From Wikipedia, the free encyclopedia
సౌమ్య బొల్లాప్రగడ భారతీయ నటి, మోడల్, రచయిత్రి, దర్శకురాలు కూడా. ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో నటించింది. ఆమె నటి గౌతమి మేనకోడలు. అలాగే సుప్రసిద్ధ భారతీయ తత్త్వవేత్త ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తికి మనవరాలు. ఆమె నిర్మలా సీతారామన్‌కి కూడా బంధువు. ప్రపంచంలో మొట్టమొదటి స్వలింగ సంపర్కుడైన ప్రిన్స్ మన్వేంద్ర సింగ్ గోహిల్‌కి రాఖీ సోదరి కూడా. ఆమె గుజరాత్‌లోని రాజ్‌పిప్లాకు చెందినది.[2][3]
సౌమ్య బొల్లాప్రగడ | |
---|---|
జననం | జూన్ 26 [1] విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2005 – ప్రస్తుతం |
ఎత్తు | 5 అ. 10 అం. (1.78 మీ.)[1] |
ఆమె తండ్రి దివాకర్ మర్చంట్ నేవీలో ఇంజనీర్, తల్లి గృహిణి.[4] ఆమెకు ఒక తమ్ముడు సౌరభ్ ఉన్నాడు. ఆమె సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి పట్టభద్రురాలైంది.[5] జర్నలిజం చదివి జర్నలిస్టు కావాలని కలలు కన్నది.[6] ఆమె ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యం, మనస్తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది.[4]
కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి అమ్మాయిలు పాల్గొన్న మిస్ సౌత్ ఇండియా కాంటెస్ట్‌లో ఆమె ఆరుగురు ఫైనలిస్టులలో ఒకరు. 5 అడుగుల 8 ఇంగుళాల (1.73 మీ) ఎత్తు ఉన్న ఆమె ఈ పోటీలో మిస్ ఫోటోజెనిక్, మిస్ పర్ఫెక్ట్ 10 రౌండ్‌లను కైవసం చేసుకుంది.[5] జనవరి 2005లో హైదరాబాద్‌లో జరిగిన మిస్ ఆంధ్రా పోటీలో ఆమె ఎత్తుకు సంబంధించి మిస్ పర్సనాలిటీ రౌండ్‌ను కూడా గెలుచుకుంది. ఏప్రిల్ 2005లో ఆమె విశాఖపట్నంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ నిర్వహించిన మిస్ ఎన్‌ఐఎఫ్‌డి టైటిల్‌ను గెలుచుకుంది.
కాలేజీ రోజుల్లో మోడలింగ్ ప్రారంభించిన ఆమె కౌశిక్ ఘోష్ దగ్గర శిక్షణ పొందింది.[5] ఆమె కేరళలో కెపిఎల్ కోకోనట్ ఆయిల్ యాడ్ మోడల్ గా చేసింది. అలాగే సన్ ఫ్లవర్ షాపింగ్ మాల్ యాడ్, అనార్కలి బోటిక్ యాడ్ వంటి ఇతర వాటిల్లో కూడా నటించింది.
ఆమె వైజాగ్ కేంద్రంగా మూడున్నరేళ్ల పాటు ఎవోక్ మాసపత్రికను నడిపింది. దీనితో పాటు, ఆమె 14 సంవత్సరాల వయస్సులోనే కవిత్వంలో మూడు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది.
ఆమె క్రాస్ ఓవర్ ఫిల్మ్ ది ఆంగ్రెజ్‌లో తన సినిమా అరంగేట్రం చేసింది. ఆమెకు థియేటర్ నేపథ్యం ఉంది. ఇది ఆమెకు సినిమాల్లోకి రావడానికి సహాయపడింది. ఆమె ఆంధ్రా యూనివర్శిటీలో ఒక నాటకంలో నటించింది. దీంతో ది ఆంగ్రెజ్ డైరెక్టర్ కుంటా నిక్కిల్ చేత గుర్తించబడింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులను కలిగి ఉన్న ఈ చిత్రం ఇప్పటికీ కల్ట్ క్లాసిక్‌గా పరిగణించబడుతుంది. ఆమె స్టేల్మేట్ అనే ఆంగ్ల చిత్రంలో కూడా నటించింది. ఆమె తమిళంలో చెన్నై 600028 స్టార్స్‌తో తోజలో అరంగేట్రం చేసింది. రవికృష్ణతో ఆమె నటించిన నేట్రు ఇంద్రు నాళై సినిమా తెలుగులో నిన్న నేడు రేపుగా వచ్చింది. ఆమె మూవీ మొగల్ డి రామానాయుడు నిర్మించిన ముగ్గురులో నటించి మెప్పించింది.[7] ఆమె 4డి హర్రర్ చిత్రం పొగ, రామదండు చిత్రాలు విడుదల కావాల్సిఉన్నాయి.[8][9]
ఆమె అప్లాజ్ - థియేటర్ పీపుల్ అనే థియేటర్ గ్రూప్ వ్యవస్థాపకురాలు.[10] ఆమె జెమినీ టీవీలో నటుడు ఏవిఎస్ తో కలిసి జాలీవుడ్ ఎక్స్‌ప్రెస్ అనే హాస్య కార్యక్రమం కూడా నిర్వహించింది. ఆమె జీ తెలుగులో జీ సౌండ్ పార్టీని కూడా హోస్ట్ చేసింది. ప్రఖ్యాత రచయిత అశ్విన్ సంఘీ నిర్వహించిన దేశవ్యాప్త పోటీలో ఆమె విజేతగా కూడా నిలిచింది. ఆమె ఛోటా భీమ్, మరికొన్ని విజయవంతమైన యానిమేటెడ్ షోలకు రచయిత్రి, ఈవెంట్‌లలో కూడా పాల్గొన్నది.[4]
Year | Film | Role | Language | Other notes |
2005 | ది ఆంగ్రేజ్ | తాన్య | హైదరాబాదీ ఉర్దూ | |
2007 | స్టేల్మేట్ | ఆంగ్లం | ||
ఆ రోజే | తెలుగు | |||
2008 | తోజ | మనీషా గుప్తా | తమిళం | |
నేత్రు ఇంద్రు నాళై | తమిళం | |||
నిన్న నేడు రేపు | తెలుగు | |||
కాల్ సెంటర్ | తెలుగు | |||
2010 | యంగ్ ఇండియా | కీర్తి | తెలుగు | |
2011 | ముగ్గురు | మోహిని | తెలుగు | |
2012 | పొగ | తెలుగు | ||
రామదండు | తెలుగు | |||
2014 | చందమామ కథలు | స్పెషల్ అప్పీయరెన్స్ | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.