From Wikipedia, the free encyclopedia
2022 FIFA ప్రపంచ కప్ నాకౌట్ దశ, గ్రూపు దశ తర్వాత వచ్చే రెండవ, చివరి దశ. ఇది డిసెంబరు 3న రౌండ్ 16తో ప్రారంభమై, డిసెంబరు 18 న లుసైల్‌లోని లుసైల్ ఐకానిక్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. [1] ప్రతి గ్రూపు నుండి మొదటి రెండు జట్లు (మొత్తం పదహారు జట్లు) టోర్నమెంట్లో నాకౌట్ దశకు చేరుకుంటాయి. సెమీ-ఫైనల్లో ఓడిన రెండు జట్ల మధ్య మూడో స్థానం కోసం పోటీ జరుగుతుంది. [2]
అన్ని సమయాలు స్థానిక AST ( UTC+3 ). [1]
నాకౌట్ దశలో, సాధారణ ఆట సమయం 90 నిమిషాలు ఉంటుంది. ఆ సమయానికి స్కోరు సమంగా ఉంటే, అదనపు సమయం (ఒక్కొక్కటి 15 నిమిషాల చొప్పున రెండు పీరియడ్లు) ఆడతారు. అదనపు సమయం తర్వాత కూడా స్కోరు సమంగానే ఉంటే, విజేతలను నిర్ణయించడానికి పెనాల్టీ షూట్-అవుట్ ఆడతారు. [2]
ఎనిమిది గ్రూప్‌ల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. [2]
గ్రూప్ | విజేతలు | రన్నర్స్-అప్ |
---|---|---|
ఎ | నెదర్లాండ్స్ | సెనెగల్ |
బి | ఇంగ్లాండు | యు.ఎస్.ఏ |
సి | అర్జెంటీనా | పోలండ్ |
డి | ఫ్రాన్స్ | ఆస్ట్రేలియా |
ఇ | జపాన్ | స్పెయిన్ |
ఎఫ్ | మొరాకో | క్రొయేషియా |
జి | బ్రెజిల్ | స్విట్జర్లాండ్ |
హెచ్ | పోర్చుగల్ | దక్షిణ కొరియా |
రౌండ్ 16 | క్వార్టర్ ఫైనల్స్ | సెమీ ఫైనల్స్ | ఫైనల్ | |||||||||||
డిసెంబరు 3 – ఖలీఫా | ||||||||||||||
నెదర్లాండ్స్ | 3 | |||||||||||||
డిసెంబరు 9 – లుసాయ్ | ||||||||||||||
యు.ఎస్.ఏ | 1 | |||||||||||||
నెదర్లాండ్స్ | 2 (3) | |||||||||||||
డిసెంబరు 3 – అహ్మద్ బిన్ అలీ | ||||||||||||||
అర్జెంటీనా (పె) | 2 (4) | |||||||||||||
అర్జెంటీనా | 2 | |||||||||||||
డిసెంబరు 13 – లుసాయ్ | ||||||||||||||
ఆస్ట్రేలియా | 1 | |||||||||||||
అర్జెంటీనా | 3 | |||||||||||||
డిసెంబరు 5 – అల్ జనూబ్ | ||||||||||||||
క్రొయేషియా | 0 | |||||||||||||
జపాన్ | 1 (1) | |||||||||||||
డిసెంబరు 9 – అల్ రయ్యాన్ | ||||||||||||||
క్రొయేషియా (పె) | 1 (3) | |||||||||||||
క్రొయేషియా (పె) | 1 (4) | |||||||||||||
డిసెంబరు 5 – స్టేడియం 974 | ||||||||||||||
బ్రెజిల్ | 1 (2) | |||||||||||||
బ్రెజిల్ | 4 | |||||||||||||
డిసెంబరు 18 – లుసాయ్ | ||||||||||||||
దక్షిణ కొరియా | 1 | |||||||||||||
అర్జెంటీనా | 3 (4) | |||||||||||||
డిసెంబరు 4 – అల్ ఖోర్ | ||||||||||||||
ఫ్రాన్స్ | 3 (2) | |||||||||||||
ఇంగ్లాండు | 3 | |||||||||||||
డిసెంబరు 10 – అల్ ఖోర్ | ||||||||||||||
సెనెగల్ | 0 | |||||||||||||
ఇంగ్లాండు | 1 | |||||||||||||
