హైపర్ ఆది
From Wikipedia, the free encyclopedia
హైపర్ ఆది తెలుగు సినిమా నటుడు, స్క్రిప్ట్ రైటర్, జబర్దస్త్ కమెడియన్. ఆయన అసలు పేరు కోట ఆదయ్య. హైపర్ ఆది జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[2][3]
హైపర్ ఆది | |
---|---|
![]() | |
జననం | కోట ఆదయ్య [1] 1990 |
వృత్తి | నటుడు , స్క్రిప్ట్ రైటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2004 నుండి ప్రస్తుతం |
జననం, విద్యాభాస్యం
హైపర్ ఆది 1990లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా , చీమకుర్తి లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ఆయన బి.టెక్ పూర్తి చేశాడు.
సినీ జీవితం
హైపర్ ఆది బి.టెక్ పూర్తి చేశాక కొంతకాలం సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేసి నటనపై ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ఆయన జబర్దస్త్ షో లో స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసి, అదిరే అభి టీంలో నటుడిగా పరిచయమై, జబర్దస్త్ లో టీమ్‌కు లీడర్‌గా ఎదిగాడు.[4] హైపర్ ఆది 2017లో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.
నటించిన సినిమాలు
సంవత్సరం | సినిమా | పాత్ర పేరు | ఇతర విషయాలు |
---|---|---|---|
2017 | రారండోయ్ వేడుక చూద్దాం | ||
మేడ మీద అబ్బాయి | బండ్ల బాబ్జి | డైలాగ్ రచయిత | |
2018 | తొలిప్రేమ | రాజు | |
సోడ గోలీసోడ | |||
ఆటగదరా శివ | ఆది | ||
సవ్యసాచి | పద్మనాభం | ||
2019 | మిస్టర్ మజ్ను | పుల్ల రావు | |
చిత్రలహరి | అజయ్ | ||
భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు | మహేష్ | ||
వెంకీ మామ | సీతారామ్ | ||
2020 | అల వైకుంఠపురములో | రంగరాజు | |
2021 | 30 రోజుల్లో ప్రేమించటం ఎలా | ||
క్రాక్ | కానిస్టేబుల్ | ||
నాట్యం | |||
2022 | భీమ్లా నాయక్ | భీమ్లా నాయక్ పాటలో | |
ధమకా | |||
2023 | సార్ | కార్తీక్ | |
ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ | ఆది | ||
దాస్ కా ధమ్కీ | |||
రావణాసుర | |||
రూల్స్ రంజన్ | ఆది | ||
2024 | గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి | - | |
లక్కీ భాస్కర్ | |||
శివం భజే | |||
మెకానిక్ రాకీ | |||
పుష్ప 2 | కోటయ్య | ||
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.