తెలంగాణకు చెందిన సామాజికవేత్త. From Wikipedia, the free encyclopedia
అలీమ్ ఖాన్ (జననం 1956) తెలంగాణకు చెందిన సామాజికవేత్త. భారత ఉపఖండం నుండి వరకట్నాన్ని నిర్మూలించడానికి పోరాడుతున్నాడు.[1][2] ఉర్దూ కవిత్వానికి కూడా ప్రసిద్ది చెందాడు. సోషియో-రిఫార్మ్-సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. వరకట్నంపై ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో అనేక పుస్తకాలు రాశాడు.[3][4]
అలీమ్ ఖాన్ | |
---|---|
జననం | మహ్మద్ అలీముల్లా ఖాన్ 1956 జూలై 15 |
విద్య | ఎంఏ పిహెచ్డి |
విద్యాసంస్థ | మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం |
సోషియో-రిఫార్మ్-సొసైటీ | |
ఉద్యమం | వరకట్న నిర్మూలన |
పురస్కారాలు | ఇండియా ఫ్రటర్నిటీ ఫోరమ్ |
మహ్మద్ అలీముల్లా ఖాన్ 1956, జూలై 15 తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 1956లో జన్మించాడు. తండ్రి మహమ్మద్ ఖలీలుల్లా ఖాన్ ఉర్దూ పండితుడు.[2][4] అలీమ్ ఖాన్ హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. ఎంఏ, ఎంఫిల్ పూర్తిచేసాడు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం నుండి "ముస్లిం సమాజంలో మహిళ మార్జినలైజేషన్" అనే అంశంపై పిహెచ్డి కూడా చేశాడు. యూకెలోని లీసెస్టర్ వివాహ కౌన్సెలింగ్‌లో డిప్లొమా సాధించాడు. 3 దశాబ్దాలకు పైగా సౌదీ అరేబియాలోని జెడ్డాలో తన స్వంత కంపెనీని నడిపాడు.[2]
అలీమ్ ఖాన్, వరకట్న వ్యతిరేక ప్రచారాన్ని ఈ యుగపు జిహాద్‌గా పేర్కొన్నాడు. అన్ని దురాచారాలకు ఈ వరకట్నమే మూలమని, ఈ వ్యవస్థకు స్వస్తి పలికితే కాలక్రమేణా వందలాది సామాజిక దురాచారాలను, పేదరికాన్ని ప్రజలు దూరం చేసుకోవచ్చన అలోచనతో వరకట్న వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించాడు.[2]
ఆడపిల్లల లేదా సోదరీమణుల కట్నం భారాన్ని తొలగిస్తే, 50%మంది పురుషులు సామాజిక, ఇతర సేవలలో పాలుపంచుకునేలా స్వేచ్ఛగా జీవిస్తారని అలీమ్ ఖాన్ అభిప్రాయం.[2][4]
పరకట్న నిర్మూలన కోసం 1992లో సోషియో-రిఫార్మ్-సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. ఆ తరువాత ఈ సంస్థలో చాలామంది ఇతర సామాజిక కార్యకర్తలు సభ్యులుగా చేరారు. వారంతా భారతదేశంలోని వివిధ కళాశాలల్లో వరకట్నంపై ఉపన్యాసాలు ఇస్తారు, సమావేశాలు నిర్వహిస్తారు.[2][4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.