డిసెంబరు 4 – అల్ తుమామా | ||||||||||||||
ఫ్రాన్స్ | 2 | |||||||||||||
ఫ్రాన్స్ | 3 | |||||||||||||
డిసెంబరు 14 – అల్ ఖోర్ | ||||||||||||||
పోలండ్ | 1 | |||||||||||||
ఫ్రాన్స్ | 2 | |||||||||||||
డిసెంబరు 6 – అల్ రయ్యాన్ | ||||||||||||||
మొరాకో | 0 | మూడో స్థానం కోసం పోటీ | ||||||||||||
మొరాకో (పె) | 0 (3) | |||||||||||||
డిసెంబరు 10 – అల్ తుమామా | డిసెంబరు 17 – ఖలీఫా | |||||||||||||
స్పెయిన్ | 0 (0) | |||||||||||||
మొరాకో | 1 | క్రొయేషియా | 2 | |||||||||||
డిసెంబరు 6 – లుసాయ్ | ||||||||||||||
పోర్చుగల్ | 0 | మొరాకో | 1 | |||||||||||
పోర్చుగల్ | 6 | |||||||||||||
స్విట్జర్లాండ్ | 1 | |||||||||||||
నెదర్లాండ్స్ | 3-1 | యు.ఎస్.ఏ |
---|---|---|
|
Report |
|
అర్జెంటీనా | 2-1 | ఆస్ట్రేలియా |
---|---|---|
|
Report |
|
జపాన్ | 1-1 | క్రొయేషియా |
---|---|---|
|
Report |
|
పెనాల్టీలు | ||
|
1–3 |
|
బ్రెజిల్ | 4-1 | దక్షిణ కొరియా |
---|---|---|
|
Report |
|
మొరాకో | 0-0 (a.e.t.) | స్పెయిన్ |
---|---|---|
Report | ||
పెనాల్టీలు | ||
|
3–0 |
|
పోర్చుగల్ | 6-1 | స్విట్జర్లాండ్ |
---|---|---|
|
Report |
|
ఈ ప్రపంచ కప్ ముందు వరకు క్రొయేషియా, బ్రెజిల్‌లు నాలుగు సార్లు తలపడగా 3 మ్యాచ్‌లలో బ్రెజిల్ గెలిచింది, ఒకటి డ్రా అయింది. వీటిలో ప్రపంచ కప్‌లో జరిగిన మ్యాచ్‌లు రెండు. ఈ రెంటిలోనూ బ్రెజిల్ గెలిచింది. 2006 లో 1-0 తో గెలవగా, 2014 లో 3-1 తో గెలిచింది.[3]
ఈ మ్యాచ్ మొదటి 90 నిమిషాల సమయంలో 0-0 తో సమంగా నిల్కవడంతో అదనపు సమయం ఆడారు. అద్నపు సమయపు తొలి అర్ధ భాగంలో ంబేమార్ బ్రెజిల్‌కు తొలి గోలు సాధించాడు. రెండో సగంలో బ్రూనో పెట్కోవిచ్ చేసిన గోలుతో క్రౌయేషియా స్కోరును సమం చేసింది. విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్‌ను జరిపారు. ఇందులో క్రొయేషియా 4-2 తో గెలిచింది. దీంతో క్రొయేషియా వరసగా రెండోసారి ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. మొత్తమ్మీద వారికి సెమీఫైనల్స్ ఆడడం ఇది మూడోసారి. 2002 ప్రపంచ కప్ ఫైనల్స్ లో జర్మనీని ఓడించాక, బ్రెజిల్ ఐరోపా జట్టు చేతుల్లో ఓడి కప్పునుండి బయటికి పోవడం ఇది వరసగా ఐదోసారి.[4] ఈ( పోటీలో గ్రీజ్‌మాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [5]
క్రొయేషియా | 1-1 | బ్రెజిల్ |
---|---|---|
|
Report |
|
పెనాల్టీలు | ||
|
4-2 |
|
