స్టీవ్ ఎల్వర్తీ

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ From Wikipedia, the free encyclopedia

స్టీవెన్ ఎల్వర్తీ (జననం 1965, ఫిబ్రవరి 23) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున క్రికెట్ సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతో కలిసి ఆడాడు. ఎల్వర్తీ 1998 ఐసీసీ నాకౌట్ ట్రోఫీని గెలుచుకున్న దక్షిణాఫ్రికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు, ఇప్పటివరకు దేశం గెలిచిన ఏకైక ఐసీసీ ట్రోఫీ అది.

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పుట్టిన తేదీ ...
స్టీవెన్ ఎల్వర్తీ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1965-02-23) 23 ఫిబ్రవరి 1965 (age 60)
బులవాయో, రోడేషియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1988–1997Northern Transvaal
1996Lancashire
1997–2003Northerns
2003Nottinghamshire
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI
మ్యాచ్‌లు 4 39
చేసిన పరుగులు 72 100
బ్యాటింగు సగటు 18.00 12.50
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 48 23
వేసిన బంతులు 867 1,702
వికెట్లు 13 44
బౌలింగు సగటు 34.15 28.06
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/66 3/17
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 9/–
మూలం: Cricinfo, 2006 25 January
మూసివేయి

జననం, తొలి జీవితం

ఎల్వర్తీ 1965, ఫిబ్రవరి 23న జన్మించాడు. జింబాబ్వేలో పెరిగాడు. చాప్లిన్ హైస్కూల్‌లో చదువుకున్నాడు. 18 సంవత్సరాల వయస్సులో దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు.

అంతర్జాతీయ కెరీర్

10 సంవత్సరాల ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన తర్వాత 32 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికా తరపున 1998, ఏప్రిల్ 3న పాకిస్థాన్‌పై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరం జూలై 23న నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్‌పై టెస్ట్ అరంగేట్రం చేశాడు.

1998 - 2002 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా తరపున మొత్తం నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు, 39 వన్డేలు ఆడాడు.[1]

దేశీయ కెరీర్

దక్షిణాఫ్రికాలో 14-సీజన్ కెరీర్‌లో నార్తర్న్స్ తరపున ఆడాడు. 2000–01లో 18.11 సగటుతో 52తో దక్షిణాఫ్రికా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ప్రధాన వికెట్ టేకర్‌గా నిలిచాడు. 2002లో ఐదుగురు దక్షిణాఫ్రికా క్రికెట్ వార్షిక క్రికెటర్లలో ఒకరిగా ఎంపికయ్యాడు. 2003లో నార్తర్న్స్ స్క్వాడ్ నుండి స్నేహపూర్వకంగా వైదొలిగాడు.[2]

ఎల్వర్తీ ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు. 1996లో లాంక్షైర్‌లో ఒక సీజన్ ఆడాడు.[1] 2003లో నాటింగ్‌హామ్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌లో ఆరు వారాలపాటు ఉన్నాడు.[3]

ఇంగ్లీష్ క్లబ్ సైడ్ హింక్లీ టౌన్ కోసం ఆడాడు. ఇంగ్లీష్ క్లబ్ జట్లు రిష్టన్, ఫ్లవరీ ఫీల్డ్ కోసం చాలా సంవత్సరాలు ప్రొఫెషనల్ ప్లేయర్‌గా కూడా ఉన్నాడు.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.