హరీష్ కళ్యాణ్ (జననం 1990 జూన్ 29) తమిళ చిత్రాలలో ప్రధానంగా నటించే భారతీయ నటుడు. 2010లో సింధు సమవేలి చిత్రంతో అరంగేట్రం చేసిన ఆయన పోరియాలన్ (2014), విల్ అంబు (2016), ప్యార్ ప్రేమ కాదల్ (2018)లలో తన నటనకు గుర్తింపుపొందాడు.[1]

త్వరిత వాస్తవాలు హరీష్ కళ్యాణ్, జననం ...
హరీష్ కళ్యాణ్
జననం (1990-06-29) 1990 జూన్ 29 (వయసు 34)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తి
  • నటుడు
  • నేపథ్య గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2010 – ప్రస్తుతం
జీవిత భాగస్వామినర్మదా ఉదయకుమార్ (m. 2022)
మూసివేయి

ప్యార్ ప్రేమ కాదల్ చిత్రం అదే పేరుతో తెలుగు వెర్షన్‌లోకి డబ్ చేయబడి 2018 సెప్టెంబరు 21న విడుదలయింది. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో 2022లో తెలుగులో అల్లు శిరీష్, అను ఇమాన్యుయెల్‌ జంటగా ఊర్వశివో రాక్షసివో పేరుతో రీమేక్ చేయబడింది. తెలుగులో 2017లో వచ్చిన కాదలిలో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించాడు. జెర్సీ చిత్రంలో యంగ్‌ నాని లుక్‌లోనూ ఆయన కనిపించి మెప్పించాడు.

హరీష్ కళ్యాణ్ హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాడు, కీబోర్డ్ కూడా ప్లే చేయగలడు. 2012లో "కుట్టి పెగ్ - ఎ టోస్ట్ టు లైఫ్", "ఒవ్వోరు మనుషనుకుమ్ ఒవ్వోరు ఫీలింగ్స్" పాటలను ఆయన రూపొందించాడు. 2016లో "ఐయామ్ సింగిల్" అనే పేరుతో మరో పాటను విడుదల చేసాడు, ఈ పాటకు గాయకుడుగానే కాక గీత రచయితగా కూడా ఆయన వ్యవహరించాడు.

2017లో స్టార్ విజయ్ లో ప్రసారమైన తమిళ బిగ్ బాస్ సీజన్ 1లో హరీష్ కళ్యాణ్ సెకండ్ రన్నరప్ గా నిలిచాడు. ఆ తరువాతి సంవత్సరం జీ తమిళ్ లో వచ్చిన జీన్స్ సీజన్ 3లో పాల్గొన్నాడు.

ఫిల్మోగ్రఫీ

మరింత సమాచారం Year, Film ...
Year Film Role Language Notes
2010 సింధు సమవేలి అన్బు తమిళం అరంగేట్రం[2]
అరిదు అరిదు సన్
2011 సత్తపది కుట్రం సూర్య
2013 చందమామ యువన్
జై శ్రీరామ్ సిద్ధూ తెలుగు
2014 పోరియాలన్ శరవణన్ తమిళం
2016 విల్ అంబు అరుల్
2017 కాదలి కార్తికేయ "కార్తీక్" తెలుగు
2018 ప్యార్ ప్రేమ కాదల్ శ్రీ కుమార్ తమిళం
2019 ఇస్పడే రాజవుం ఇధయ రాణియుం గౌతమ్
జెర్సీ పెద్ద నాని తెలుగు అతిధి పాత్ర[3]
ధనస్సు రాశి నేయర్గలే అర్జున్ తమిళం
2020 ధరాల ప్రభు ప్రభు గోవింద్ [4]
2021 కసడ తపర కృష్ణ మూర్తి "కిష్" ఆంథాలజీ ఫిల్మ్; విభాగం: పాంధాయం
ఓ మనపెన్నె! కార్తీక్
2023 లెట్స్‌ గెట్‌ మ్యారీడ్ గౌతమ్
పార్కింగ్ ఈశ్వర్
2024 నూరు కోడి వానవిల్ వినో / రిచీ
డీజిల్
లబ్బర్ పాండు
మూసివేయి

వ్యక్తిగత జీవితం

హరీష్ కళ్యాణ్ తండ్రి ఫైవ్ స్టార్ కళ్యాణ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, మ్యూజిక్ లేబుల్ యజమాని. అతను విల్ అంబు (2016)లో హరీష్ కళ్యాణ్ తండ్రిగా నటించాడు. అక్టోబర్ 2022లో హరీష్ కళ్యాణ్ నర్మదా ఉదయకుమార్‌ని వివాహం చేసుకున్నాడు.[5][6]

అవార్డులు

మరింత సమాచారం Year, Award ...
Year Award Category Film/Work Result Ref.
2017 ఎడిసన్ అవార్డ్స్ రొమాంటిక్ హీరో ఆఫ్ ది ఇయర్ ప్యార్ ప్రేమ కాదల్ విజేత [7]
2022 ఫేవరెట్ హీరో ఆఫ్ ది ఇయర్ ఓ మన్నపెన్నె! విజేత
ఉత్తమ యాంటీ హీరో పాత్ర కసడ తపర విజేత
మూసివేయి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.