అనపర్తి
ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి మండల గ్రామం From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి మండల గ్రామం From Wikipedia, the free encyclopedia
అనపర్తి (అనపఱ్ఱు), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనితూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మండపేట నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.
అనపర్తి | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°56′2″N 81°57′22″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | అనపర్తి |
విస్తీర్ణం | 18.07 కి.మీ2 (6.98 చ. మై) |
జనాభా (2011) | 26,788 |
• జనసాంద్రత | 1,500/కి.మీ2 (3,800/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 13,342 |
• స్త్రీలు | 13,446 |
• లింగ నిష్పత్తి | 1,008 |
• నివాసాలు | 7,833 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08857 ) |
పిన్‌కోడ్ | 533342 |
2011 జనగణన కోడ్ | 587541 |
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 7833 ఇళ్లతో, 26788 జనాభాతో 1807 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 13342, ఆడవారి సంఖ్య 13446. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3224 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 211. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587541[2].పిన్ కోడ్: 533342.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 25,533. ఇందులో పురుషుల సంఖ్య 12,856, మహిళల సంఖ్య 12,677, గ్రామంలో నివాసగృహాలు 6,545 ఉన్నాయి.
పచ్చని పొలాలతో అందంగా ఉండే ఈ గ్రామం ఒకప్పుడు స్మగుల్ చేయబడిన పరికరాలు (వాచీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి) వ్యాపారానికి ప్రసిద్ధి. క్రమంగా చుట్టుప్రక్కల గ్రామాలకు సామాన్య వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఎల్ కె జి నుండి, డీగ్రి, బీఇడీ, ఎమ్ సి ఎ, ఎమ్ బి ఎ, నర్సింగ్ కాలేజీలతో ముఖ్య విద్యాకేంద్రంగా ప్రసిద్ధి చెందింది. గ్రామం జనాభాలో అధికంగా రెడ్డి కులస్తులు ఉన్నారు. వడ్డీ వ్యాపారం ఇక్కడ ముఖ్యమైన వ్యాపారం. ఇక్కడున్న కంటి ఆసుపత్రి కూడా చుట్టుప్రక్కల గ్రామాలలో పేరు కలిగి ఉంది. రైల్వేస్టేషను నుండి దేవి చౌక్‌వరకు వున్న వూరును కొత్తవూరని, కాలువ అవతలనుండి పొలమూరు వైపు వున్న వూరును పాతూరు అని అంటారు.దాదాపు ముపై ఏళ్ళక్రితం పెంకుటిళ్ళు ఎక్కువగా వుండేవి. ప్రస్తుతం వాటిస్థానాన్ని డాబాలు, ఆపార్టుమెంటులు ఆక్రమించాయి. లిప్టు సౌకర్యం ఉన్న అపార్టుమెంటుకూడా ఉంది.
గ్రామంలో ఆరుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఐదు ఉన్నాయి.2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. గ్రామంలో ఒక ప్రైవేటు మేనేజిమెంటు కళాశాల ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల మల్ల్లంపూడిలో ఉంది. సమీప వైద్య కళాశాల రాజానగరంలోను, పాలీటెక్నిక్ రాజమండ్రిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల కొమరిపాలెంలోను, అనియత విద్యా కేంద్రం రాజమండ్రిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కాకినాడ లోనూ ఉన్నాయి.
అనపర్తిలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు డాక్టర్లు, 12 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. నాలుగు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. 8 మంది పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
గ్రామంలో 16 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఏడుగురు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఐదుగురు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. 14 మందుల దుకాణాలు ఉన్నాయి.
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
అనపర్తిలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉందిరాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
ఇక్కడ ఉన్న రైల్వేస్టేషన్లో చాలా ఎక్స్‌ప్రెస్ రైళ్ళు (గోదావరి ఎక్స్‌ప్రెస్, సర్కార్ ఎక్స్‌ప్రెస్, తిరుమల ఎక్స్‌ప్రెస్, బొకారో ఎక్స్‌ప్రెస్, పూరి ఎక్స్‌ప్రెస్, విజయవాడ-కాకినాడ పాసింజర్, కాకినాడ-తిరుపతి పాసింజర్, మచిలీపట్నం-విశాఖపట్నం పాసింజర్, విజయవాడ-విశాఖపట్నం పాసింజర్, రాజమండ్రి-విశాఖపట్నం పాసింజర్, రాయగడ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు) ఆగుతాయి.కంప్యూటరు రిజర్వేషను సౌఖర్యం ఉంది.ఈ మధ్యకాలంలో స్టేషనును అధునీకరించారు. స్టేషను ప్లాట్ఫారం ఎత్తు, పొడవు పెంచారు.
