ఆమ్ ఆద్మీ పార్టీ
భారతదేశం లోని రాజకీయ పార్టీ From Wikipedia, the free encyclopedia
ఆమ్ ఆద్మీ పార్టీ 2012 నవంబర్ 26 న సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రివాల్ చేత స్థాపించబడిన ఒక భారతీయ రాజకీయ పార్టీ. అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్లు కోసం జరిగిన ప్రజాపోరాటం నుంచి పుట్టిన పార్టీ. ఈ పోరాటాన్ని కేజ్రివాల్ రాజకీయ పార్టీగా కొనసాగించాలిని ప్రతిపాదించగా, ఈ పోరాటానికి నాయకత్వం వహించిన అన్నా హజారే వ్యతిరేకించారు. పార్టీ స్థాపించిన వెంటనే ఢిల్లీలో విద్యుత్, నీటి ధరలపై పోరాటాలు చేసారు. మహిళలపై అగాయత్యాలపై ప్రత్యేక చట్టం కోసం పోరాటాలు చేసారు.[2][3][4] పార్టీ పాల్గొన్న మొదటి ఎన్నికలు 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు. ఈ ఎన్నికలలో పార్టీ మొత్తం 70 సీట్లలో 28 సీట్లు సాధించి రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 8 సీట్లు సాధించిన కాంగ్రెస్ బయటి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కనీవిని ఎరుగని రీతిలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మొత్తం 70 శాసనసభ స్థానాల్లో 67 సీట్లను సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది.[5]
ఆమ్ ఆద్మీ పార్టీ | |
---|---|
![]() | |
నాయకత్వం | అరవింద్ కేజ్రివాల్ |
స్థాపన | నవంబర్ 26, 2012 |
ప్రధాన కార్యాలయం | గ్రౌండ్ ఫ్లోర్, A-119, కుశామ్భి,ఘాజియాబాద్ -201010 |
సిద్ధాంతం | స్వరాజ్యం[1] |
రంగు | |
ఢిల్లీ అసెంబ్లీ | 67 / 70 |
లోక్ సభ | 4 / 545 |
ఓటు గుర్తు | |
![]() |
కేంద్ర ఎన్నికల సంఘం 2023 ఏప్రిల్ 09న ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదాను ప్రకటించింది.[6]
( జూలై 2013)
ఎన్నికలు
ఢిల్లీ శాసనసభ ఎన్నికలు 2013
ఢిల్లీ 2013 శాసనసభ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ పాల్గొనిన ప్రథమ ఎన్నికలు. ఎన్నికల కమిషన్ నుంచి పొందిన "చీపురు కట్ట" గుర్తు పై పోటిచేసారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక హామీలు ప్రకటించారు. ఈ ఎన్నికలలో 70 సీట్లకు గాను 28 సీట్లు సాధించి సంచలనం సృష్టించారు. 32 స్థానాలు సాధించిన బిజెపి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించటంతో, లెఫ్టినెంట్ గవర్నర్ పిలుపు మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాభిప్రాయ సేకరణ తరువాత ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. 8 స్థానాలున్న కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇచ్చింది.
సాధారణ ఎన్నికలు 2014
2014 లోక్ సభ ఎన్నికలలో పార్టీ పలు రాష్రాలలో 300 పైగా సీట్లలో పోటిచేయాలని నిర్ణయించింది. [7][8][9] ఆమ్ ఆద్మీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో 443 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాల్లో గెలుపు సాధించింది.[10]
ఢిల్లీ శాసనసభ ఎన్నికలు 2015
కనీవిని ఎరుగని రీతిలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం దక్కించుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మొత్తం 70 శాసనసభ స్థానాల్లో 67 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. 2013 శాసనసభ ఎన్నికలతో పోల్చుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ తన ఓటు బ్యాంకును భారీగా పెంచుకుంది. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 29.5 శాతం ఓట్లు పోలవగా ఈసారి అనూహ్యంగా 54.3 శాతానికి పెరిగింది.[5]
పంజాబ్ శాసనసభ ఎన్నికలు 2022
ఇప్పటికే ఢిల్లీ పాలనా పగ్గాలను చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 2022 మార్చి 16న పంజాబ్‌లోనూ పాలనా పగ్గాలను చేపట్టనుంది. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ ఏకంగా 92 సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించిన భగవంత్ మాన్ సింగ్ పంజాబ్ సీఎంగా స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ స్వగ్రామం ఖత్కర్ కలాన్‌లో సీఎంగా ప్రమాణం చేయనున్నారు.[11]
రాజ్యసభ సభ్యులు
రాష్ట్రం | పేరు | పదవీకాలం ప్రారంభం | పదవీకాలం ముగింపు |
---|---|---|---|
ఢిల్లీ | సుశీల్ కుమార్ గుప్తా | 2018 జనవరి 28 | 2024 జనవరి 27 |
సంజయ్ సింగ్ | 2018 జనవరి 28 | 2024 జనవరి 27 | |
2024 జనవరి 28 | 2030 జనవరి 27 | ||
ఎన్.డి. గుప్తా | 2018 జనవరి 28 | 2024 జనవరి 27 | |
2024 జనవరి 28 | 2030 జనవరి 27 | ||
స్వాతి మలివాల్ | 2024 జనవరి 28 | 2030 జనవరి 27 | |
పంజాబ్ | హర్భజన్ సింగ్ | 10-ఏప్రిల్-2022 | 04-జూలై-2028 |
రాఘవ్ చద్దా | 10-ఏప్రిల్-2022 | 04-జూలై-2028 | |
సందీప్ పాఠక్ | 10-ఏప్రిల్-2022 | 09-ఏప్రిల్-2028 | |
అశోక్ కుమార్ మిట్టల్ | 10-ఏప్రిల్-2022 | 09-ఏప్రిల్-2028 | |
సంజీవ్ అరోరా | 10-ఏప్రిల్-2022 | 09-ఏప్రిల్-2028 | |
బల్బీర్ సింగ్ సీచెవాల్ | 05-జూలై-2022 | 09-ఏప్రిల్-2028 | |
విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ | 05-జూలై-2022 | 09-ఏప్రిల్-2028 |
లోక్‌సభ సభ్యులు
రాష్ట్రం | లోక్ సభ | నియోజకవర్గం | పేరు | ఎన్నికల |
---|---|---|---|---|
పంజాబ్ | 16వ | ఫతేఘర్ సాహిబ్ (ఎస్.సి) | హరీందర్ సింగ్ ఖల్సా | 2014 |
ఫరీద్‌కోట్ (ఎస్.సి) | సాధు సింగ్ | |||
పాటియాలా | ధరమ్వీర్ గాంధీ | |||
సంగ్రూర్ | భగవంత్ మాన్ | |||
17వ | సంగ్రూర్ | 2019 | ||
జలంధర్ | సుశీల్ కుమార్ రింకూ | 2023 (ఉప ఎన్నిక) |
రాజకీయ నాయకులు
మూలాలు, వనరులు
ఇవికూడా చూడండి
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.