From Wikipedia, the free encyclopedia
అరబ్కిర్, ఆర్మేనియా దేశ రాజధానయిన యెరెవన్ లో ఉన్నటువంటి 12 జిల్లాలలో ఒకటి. ఇది నగరానికి ఉత్తరాదిన ఉంటుంది. అరబ్కిర్ కు సరిహద్దులుగా వాయువ్యాన దవ్తాషెన్ జిల్లా, పడమటన అజప్యాంక్ జిల్లా, దక్షిణాన కెంట్రాన్ జిల్లా, తూర్పున కనాకర్-జేత్యున్ జిల్లాలు ఉన్నాయి.హ్రజ్డాన్ నది ఈ జిల్లాకు ఉత్తర, పడమట దిశలలో ప్రవహిస్తుంది. అరబ్కిర్ తన సరిహద్దులను కొటాయ్క్ రాష్టంలోని కనకెరవన్ తో కూడా పంచుకుంటుంది.[1]
ఇది యెవెరన్ నగరంలోని 5.38% భూభాగం అనగా 12 చ.కి. వైశాల్యంలో ఉంది. అరబ్కిర్ వైశాల్యపరంగా యెరెవన్ లో 8వ అతిపెద్ద జిల్లా. ఇది అనధికారికంగా చిన్న విభాగాలుగా విభజింపబడినది, అవి నార్ అరబ్కిర్, మెర్గిల్యాన్, అయ్గెజ్డార్, కనాకర్ జలవిద్యుత్తు కేంద్రం, రేయ్కాం. అరబ్కిర్ లోని ప్రధాన రాచబాటగా కొమిటాస్ రోడ్డు ఉండగా కీవ్, ఎన్.జారియన్, హ్రచ్య కొచ్చర్, మమికోనియన్, అ.ఐ.గ్రిబొయెడావ్, ఎ. ఖచాట్చురియన్, వి.వగర్ష్యాన్, వి.పపజియన్, ఎన్. అడోంట్స్ వీధులు ముఖ్యమైనవి. ఈ జిల్లాలో బరెకాముట్యున్, మర్ క్రట్యన్ లు ప్రధాన స్క్వేర్లు. అరబ్కిర్ ను కనాకర్-జేటన్ నుండి లిబర్టీ రహదారి, ట్బైలీసీ హైవే వేరుచేస్తాయి.
అరబ్కిర్ ప్రధానంగా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన జిల్లా. ఇక్కడ పెద్ద సంఖ్యలో రిటైల్ దుకాణాలు, షాపింగ్, సేవ కేంద్రాలు ఉన్నాయి. అయితే, సోవియట్ కాలంలో ఉత్తర భాగంలో ఒక పెద్ద పారిశ్రామిక జిల్లా ఏర్పడింది . ఇది మధ్య తరగతి నివాసితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. జిల్లాలో అనేక పార్కులు ఉన్నాప్పటికీ వాటిలో వహాఘన్ దవ్త్యాన్, అర్బ్కిర్ అత్యంత ముఖ్యమైనవి.
2016, జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో దాదాపుగా 115,800 మంది నివసిస్తున్నారు.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో టర్కీలోని అరప్గిర్ పట్టణంలో 9.523 ఆర్మేనియన్లు (1,300 ఇళ్ళలో), 6,774 టర్కులు నివసిస్తున్నారు.[2] 1915 అర్మేనియన్ నరమేధం తరువాత, అరప్గిర్ లోని అర్మేనియన్ జనాభాను హత్య చేయడం లేదా దేశమునుండి బహిష్కరించడం జరిగింది. 1922లో అరప్గిర్ నుండి బయటపడిన 800 ఆర్మేనియన్లు సోవియట్ ఆర్మేనియాలో ఆశ్రయం పొందారు. పర్యవసానంగా, అరబ్కిర్ జిల్లాను అధికారికంగా 1925 నవంబరు 29 యెరెవన్ నగర కేంద్రానికి యొక్క ఉత్తర దిక్కున స్థాపించారు. ఇది మారణహోమంలో అరప్గిర్ నుండి తప్పించుకుని వచ్చిన వారికి నిలయంగా మారింది .