ఈ ప్రపంచ కప్ ముందు వరకు నెదర్లాండ్స్ అర్జెంటీనాలు మొత్తం 9 సార్లు తలపడగా, నెదర్లాండ్స్ నాలుగుసార్లు, అర్జెంటీనా 2 సార్లు గెలవగా, 3 సార్లు డ్రా అయింది. ఈ 5 ముఖాముఖీ పోటీల్లో 5, ప్రపంచ కప్‌లో జరిగాయి. 1974 లో నెదర్లాండ్స్ 4–0 తో గెలిచింది. 1978 లో అర్జెంటీనా 3-1 తో గెలిచింది. 1998 లో నెదర్లాండ్స్ 2-1 తో గెలిచింది. ఆ తరువాత 2006 లో, 2014 లో జరిగిన రెండు పోటీలు డ్రా అయ్యాయి. 2014 లో జరిగిన పోటీ నాకౌట్ దశలో కావడంతో, ఇందులో పెనాల్టీ షూటౌట్ జరిగింది. అందులో అర్జెంటీనా గెలిచింది.[6]
ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా రెండు గోల్లు చేసి ఆధిక్యం లోకి వెళ్ళగా, ఆట రెండో సగంలో సబ్‌స్టిట్యూటుగా దిగిన వూట్ వెఘ్రోస్ట్ వరసగా రెండు గోల్లు చేసి స్కోరును సమం చేసాడు. దాంతో ఆట అదనపు సమయానికి, ఆ తరువాత పెనాల్టీ షూటౌట్కూ వెళ్ళింది. అక్కడ అర్జెంటీనా 4-3 తో గెలిచి సెమీ ఫైనల్సు లోకి ప్రవేశించింది[7]
ఈ మ్యాచ్‌లో మొత్తం 18 యెల్లో కార్డులు చూపించారు. 2006 లో నెదర్లాండ్స్ పోర్చుగల్ మ్యాచ్‌లో నెలకొల్పిన 16 యెల్లో కార్డుల రికార్డును ఈ మ్యాచ్ ఛేదించింది. [8] ఈ విషయంలో రిఫరీల నిర్ణయాలు కొన్ని విమర్శకు గురయ్యాయి.[9] [10]
ఈ మ్యాచ్ ముగింపులో ఉండగా గ్రాంట్ వాల్ అనే క్రీడా రచయిత, ప్రెస్బాక్సులో గుండెపోటుతో మరణించాడు.[11][12]
నెదర్లాండ్స్ | 2-2 | అర్జెంటీనా |
---|---|---|
|
Report |
|
పెనాల్టీలు | ||
|
3-4 |
|
మొరాకో క్వార్టర్ ఫైనల్సుకు చేరడం ఇదే తొలిసారి. క్వార్టర్ ఫైనల్సుకు చేరిన తొలి అరబ్బు దేశం మొరాకోయే, నాలుగో ఆఫ్రికా దేశం కూడా. గతంలో 1990 లో కామెరూన్, 2002 లో సెనెగల్, 2010 లో ఘనా ఈ దశకు చేరాయి. మొరాకో, పోర్చుగల్లు ఈ ప్రపంచ కప్ ముందు వరకు రెండు సార్లు తలపడగా చెరొకటి గెలిచాయి. ఈ రెండూ ప్రపంచ కప్‌లో జరిగిన పోటీలే. 1986 లో మొరాకో 3-1 తో గెలవగా, 2018 లో పోర్చుగల్ 1-0 తో గెలిచింది.[13]
ఈ మ్యాచ్‌లో యూసెఫ్ ఎన్-నేసిరి చేసిన గోలుతో మొరాకో పోర్చుగల్‌పై 1-0 తో గెలిచింది. ఆ గోలు కొట్టాక, పోర్చుగల్ తమ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోను ఆట లోకి సబ్‌స్టిట్యూటుగా దింపినప్పటికీ ఫలితం లేకపోయింది. మొరాకో, ప్రపంచ కప్పు సెమీ ఫైనల్స్ లోకి ప్రవేశించిన తొలి ఆఫ్రికా దేశం, తొలి అరబ్బు దేశమూ అయింది.[14]
ఈ ప్రపంచ కప్ ముందు వరకు ఇంగ్లాండు ఫ్రాన్సులు మొత్తం 31 సార్లు తలపడగా, ఇంగ్లాండు 17 సార్లు, ఫ్రాన్సు 9 సార్లు గెలిచాయి. 5 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఈ పోటీల్లో ప్రపంచ కప్‌లో జరిగినవి రెండే. ఈ రెండు సార్లూ ఇంగ్లాండే గెలిచింది. 1996 లో 2-0 తో గెలవగా, 1982 లో 3-1 తో గెలిచింది. [15]
