From Wikipedia, the free encyclopedia
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ఒక భారత ప్రభుత్వ బహుళజాతి ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ. ఒఎన్జిసిని 1956 ఆగష్టు 14 న న భారత ప్రభుత్వం స్థాపించింది.దీని రిజిస్టర్డ్ కార్యాలయం భారతదేశంలోని న్యూ డిల్లీలో ఉంది. ఇది పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో భారత ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ . ఇది దేశంలో అతిపెద్ద ముడి చమురు, సహజవాయువు అన్వేషణ, ఉత్పత్తి సంస్థ. భారతదేశ ముడి చమురు ఉత్పత్తిలో 77 శాతం, సహజవాయువు ఉత్పత్తిలో 81 శాతం ఈ కంపెనీ నుంచి ఉత్పత్తి అవుతున్నదే. భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యధికంగా లాభం ఆర్జించే సంస్థ ఇది. భారత ప్రభుత్వం ఇందులో 74 శాతం వాటా కలిగి ఉంది.ఇది ఆసియాలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటి. చమురు కోసం క్రియాశీలకంగా అన్వేషణలు కొనసాగిస్తుంది.ఇది భారతదేశ ముడి చమురులో 70% (దేశం మొత్తం వాడకం 57%కు సమానం) దాని సహజ వాయువులో 84% ఉత్పత్తి చేస్తుంది.2010 నవంబరులో భారత ప్రభుత్వం ఓఎన్జీసీకి మహారత్న హోదా ఇచ్చింది.[1]
భారత ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వేలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓఎన్జీసీ భారతదేశంలో అతిపెద్ద లాభదాయక ప్రభత్వరంగ సంస్థ (పిఎస్యు) గా నిలిచింది.[2] ఇది భారతదేశంలోని 26 అవక్షేప బేసిన్లలో హైడ్రోకార్బన్ల కోసం అన్వేషించడం, వాటిని వెలికితీసేపనిని నిరంతరం కొనసాగిస్తుంది.దేశంలో 11,000 కి.మీ. పైపులైన్లను నిర్వహిస్తుంది.ఓఎన్జీసీ అంతర్జాతీయ అనుబంధ సంస్థ 'ఒఎన్జిసి విదేష్' ప్రస్తుతం 17 దేశాలలో ప్రాజెక్టులను కలిగి ఉంది. ప్రస్తుతం భారతదేశంలో వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తున్న ఏడు కంపెనీలలో ఆరింటిని గత 50 సవత్సరాలలోనే ఓఎన్జీసీ కనుగొంది.భారతీయ బేసిన్లలో 7.15 బిలియన్ టన్నుల ఇన్-ప్లేస్ ఆయిల్ & గ్యాస్ వాల్యూమ్ హైడ్రోకార్బన్లను ఉత్పత్తి చేసింది.
1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందటానికి ముందు, కనిష్ఠ అన్వేషణ ఇన్పుట్తో ఈశాన్యంలోని అస్సాం ఆయిల్ కంపెనీ, అవిభక్త భారతదేశం వాయవ్య భాగంలో అటాక్ ఆయిల్ కంపెనీ మాత్రమే చమురు ఉత్పత్తి చేసే సంస్థలు.భారతీయ అవక్షేప బేసిన్లలో ప్రధాన భాగం చమురు, వాయువు వనరుల అభివృద్ధికి అనర్హమైనదిగా భావించబడింది.[3]
స్వాతంత్ర్యం తరువాత భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి, చమురు, వాయువుల ప్రాముఖ్యతను, రక్షణశాఖలో దాని వ్యూహాత్మక పాత్రను ప్రభుత్వం గుర్తించింది.దాని పర్యవసానంగా 1948 పారిశ్రామిక విధాన ప్రకటనను రూపొందిస్తున్నప్పుడు, దేశంలో హైడ్రోకార్బన్ పరిశ్రమ అభివృద్ధి అత్యంత అవసరమని అప్పటి ప్రభుత్వం భావించింది.[4]
1955 వరకు ప్రధానంగా భారతదేశంలోని హైడ్రోకార్బన్ వనరులను ప్రవేట్ చమురు కంపెనీలు అన్వేషించాయి. అస్సాం ఆయిల్ కంపెనీ డిగ్బోయి, అస్సాం (1889లో కనుగొనబడింది), ఆయిల్ ఇండియా లిమిటెడ్ (భారత ప్రభుత్వం, బర్మా ఆయిల్ కంపెనీ (50% జాయింట్ వెంచర్) అస్సాంలోని నహార్ కాటియా, మోరన్ లలో రెండు కొత్తగా కనుగొన్న పెద్ద బేషిన్లలో అభివృద్ధి పాలుపంచుకున్నాయి.పశ్చిమ బెంగాల్లో, ఇండో- స్టాన్వాక్ పెట్రోలియం ప్రాజెక్ట్ (భారత ప్రభుత్వం, యుఎస్ఎ స్టాండర్డ్ వాక్యూమ్ ఆయిల్ కంపెనీ మధ్య జాయింట్ వెంచర్) అన్వేషణ పనులను సాగించింది.భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఆఫ్షోర్ ప్రక్కనే ఉన్న విస్తారమైన అవక్షేప మార్గం ఎక్కువగా కనిపెట్టబడలేదు.[3][4]
Seamless Wikipedia browsing. On steroids.