వాయువు పదార్ధాల యొక్క ఒక మూల స్థితి. భౌతిక శాస్త్రం ప్రకారం, నిర్ధిష్టమైన ఆకారం, ఘనపరిమాణం లేని అణువులు, అయానులు, లేదా ఎలక్ట్రానుల సముదాయం వాయువు. వాయువులలోని అణువులు ఎల్లప్పుడు ఒక నిర్ధిష్టమైన దిశ లేకుండా కదులుతుంటాయి.

Thumb
Gas phase particles (atoms, molecules, or ions) move around freely

భూమి వాతావరణంలో అతి ముఖ్యమైన గాలి కొన్ని రకాల వాయువుల మిశ్రమము.

వాయు నియమాలు

వాయువుల ధర్మాలలో ముఖ్యమైనవి ద్రవ్యరాశి, ఘనపరిమాణం, పీడనం, ఉష్ణోగ్రత. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను వాయు నియమాలు (Gas Laws) అంటారు. ఇవి రెనసాన్స్ నుండి 19వ శతాబ్దం తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి దృఢమైన సంబంధంలేని నియమాల సమాహారం.

ద్రవ నైట్రోజన్‌లో మునిగిన తర్వాత గాలి బెలూన్ తగ్గిపోతుంది

వాయు కాలుష్యం

మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment) ను కాలుష్యం చేయు రసాయనములు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్థము (biological material)లు వాతావరణములో కలియుట వాయు కాలుష్యము అనబడును

వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి పై నున్న జీవాలకు మద్దతు నిస్తుంది.వాయు కాలుష్యం వలన స్ట్రాటోస్ఫియర్లోని ఓజోన్ తగ్గుదల మానవుల ఆరోగ్యనికే కాక భూమి యొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు కూడా హాని కలిగించునని గతంలోనే గుర్తించారు.

పురాణాలు

ఇవి కూడా చూడండి

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.