అనపర్తి నియోజకవర్గానికి కేంద్రం అయినప్పటికి సరైన బస్‌స్టాండు లేదు. దేవిచౌక్వద్దనున్న రాజమండ్రి-కాకినాడ రోడ్దుమీదనే బస్సులను ఎక్కడం, దిగడం జరుగుచున్నది. 6 సంవత్సరాల క్రితం RTC వారు బస్స్టాండును నిర్మించినప్పటికి అది ఊరికి అర కిలోమీటరు దూరంగా ఉండటంవలన, ఊరిలోనికి, బస్‌స్టాండుకు వెళ్ళుటకు రిక్షాలు అందుబాటులో లేకపోవడం వలన ప్రయాణీకులు దేవిచౌక్ వద్దనే బస్ఎక్కడం వలన, బస్‌స్టాండు నిరుపయోగంగా మారడం వలన, దానిని న్యాయశాఖకు బదలాయించారు. ఎమ్మెల్యే నిధులతో ప్రస్తుతం దేవి చౌక్ఎదురుగా బస్‌షెల్టరు నిర్మించారు.
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
అనపర్తిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
అనపర్తిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
అనపర్తిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ITC వారి పొగాకు పరిశ్రమ కూడా ఉంది. రైసుమిల్లులు, కోళ్ళఫారాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. తవుడు నుండి నూనె తీసేవి, తవుడునూనెను శుద్ధి చేసేవీ పరిశ్రమలు రెండు ఉన్నాయి.
అనపర్తిలో ప్రతిఏడు వీరుళ్ళమ్మ జాతరమరియు బాపనమ్మ జాతర చాలా వైభవంగా చేస్తారు. వీరుళ్ళమ్మ జాతర సంక్రాంతి సమయంలో చేస్తారు.వారంరోజుల పాటు జాతర వుంటుంది.రైల్వేస్టేషను నుండి మైయిన్రోడ్డు వద్దనున్న దేవి ఛౌక్‌వరకు రోడ్డుకు ఇరువైపుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. తినుబండారాల దుకాణాలు (జీళ్ళు, పంచదార చిలకలు తదితరాలు) పెడతారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అర్కెస్ట్రా నిర్వహణ వుంటుంది. అమ్యూజ్మెంట్పార్కుల ఏర్పాటు వుంటుంది. వీరుళ్ళమ్మ జాతరకు అనపర్తి గ్రామ పరిసరగ్రామాలనుండి జనం తండోపతండాలుగా వస్తారు. చివరిరోజున బాణసంచా పేలుస్తారు.
'జాహ్నవి'వారు ప్రతినెల మొదటివారంలో నాటక-నాటిక లేదా ఎదైన లలితకళలకు చెందిన కార్యక్రమాన్ని నిర్హహిస్తారు. పంచాయతి గ్రంథాలయంప్రక్కనే తేతలి రామారెడ్ది-మంగాయమ్మ కళావేదిక ఉంది.
మూడు సినిమా హాల్ లున్నాయి. 1.పద్మశ్రీ 2.సత్యగౌరి A/c Dts, 3.సూర్యశ్రీ A/c Dts పద్మశ్రీ టాకీస్ నిర్మించి ముప్పై సంవత్సరాలైనది.సినిమాహల్ కాంపౌండ్ మీదుగా ఫ్లైఒవరు బ్రిడ్జి నిర్మించడం వలన హల్‌ను మూసివేశారు.
అనపర్తిలో వున్నబ్యాంకులు
1.C.I.స్థాయి పోలిసు స్టేషను ఉంది.
2.ఫైర్ స్టేషను ఉంది
3.జూనియర్ సివిల్ కోర్ట్ ఉంది
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.