హైదరాబాదు సరిహద్దు గోడ

భారత దేశంలోని నగర గోడ From Wikipedia, the free encyclopedia

హైదరాబాదు సరిహద్దు గోడ
Remove ads

హైదరాబాదు సరిహద్దు గోడ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీకి సరిహద్దుగా కట్టబడిన గోడ. ఆ తరువాతికాలంలో హైదరాబాదు నగరం గోడను దాటి విస్తరించింది.[2] సుమారు 6 మైళ్ళ (9.7 కిమీ) పొడవు, 41 మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న ఈ గోడ నగరం చుట్టూ సమృద్ధిగా లభించిన పెద్ద గ్రానైట్ రాళ్ళతో నిర్మించబడింది.

Thumb
1908నాటి హైదరాబాదు వరదలు వచ్చినప్పుడు శరణార్థులు అఫ్జల్ దర్వాజా వంతెనపై నడుస్తున్న దృశ్యం
Thumb
గోడ, దర్వాజాలతో ఉన్న హైదరాబాదు నగర పటం (1914)[1]
Remove ads

నిర్మాణం

కుతుబ్ షాహీ వంశముకు చెందిన చివరి సుల్తాన్ అబుల్ హసన్ కుతుబ్ షా ఈ గోడ నిర్మాణాన్ని ప్రారంభించాడు. దక్కన్ మొఘల్ గవర్నర్ ముబారిజ్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్మాణం కొనసాగి, మొదటి నిజాం- (నిజాం-ఉల్-ముల్క్ ఆసఫ్ జా I) చేత 1802లో పూర్తయ్యింది.[3][4] దీని నిర్మాణానికి 16 సంవత్సరాలు పట్టింది. శత్రువులు ఏమాత్రం పైకి ఎక్కకుండా రాళ్లతో సుమారు 18 అడుగుల (5.49 మీ) ఎత్తు, 8 అడుగుల (2.44 మీ) వెడల్పుతో ఈ గోడను నిర్మించారు. నగరానికి రాకపోకలు సాగించడానికి వీలుగా 13 ద్వారాలు (దర్వాజాలు) ఏర్పాటుచేసి, ఆ పదమూడు దర్వాజాలకు ఆనుకొని కిటికీలు ఏర్పాటుచేసి అక్కడ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.[5] నగర భద్రత కోసం రాత్రివేళలో ఈ దర్వాజాలు మూసేవారు. ఒకసారి రాత్రి దర్వాజాలు మూస్తే,ఎట్టి పరిస్థితిలోనూ తెల్లవారుజాము వరకు తెరిచేవారు కాదు.[6]

Thumb
అఫ్జల్ దర్వాజా (ఆఖరున 1861లో నిర్మించబడి, 1954లో కూల్చివేయబడింది)
Thumb
దబీర్‌పురా (ప్రస్తుతమున్న రెండు దర్వాజాల్లో ఇది ఒకటి)[7]
Thumb
1920లో పురానపూల్ దర్వాజా (ప్రస్తుతమున్న రెండు దర్వాజాల్లో ఇది ఒకటి)
Thumb
గోడ, దర్వాజాలతో ఉన్న హైదరాబాదు నగర పటం (1911)
Remove ads

దర్వాజలు

చాదర్‌ఘాట్‌ నుంచి దబీర్‌పురా వరకు ఏర్పాటుచేసిన ఈ 13 ద్వారాలకు ఆయా ప్రాంతాలను బట్టి పేర్లు పెట్టారు.[8] వాటిల్లో ప్రస్తుతం రెండు దర్వాజాలు (పురానపూల్ దర్వాజా, దబీర్‌పురా దర్వాజా) మాత్రమే మిగిలి ఉన్నాయి.[9][10][11]

  1. పురానపూల్ దర్వాజా (పురానపూల్)
  2. దబీర్‌పురా దర్వాజా (దబీర్‌పురా)
  3. చాదర్‌ఘాట్ దర్వాజా (చాదర్ ఘాట్)
  4. యాకుత్పురా దర్వాజా (యాకుత్‌పురా)
  5. అలియాబాద్ దర్వాజా (అలియాబాద్): రెండవ నిజాం అలీఖాన్ పేరు పెట్టబడింది.
  6. చంపా దర్వాజా
  7. లాల్ దర్వాజా
  8. గౌలిపురా దర్వాజా (గౌలిపురా): 1950లలో వీధులను విశాలం చేసే కార్యక్రమంలో ఈ దర్వాజా కాలగతిలో కనుమరుగయ్యింది.
  9. ఫతే దర్వాజా
  10. దూధ్ బౌలి దర్వాజా
  11. డిల్లీ దర్వాజా
  12. మీర్ జుమ్లా దర్వాజా
  13. అఫ్జల్ దర్వాజా: ఇది ఆఖరున 1861లో అఫ్జల్ ఉద్దౌలా కాలంలో నిర్మించబడింది.[1]
Remove ads

ఇతర వివరాలు

  1. 1908లో మూసీ నదికి వరదలు వచ్చిన సమయంలో ఈ గోడ చాలాభాగం ధ్వంసమైంది. స్వాతంత్ర్యం తరువాత ప్రభుత్వం 1950, 1960లలో కూల్చివేసింది.[12]
  2. ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాదాపు అన్నిప్రాంతాల్లో పూర్తి గోడ ధ్వంసమవ్వగా అలియాబాద్ వద్ద కొంతభాగం ఇప్పటికీ వాడుకలో ఉంది.[12][13]

మూలాలు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads