగ్లంలో "ఈ-బుక్ (e-book),డిజిటల్ బుక్,లేదా ఈ-ఎడిషన్ అని పిలుస్తారు. ఇది సంఖ్యాత్మక రూపంలో (digital form) ప్రచురించబడిన పుస్తకం. ఇందులో చిత్రాలు, పాఠ్యం, చిత్రాలు కలిసి ప్రచురించబడి ఇది గణన యంత్రాలు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలద్వారా చదువ బడేది.[1] కొన్నిసార్లు ఇది సాంకేతికంగా అచ్చు పుస్తకమునకు సమానమైనది.ఇది మొదటి నుండి సంఖ్యారూపంలో గలది. "ఆక్స్ ఫర్డు నిఘంటువు" ప్రకారం ఈ-పుస్తకం యొక్క అర్థము "అచ్చు పుస్తకమునకు ఎలక్ట్రానిక్ భాషాంతరము"[2] కానీ ఈ-పుస్తకం అనేది ఏ అచ్చు పుస్తకానికి తుల్యమైనది కాకుండా వ్యవస్థితమవుతుంది. ఈ-పుస్తకాలు సాధారణంగా ఈ-పుస్తకం చదివే సాధనాలు లేదా టాబ్లెట్స్ ద్వారా వాటిలోని ఈ-రీడర్ అనువర్తనాలద్వారా చదువబడుతున్నాయి. వ్యక్తిగత కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు కూడా వీటిని చదువగలవు.

Thumb
Amazon Kindle 3, an e-book reader displaying part of an e-book on its screen.

చరిత్ర

ఈ-పుస్తకమును మొదటిగా కనుగొన్నవారు ఇప్పటికీ కచ్చితంగా అమోదించబడలేదు. కానీ ప్రసిద్ధమైన వ్యక్తులు ఈ క్రింది విధంగా చేర్చిరి.

మొదటి ఈ-పుస్తకం ఇండెక్స్ థామిస్టికస్, ఇది థామస్ అక్వినస్ యొక్క పనుల కొరకు ఎలక్ట్రానిక్ విషయసూచికలతో బాగా వ్యాఖ్యానించబడింది. దీనిని 1940 చివరలో రాబర్ట్ బుస తయారు చేశాడు.అయినప్పటికీ ఇది కొన్నిసార్లు సూచికలు తప్పిపోయినవి. అందువలనే కాబోలు ఆయన స్వంత హక్కులతో ప్రచురించబడ్డ అచ్చువేయబడిన గ్రంథం కంటే సంఖ్యాత్మక పాఠ్యాన్ని సూచికలను, అకారాది సూచికలను అభివృద్ధి చేశాడు.[3]

కొన్ని సంవత్సరాల ముందు "ఈ-చదువరి" అనే అలోచన బాబ్ బ్రౌన్కు తన టాకీ (ధ్వనితో కూడిన చలనచిత్రము) ని చూసిన తదుపరి వచ్చింది. 1930 లో అతడు ఈ-పుస్తకం గూర్చి తన ఆవిష్కరణను "ది రీడిఎస్ " అనే పుస్తకరూపంలో వ్రాసాడు.[4] ఆతని చలనచిత్రం "టాకీ"ని తయారుచేయుటకు అనుసంధానించబడ్డ పుస్తకం తయారు చేశాడు. ఇది కొత్త మాధ్యమం చదువుటకు దోహద పడిందని తెలియజేశాడు. ఒక యంత్రం విస్తారమైన సంపుటాలు దృష్టి విషయంగా అచ్చువేయుటకు ఈ రోజు అందుబాటులో ఉంది. (ఇది బ్రౌన్ యొక్క ముఖ్య విషయం) అని తెలియ జేశాడు. బ్రౌన్ తన అపార మేథాసంపత్తితో ఒక క్రొత్త ఆలోచనతో 1930 లో ఈ-పుస్తకం తయారుచేసాడు. పూర్వపు వ్యాపార సంబంధమైన ఈ-రీడర్స్ అతని సృష్టించిన నమూనాను అనుసరించలేకపోయాయి. అయినప్పటికీ బ్రౌన్ ఈ-రీడర్స్ యే విధంగా మాథ్యమాన్ని చదువుతాయో అనేక విధాలుగా జోస్యం చెప్పాడు. జెన్నిఫర్ సూశ్లెర్ వ్రాసిన వ్యాసంలో " ఒకయంత్రం చదువరులకు టైప్ పరిమాణాన్ని సరిచేసుకొనుట,కాగితాన్ని విడిచిపెట్టుట, చెట్లను సంరక్షించుట,కాలాన్ని తగ్గించుట వంటి క్రియలను నిర్వహిస్తుందని వాదించాడు".[5] బ్రౌన్ మన ఈ-రీడర్స్ ప్రస్తుతం చాలా పుస్తక విషయంలా,స్వంత హక్కులు కలిగేవిగా లేవని గుర్తించాడు.ఈ-రీడర్స్ అనునవి పూర్తిగా మాథ్యమమును చదివేలా ఉండాలను భావించాడు.

1949 లో గెలీసికా, స్పెయిన్ లో ఒక ఉపాథ్యాయుడు - Angela Ruiz - మొదటిసారిగా ఎలక్ట్రానిక్ పుస్తకమునకు పేటెంట్ సంపాదించారు.ఆమె ఉద్దేశం తన పాఠశాలలో విద్యార్థులు ఎక్కువ పుస్తకములు మోయుటను తగ్గించుట.

సూచికలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.