ఇంగ్లాండుతో జరిగిన ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆరేలియెన్ చామాని, ఒలీవియెర్ గిరోలు చేసిన గోల్లతో ఫ్రాన్స్ మ్యాచ్‌ను గెలుచుకుని సెమీ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఇంగ్లాండు తరపున హ్యారీ కేన్ చేసిన గోలు వలన మ్యాచ్ 2-1 స్కోరుతో ముగిసింది. ఇంగ్లాండుకుకు లభించిన పెనాల్టీ కిక్ అవకాశాన్ని ఫ్రాన్స్ గోల్ కీపరు విజయవంతంగా అడ్డుకోవడంతో స్కోరును సమం చేసే అవకాశాన్ని ఇంగ్లాండు కోల్పోయింది. [16] 1998 లో బ్రెజిల్ తరువాత, గత ప్రపంచ కప్ విజేత ఈసారి సెమీ ఫైనల్స్ లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి.[17]
ఈ ప్రపంచ కప్ ముందు వరకు అర్జెంటీనా క్రొయేషియాతో 5 సార్లు పోటీ పడగా, 2 సార్లు గెలిచి, 2 సార్లు ఓడిపోయింది. ఒక్క మ్యాచ్ డ్రాగా ముగిసింది. వీటిలో రెండు మ్యాచ్‌లు ప్రపంచ కప్‌లో జరిగాయి. 1998 లో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0 తో గెలవగా, 2018 లో జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా 3-0 తో గెలిచింది.[18]
తొలి 30 నిమిషాల్లో ఇరు జట్లూ జాగ్రత్తగా ఆడాయి. 34 వ నిమిషంలో జూలియన్ ఆల్వారెజ్ను క్రొయేషియా డిఫెండరు లివకోవిచ్ డీకొట్టడంతో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ కిక్ ఇచ్చాడు. లియోనెల్ మెస్సీ దాన్ని గోలుగా మలచాడు. 39 వ నిమిషంలో ఆల్వారెజ్ అర్జెంటీనాకు రెండో గోలు సాధించాడు. ఆట రెండో సగంలో క్రొయేషియా కోచ్ అనేక ఆటగాళ్ళను మార్చాడు. 69 వ నిమిషంలో మెస్సి అందించిన పాస్‌ను ఆల్వారెజ్ గోలుగా మలచాడు. దాంతో అర్జెంటీనా 3-0 తో నెగ్గింది.[19] మెస్సీ చేసిన గోలుతో అతను మాజీ అర్జెంటీనా ఆటగాడు బటిస్టుటా ప్రపంచ కప్‌లో అర్జెంటీనా తరపున చేసిన అత్యధిక 10 గోల్ల రికార్డును ఛేదించాడు. ప్రపంచ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా జర్మను ఆటగాడు లోథార్ మాథౌస్తో సముడయ్యాడు. ఫైనల్ పోటీలో ఆడితే, మెస్సి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడౌతాడు.[20]
అర్జెంటీనా | 3-0 | క్రొయేషియా |
---|---|---|
|
Report |
ఈ ప్రపంచ కప్ ముందు వరకు ఫ్రాన్సు మొరాకోతో 7 సార్లు పోటీ పడగా, ఐదింట్లో గెలిచి, రెండింటిని డ్రా చేసుకుంది. ప్రపంచ కప్‌లో మాత్రం ఇదే వాటి తొలి పోటీ.[21]
ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌లో ఒక ఆఫ్రికా దేశం పోటీ పడడం ఇదే తొలిసారి, ఒక అరబ్బు దేశానికి కూడా ఇదే తొలిసారి. ఐరోపా, దక్షిణ అమెరికా ఖండాలు కాకుండా వేరే ఖండానికి చెందిన దేశం సెమీఫనల్సులో ఆడడం ఇది మూడోసారి. గతంలో అమెరికా 1930 లోను, దక్షిణ కొరియా 2002 లోనూ సెమీస్‌లో ఆడాయి.
