హనీఫ్ మొహమ్మద్
పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు From Wikipedia, the free encyclopedia
హనీఫ్ మొహమ్మద్ (1934, డిసెంబరు 21 - 2016, ఆగస్టు 11) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు.[1] పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరపున 1952-53 సీజన్, 1969-70 సీజన్ మధ్య 55 టెస్ట్ మ్యాచ్‌లలోఆడాడు. 43.98 సగటుతో పన్నెండు సెంచరీలు చేశాడు. ఒకానోక సమయంలో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పరిగణించబడ్డాడు; 17 ఏళ్ళ కెరీర్‌లో హనీఫ్ కేవలం 55 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ.ఎస్.పీ.ఎన్. నిర్వహించిన ఇతని సంస్మరణలో, ఇతను అసలైన లిటిల్ మాస్టర్‌గా గౌరవించబడ్డాడు, ఈ బిరుదును సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ స్వీకరించారు.[2] టెస్టు మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి పాకిస్థానీ ఆటగాడిగా నిలిచాడు.[3]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | హనీఫ్ మొహమ్మద్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | జునాగఢ్, జునాగఢ్ రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా | 1934 డిసెంబరు 21|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 11 ఆగస్టు 2016 81) కరాచీ, సింధ్, పాకిస్తాన్ | (aged|||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | లిటిల్ మాస్టర్ | |||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 7 అం. (1.70 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | వజీర్ మొహమ్మద్ (సోదరుడు) రయీస్ మొహమ్మద్ (సోదరుడు) ముస్తాక్ మహ్మద్ (సోదరుడు) సాదిక్ మొహమ్మద్ (సోదరుడు) షోయబ్ మహ్మద్ (కొడుకు) షెహజార్ మొహమ్మద్ (మనవడు) | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 4) | 1952 అక్టోబరు 16 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1969 అక్టోబరు 24 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2008 ఆగస్టు 3 |
క్రికెట్ రంగం
1951, నవంబరులో ఎంసీసీకి వ్యతిరేకంగా పాకిస్తాన్ తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. 165 నిమిషాల్లో 26 పరుగులు చేశాడు. 1952, అక్టోబరులో భారత్ తో జరిగిన మ్యాచ్ తో టెస్ట్ అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.[4]
ఆస్ట్రేలియాతో జరిగిన ఒక టెస్టు మ్యాచ్‌లో హనీఫ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. రెండవది, 93 పరుగుల వద్ద టామ్ వీవర్స్ బౌలింగ్‌లో బారీ జర్మాన్‌చే స్టంపౌడ్‌గా ఔటయ్యాడు. అంపైర్ నిర్ణయాన్ని హనీఫ్ గౌరవించాడు. తర్వాత విలేకరుల సమావేశంలో జర్మాన్ హనీఫ్ నాటౌట్ అని ఒప్పుకున్నాడు.[5]
విరమణ తరువాత
1972లో, అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత, ది క్రికెటర్ పాకిస్థాన్ అనే పత్రికను సహ-స్థాపించాడు. రెండు దశాబ్దాలపాటు ఈ పత్రికకు సంపాదకత్వం వహించాడు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కి టీమ్ మేనేజర్‌గా కూడా పనిచేశాడు.[2]
మరణం
ఇతనికి 2013లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో కరాచీలోని ఆగాఖాన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 2016 ఆగస్టు 11న తన 81వ ఏట మరణించాడు.[2]
నివాళి, అవార్డులు, గుర్తింపు
2018లో, ఇతని 84వ పుట్టినరోజును జరుపుకోవడానికి గూగుల్ డూడుల్ సృష్టించబడింది.[6] 1957/58లో వెస్టిండీస్ జట్టుపై హనీఫ్ చేసిన ట్రిపుల్ సెంచరీ అతన్ని క్రికెట్ ప్రపంచంలో లెజెండ్‌గా మార్చింది. ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన వారిలో ఒకడిగా ఉన్నాడు.[2]
మూలాలు
బాహ్య లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.