సోమ్ ప్రకాశ్
From Wikipedia, the free encyclopedia
సోమ్ ప్రకాష్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు పంజాబ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2019లో తొలిసారి హోషియార్‌పూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై 30 మే 2019 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2]
సోమ్ ప్రకాశ్ | |||
![]() | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 30 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
లోక్‌సభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 మే 2019 | |||
ముందు | విజయ్ సంప్లా | ||
నియోజకవర్గం | హోషియార్‌పూర్ నియోజకవర్గం | ||
శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 2012-2019 | |||
ముందు | స్వర్ణ రామ్ | ||
నియోజకవర్గం | ఫగ్వారా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | దౌలత్ పూర్, పంజాబ్, భారతదేశం | 3 ఏప్రిల్ 1949||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | అనిత సోమ్ ప్రకాశ్ | ||
సంతానం | 2 | ||
నివాసం | ఫగ్వారా, కపుర్తలా జిల్లా |
రాజకీయ జీవితం
సోమ్ ప్రకాష్ రాజకీయాల్లోకి రాక ముందు ఐఏఎస్ గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. ఆయన అనంతరం భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి 2012లో తొలిసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. సోమ్ ప్రకాష్ 2017లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హోషియార్‌పూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై 30 మే 2019 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[3]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.