జిల్లాలో ఉత్తర దిక్కున ఉన్న మొలొకాన్ కమ్యునిటీ సమీపంలో ఒక చారిత్రక శ్మశానం ఉంది. అయితే 20వ శతాబ్దంలో ఇక్కడ ఉన్నటువంటి సమాధులను వేరే ప్రాంతానికి తొలగించి ఒక సుందరమైన పార్కును నిర్మించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన ఆర్మేనియన్ల యొక్క సమాధులను మాత్రం అందుకు స్మృతిగా ఇక్కదే ఉంచారు.
సోవియట్ కాలంలో అరబ్కిర్ లో అనేక పెద్ద పారిశ్రామలు ప్రారంభమయ్యాయి. అయితే సోవియట్ యూనియన్ యొక్క పతనం తరువాత చాలా పరిశ్రమలను కాళీ చేశారు. కొన్ని ప్రంతాలను నివాసయోగ్యానికి అనుగుణంగా రూపుదిద్దారు .[3]
2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ జిల్లాలో 117,704 (యెరెవన్ నగరం జనాభాలోని 11.1%) మంది నివసిస్తున్నారు. 2016 అధికారిక అంచనాల ప్రకారం,115,800 తో నగరంలోని ఆరవ అత్యధిక జనాభా కలిగిన జిల్లా. ప్రస్తుతం, ఎరెబుని జనాభాలో ప్రధానంగా అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చికు చెందిన వారు నివసిస్తున్నారు. హోలీ క్రాస్ చర్చిను 2018లో ప్రారంభించారు. ఇంకొక దానిని 2020లో ప్రారంభించబోతున్నారు. అరబ్కిర్ లో మొలొకన్ తెగవారు నివసిస్తున్నారు, వారు ఆధ్యాత్మిక క్రిస్టియన్ గా పిలవబడతారు. అనేక మొలొకన్ తెగవారు అర్మేనియాలోని ఉత్తరాన ఉన్నటివంటి ప్రదేశాలకు వలస వెళ్ళారు. వారిలో ఎక్కువ మంది యెరెవన్లోనే స్థిరపడ్డారు.
అరబ్కిర్ లో అనేక ప్రజా గ్రంథాలయాలతో పాటు ఆర్మేనియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ప్రాథమిక శాస్త్రీయ లైబ్రరీ (1943),[4] లైబ్రరీ №5 (1950), జాతీయ కేంద్రం యొక్క ఆవిష్కరణ, వ్యవస్థాపకతకు చెందిన శాస్త్రీయ, సాంకేతిక లైబ్రరీ యొక్క (1963), లైబ్రరీ №6 (1976),[5] అవేటిక్ ఇసహక్యాన్ సెంట్రల్ లైబ్రరీ శాఖలు №29 (1951), పిల్లలకు №33 (1947),, №36 (1958) ఉన్నాయి. కాన్స్టాంటిన్ సరజ్యన్ సంగీత పాఠశాల, అలెక్సీ సంగీత పాఠశాలలను 1952, 1982న వరుసగా స్థాపించారు.
జిల్లా యెరెవన్ నగరానికి మధ్య ప్రధానంగా కొమిటాస్ వీధి, కీవ్ వీధి, బరెకముత్యున్ (స్నేహం) మెట్రో స్టేషన్ వంటి రవాణా సదుపాయాలు ఉన్నవి .
జిల్లాలో ఎన్నో బస్సులు, ట్రాలీబస్సులు తిరుగుతున్నాయి 2006వ సంవత్సరంలో జిల్లాలో:
విద్యాసంవత్సరం 2016-17 నాటికి, జిల్లాలో 21 ప్రభుత్వ పాఠశాలలు, 6 ప్రైవేటు పాఠశాలలు, అలాగే పిల్లలకు ప్రత్యేక అవసరాలతో కూడిన 2 వృత్తి పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ప్రముఖ ఐబ్ పాఠశాల ఒకటి.
అనేక ఉన్నత విద్యా సంస్థలు ఉన్నావి, అవి:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.