థియో హెర్నాండెన్ 4 నిమిషాల 39 సెకండ్లకు తొలి గోలు చేసి ఫ్రాన్సుకు ఆధిక్యత సంపాదించి పెట్టాడు. ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో ఇంత త్వరగా గోలు చెయ్యడం 1958 తరువాత ఇదే తొలిసారి. [22]79 వ నిమిషంలో సబ్‌స్టిట్యూటుగా వచ్చిన రాండ్ల్ కోలో మువాని వచ్చిన మొదటి నిమిషం లోనే గోలు చేసి ఫ్రాన్స్ ఆధిక్యతను మరింత పెంచాడూ, చివరికి ఫ్రాన్స్ 2-0 తో మొరాకోను ఓడించి వరసగా రెండో సారి ప్రపంచ కప్ ఫైనల్సుకు చేరింది. కప్పు గెలిస్తే, వరసగా రెండో సారి కప్పు గెలవడం 1962 తరువాత (1958, 1962 లలో బ్రెజిల్ కప్పు గెలుచుకుంది) ఇదే తొలిసారి అవుతుంది. [23]
గతంలో ఈ రెండు జట్లు రెండుసార్లు (ఈ ప్రపంచ కప్ గ్రూపు దశలో ఒక పోటీతో కలిపి) పోటీపడ్డాయి.[24]
ఈ మ్యాచ్ ఏడో నిమిషంలో గోలు చేసి క్రొయేషియా ఆధిక్యం లోకి వెళ్ళినప్పటికీ, మళ్ళీ 9 వ నిమిషం లోనే మొరాకో గోలు చేసి స్కోరును సమం చేసింది.[25] మ్యాచ్ 42 వ నిమిషంలో మరొక గోలు సాధించి క్రొయేషియా, 2-1 తో మూడవ స్థానాన్ని గెలుచుకుంది. 1998 తరువాత క్రొయేషియా 3 వ స్థానంలో నిలవడం ఇదే తొలి సారి.[26]
క్రొయేషియా | 2-1 | మొరాకో |
---|---|---|
|
Report |
|
2022 డిసెంబరు 18 న జరిగిన ఫైనల్ పోటీలో పాల్గొన్న రెండు జట్లూ గతంలో ప్రపంచ కప్‌ను చెరి రెండు సార్లు గెలుచుకున్నాయి. [27] ఈ మ్యాచ్‌లో 36 నిమిషాలకే అర్జెంటీనా రెండు గోల్లు చేసి 2-0 ఆధిక్యం లోకి వెళ్ళింది.[27][28] ఫ్రాన్స్ మొదటి సగంలో గోలు చెయ్యలేకపోయింది. రెండవ సగంలో 80 వ నిమిషంలో పెనాల్టీ కిక్ ద్వారా ఎంబాపె ఫ్రాన్సుకు తొలి గోలు అందించాడు. ఆ తరువాత రెండు నిమిషాలకే మరో గోలు చేసి స్క్జోరును సమం చేసాడు. ఆట అదనపు సమయం లోకి వెళ్ళింది. 108 వ నొఇమిషంలో మెస్సి మరొక గోలు చేసి 3-2 ఆధిక్యత సాధించాడూ., మళ్ళీ ఎంబాపె పెనాల్టీ కిక్ ద్వారా ఫ్రాన్సుకు మూడవ గోలు చేసి స్కోరును సమం చేసాడు. [28] ఈ విధంగా అదనపు సమయం ముగిసేసరికి అర్జెంటీనా, ఫ్రాన్సులు 3-3 తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు. అందులో అర్జెంటీనా 4-2 తో గెలిచి ప్రపంచ కప్‌ను మూడవసారి గెలుచుకుంది. [28] ఫ్రెంచి ఆటగాడు కైలియన్ ఎంబాపె ఫైనల్లో హ్యాట్రిక్ చేయడమే కాకుండా, టోర్నమెంటులో మొత్తం 8 గోల్లు చేసి అత్యధిక గోల్లు చేసిన ఆటగాడిగా బంగారు బూట్‌ను గెలుచుకున్నాడు. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంటుగా నిలిచి బంగారు బంతిని గెలుచుకున్నాడు. అర్జెంటీనాకే చెందిన ఎమిలియానో మార్టినెజ్ అత్యుత్తమ గోల్కీపరుగా బంగారు గ్లౌజును అందుకున్నాడు. అర్జెంటీనాకే చెందిన ఎంజో ఫెర్నాండెజ్, టోర్నమెంటులో అత్యుత్తమ యువ ఆటగాడిగా ఎంపికయ్యాడు.
అర్జెంటీనా | 3-3 | ఫ్రాన్స్ |
---|---|---|
|
Report | |
పెనాల్టీలు | ||
|
4–2 |
|
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్:లియోనెల్ మెస్సి (అర్జెంటీనా)[29] | మ్యాచ్ నిబంధనలు [30]
|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.