From Wikipedia, the free encyclopedia
యూనిఫాం రిసోర్స్ లొకేటర్ (Uniform Resource Locator - URL) అనేది ఒక కంప్యూటర్ నెట్వర్క్ మీద రిసోర్స్ (వనరు) ఎక్కడ ఉందో తెలిపే వెబ్ చిరునామా, ఇంకా దాన్ని ఎలా పొందాలో తెలిపే పద్ధతి. URL అనేది ఒకరకమైన యూనిఫాం రిసోర్స్ ఐడెంటిఫయర్ (URI).[1][2] చాలామంది ఈ రెండింటినీ కలిపి వాడుతుంటారు.[3][a] URL అనేవి తరచుగా వెబ్ పేజీలను (HTTP/HTTPS) సూచిస్తాయి. అంతే కాకుండా ఇవి ఫైల్ ట్రాన్స్ఫర్ (FTP), ఈమెయిల్ (mailto), డేటాబేస్ యాక్సెస్ (JDBC) లాంటి వాటిని కూడా సూచిస్తాయి.
చాలా వరకు జాల విహరిణులు (వెబ్ బ్రౌజర్లు) URL ని వెబ్ పేజీపైన కనిపించే చిరునామా పట్టీ (అడ్రెస్ బార్) లో చూపిస్తాయి). ఒక సాధారణ URL రూపం http://www.example.com/index.html
ఇలా ఉంటుంది. ఇందులో http
అనేది నియమావళి (ప్రోటోకాల్), www.example.com
అనేది హోస్ట్ పేరు. index.html
అనేది ఫైలు.
URL ని 1994 లో RFC 1738 ద్వారా వరల్డ్ వైడ్ వెబ్ ని ప్రతిపాదించిన టిమ్ బెర్నర్స్ లీ రూపొందించాడు.
Seamless Wikipedia browsing. On steroids.