Remove ads
మిజోరాం రాష్ట్రంలోని సెర్ఛిప్ జిల్లా ముఖ్య పట్టణం. From Wikipedia, the free encyclopedia
సెర్ఛిప్, మిజోరాం రాష్ట్రంలోని సెర్ఛిప్ జిల్లా ముఖ్య పట్టణం, ప్రధాన కార్యాలయం. మిజోరాం మధ్యభాగంలో ఉన్న ఈ పట్టణం రాష్ట్ర రాజధాని ఐజాల్ నగరానికి 112 కి.మీ.ల దూరంలో ఉంది. దేశం మొత్తంమీద ఈ జిల్లాలో అత్యధిక అక్షరాస్యత ఉంది. సెర్ఛిప్ గ్రామంలోని మొదటి కొండపైన కనిపించే సిట్రస్ చెట్ల నుండి సెర్ఛిప్ అనే పేరు వచ్చింది.
సెర్ఛిప్ | |
---|---|
పట్టణం | |
దస్త్రం:Serchhip.jpg | |
Nickname: సెర్కావ్పుయి | |
Coordinates: 23.308996°N 92.856701°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
జిల్లా | సెర్ఛిప్ |
Elevation | 888 మీ (2,913 అ.) |
జనాభా (2011) | |
• Total | 64,875 |
• జనసాంద్రత | 46/కి.మీ2 (120/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | మిజో |
Time zone | UTC+౦5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 796181 |
టెలిఫోన్ కోడ్ | +913838 |
Vehicle registration | ఎంజెడ్-06 |
సమీప పట్టణం | ఐజాల్ |
స్త్రీ పురుష నిష్పత్తి | 976 ♂/♀ |
అక్షరాస్యత | 98.76% |
లోక్‌సభ నియోజకవర్గం | మిజోరాం లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సెర్ఛిప్ |
సివిక్ ఏజెన్సీ | గ్రామ కౌన్సిల్ |
సెర్ఛిప్ పట్టణం 23.3°N 92.83°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[1] ఇది సముద్రమట్టానికి 888 మీటర్లు (2,913 అడుగులు) ఎత్తులో ఉంది. మాట్ నది, టుయికుమ్ నదుల మధ్య ఉన్న సెర్ఛిప్ పట్టణానికి టుయికుమ్ నది నుండి త్రాగునీరు, మాట్ నది నుండి సాగునీరు అందుతోంది. పట్టణ వార్షిక ఉష్ణోగ్రతలు 34-10 డిగ్రీల వరకు ఉంటుంది
2011 భాతర జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 64,875 మంది జనాభా ఉన్నారు. ఇందులో 32,824 మంది పురుషులు, 32,051 మంది స్త్రీలు ఉన్నారు. 2001నాటి జనాభాతో పోలిస్తే జనాభా పెరుగుదలలో 20.45 శాతం మార్పు ఉంది.
ఈ పట్టణంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది. ఈ పట్టణానికి సమీపంలో మాట్ నది లోయ ఉన్నందువల్ల క్యాబేజీ, ఆవపిండిలకు పంటలకు పేరొందింది.
ఇక్కడ పవన్ హన్స్ (హెలికాప్టర్ సర్వీస్ సంస్థ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి.[2] ఈ పట్టణం 54వ జాతీయ రహదారి ద్వారా సిల్చార్ కు, 40వ జాతీయ రహదారి ద్వారా అగర్తలాకు, 150వ జాతీయ రహదారి ద్వారా ఇంఫాల్‌కు కలుపబడుతోంది. ఇక్కడ బస్సు, టాక్సీ, ఆటోరిక్షాలతో రవాణా సౌకర్యం ఉంది.
ఇక్కడ మలేరియా, కాన్సర్ వంటి ప్రజారోగ్య సమస్యలు ఉన్నాయి. అంగన్వాడి కేంద్రాల నుండి శిశువులు, పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య, పోషక పదార్ధాలను అందిస్తున్నారు.
ఇది ఇక్కడి ప్రజలకు కొత్త ఆట. 2020లో ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సెర్ఛిప్ పట్టణంలో ఇంటర్నేషనల్ పారాగ్లైడింగ్ ఛాంపియన్షిప్ జరిగింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.