తెలుగు పద్యకావ్యం From Wikipedia, the free encyclopedia
హంసవింశతి ఒక విశేషమైన శృంగార నీతి కావ్యం. దీనిని అయ్యలరాజు నారాయణామాత్యుడు రచించాడు.
హంసవింశతి | |
కృతికర్త: | అయ్యలరాజు నారాయణామాత్యుడు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నీతికథలు |
ప్రచురణ: | ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాదు |
విడుదల: | 1977 |
పేజీలు: | 328 |
ఈ అపురూపమైన పద్యకావ్యానికున్న విజ్ఞానసర్వస్వ లక్షణాలను నిరూపించేందుకు జి.వెంకటరత్నం పరిశోధనచేసి; సంబంధించిన సిద్ధాంత గ్రంథాన్ని ముద్రించారు.[1]
అవతారిక.; కథా ప్రారంభము; చిత్రమహారాజ చరిత్రము; సాతాని హేమావతి; విష్ణుదాసుని విదేశ ప్రయాణ సన్నాహము.
1. మొదటి రాత్రి:-సాతాని భామిని ఱేనికడకుఁ బయనమగుట, హంస వారించి బుద్ధి సెప్పుట.
2. రెండవ రాత్రి కథ:- కక్కుర్తిబడి చచ్చిన నక్క. బ్రాహ్మణ కుమారుని చదువు సంధ్యలు, తీర్థయాత్ర.
3. మూడవ రాత్రి కథ:- నాయకుని భార్య హేమరేఖ గుప్తగుణుఁ డను వైద్యుని గూడుట; నాయకుని ఆయుధములు, పరిశ్రమ; వైద్యుడు, వాని పరిశ్రమ.
4. నాల్గవ రాత్రి కథ:- తొగట మగువ పాఱుపత్తె గానిఁ గూడుట; నేఁతగాని యిల్లు.
5. అయిదవ రాత్రి కథ:- గొల్ల చిన్నది బాపన చిన్నవానిఁ గూడుట; గోప గృహము - గొఱ్ఱెలు.
6. ఆఱవ రాత్రి కథ:- చలిపందిరి - బ్రాహ్మణ సుందరి తెరువరిఁ గూడుట.
7. ఏడవ రాత్రి కథ:- కంసాలి కోమలి ధూర్తుఁడను శిష్యునిఁ గూడుట.
8. ఎనిమిదవ రాత్రి కథ:- కోమటి దంపతులు సంకేతస్థలమున బొరపాటునఁ గూడుట; కోమటిల్లు - అంగడి దినుసులు.
9. తొమ్మిదవ రాత్రి కథ:- ముచ్చివాని భార్య తిరునాళ్ల గోవాళ్లఁ గూడుట; మృగ పక్షుల పట్టి; తిరునాళ్ల వేడుకలు.
10. పదవ రాత్రి కథ:- భూతవైద్యుని యిల్లా లొకరేయి నలుగురిని గూడుట.
11. పదునొకండవ రాత్రి కథ:- కడఁద్రోయఁబడిన బడబ తిరిపగానిఁ గూడుట; పండిత పరిశ్రమ; ధూర్త విద్యార్థి చేష్టలు; బాల క్రీడలు.
12. పండ్రెండవ రాత్రి కథ:- శివదత్తయోగి సతి కోడిపందెగానిఁ గూడుట; కోడి పందెములు - కోళ్లు
13. పదుమూడవ రాత్రి కథ:- నియోగి భార్య జోస్యుని గూడుట; పర్వతములు, కంపచెట్లు, చిఱుచెట్లు, మహావృక్షములు, గణిత శాస్త్రము; జోస్యుని సరకులు.
14. పదునాల్గవ రాత్రి కథ:- కోమటిబోటి సుంకరి కొల్వుకానిఁ గూడుట; వశీకరణ మంత్ర ప్రయోగము.
15. పదునేనవ రాత్రి కథ:- రెడ్డిసాని యొక పగ లిద్దఱినిఁ గూడుట; కృషీవలు నిల్లు, ధాన్యములు, కాయలు.
16. పదునాఱవ రాత్రి కథ:- జాలరి బిత్తరి తైర్థికునిఁ గూడుట; పడవలు, వలలు, జలచరములు, పుణ్యక్షేత్ర తీర్థ విశేషములు.
17. పదునేడవ రాత్రి కథ:- కుమ్మరి గుమ్మ సాలెవానిఁ గూడుట; కుమ్మరి పరిశ్రమ; గడ్డి రకములు; గాలి - వాన.
18. పదునెనిమిదవ రాత్రి కథ:- అత్తకోడండ్రు ఉపపతులఁ గూడుట; కొఱగాని కొడుకు; నృత్య గాన విశేషములు; స్త్రీ వశీకరణౌషధములు; మర్లు మందు.
19. పందొమ్మిదవ రాత్రి కథ:- గాండ్లచేడె ద్విజవటువును గూడుట; వసంతము.
20. ఇరువదవ రాత్రి కథ:- మంత్రికుమారుని భార్యలిద్దఱు నిద్దఱిని గూడుట; కామినీ గర్హణము; విదేశముల నుండి దిగుమతి యగు వస్తువులు; భారతదేశ పుర గ్రామములు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.