హసన్ అలీ

పాకిస్తానీ క్రికెటర్ From Wikipedia, the free encyclopedia

హసన్ అలీ

హసన్ అలీ (జనన 1994, జూలై 2) పాకిస్తానీ క్రికెటర్. జాతీయ జట్టు తరపున క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లలో ఆడేవాడు.[3] 2013 అక్టోబరులో సియాల్‌కోట్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[4] 2016 ఆగస్టులో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[5] 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[6] పదమూడు వికెట్లు తీసిన తర్వాత అలీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికవ్వడంతో పాకిస్థాన్ టోర్నమెంట్‌ను గెలుచుకుంది. జస్ప్రీత్ బుమ్రా చివరి వికెట్‌ను తీశాడు.[7] పాకిస్థాన్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[8] 2018 ఆగస్టులో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ద్వారా 2018–19 సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ముప్పై-మూడు మంది ఆటగాళ్లలో అతను ఒకడు.[9][10]

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పుట్టిన తేదీ ...
హసన్ అలీ
Thumb
హసన్ అలీ (2021)
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1994-07-02) 2 జూలై 1994 (age 30)
మండి బహౌద్దీన్, పంజాబ్, పాకిస్తాన్
ఎత్తు174 సెంమీ[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రబౌలర్
బంధువులుఅథర్ మహమూద్ (బంధువు)[2]
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 228)2017 మే 10 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు2023 జనవరి 2 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 209)2016 ఆగస్టు 18 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2022 జూన్ 12 - వెస్టిండీస్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.32
తొలి T20I (క్యాప్ 71)2016 సెప్టెంబరు 7 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2022 సెప్టెంబరు 9 - శ్రీలంక తో
T20Iల్లో చొక్కా సంఖ్య.32
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2013/14–2014/15Sialkot
2015/16–2017/18ఇస్లామాబాద్
2016–2020Peshawar Zalmi (స్క్వాడ్ నం. 27)
2017St Kitts and Nevis Patriots (స్క్వాడ్ నం. 32)
2017Comilla విక్టోరియాns (స్క్వాడ్ నం. 32)
2019/20–2021/22Central పంజాబ్ (స్క్వాడ్ నం. 32)
2021-presentIslamabad United (స్క్వాడ్ నం. 32)
2022లాంకషైర్ (స్క్వాడ్ నం. 32)
2023వార్విక్‌షైర్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I ఫక్లా
మ్యాచ్‌లు 21 60 49 65
చేసిన పరుగులు 366 363 129 1,117
బ్యాటింగు సగటు 13.55 15.12 16.12 15.30
100లు/50లు 0/0 0/2 0/0 1/3
అత్యుత్తమ స్కోరు 30 59 23 106*
వేసిన బంతులు 3,696 2,882 997 11,954
వికెట్లు 77 91 60 274
బౌలింగు సగటు 24.57 30.36 23.15 23.76
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 6 4 0 18
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 0 4
అత్యుత్తమ బౌలింగు 5/27 5/34 4/18 8/107
క్యాచ్‌లు/స్టంపింగులు 6/- 13/- 11/- 20/-
మూలం: Cricinfo, 3 January 2023
మూసివేయి

అంతర్జాతీయ క్రికెట్

2016 ఆగస్టులో ఇంగ్లాండ్, ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌ల కోసం అలీని పాకిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో చేర్చారు.[11] 2016 ఆగస్టు 18న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. 2016 సెప్టెంబరు 7న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.[12]

2017 జనవరి 22న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో అలీ తన మొదటి ఐదు వికెట్లు సాధించాడు.[13]

2017 ఏప్రిల్ లో, వెస్టిండీస్‌తో సిరీస్ కోసం అలీని పాకిస్తాన్ టెస్ట్ జట్టులో చేర్చారు.[14] 2017 మే 10న వెస్టిండీస్‌తో జరిగిన మూడవ టెస్ట్‌లో పాకిస్తాన్ తరపున తన అరంగేట్రం చేసాడు.[15]

వ్యక్తిగత జీవితం

2019 ఆగస్టు 20న, దుబాయ్‌లో భారతీయ ఫ్లైట్ ఇంజనీర్ సమియా అర్జూతో హసన్ అలీ వివాహం జరిగింది.[16][17] 2021 ఏప్రిల్ 6న, మొదటి బిడ్డ జన్మించింది.[18][19] తమ అమ్మాయికి హెలెనా హసన్ అలీ అని పేరు పెట్టారు.[20]

అవార్డులు/విజయాలు

  • పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: 2017[21]
  • ఐసీసీ వరల్డ్ వన్డే XI: 2017[22]
  • ఐసీసీ పురుషుల ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: 2017[23]
  • పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: 2018[24]
  • పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: 2021[25]
  • అతను 2021 సంవత్సరానికి ఐసీసీ పురుషుల టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో ఎంపికయ్యాడు[26]

మూలాలు

బాహ్య లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.