Remove ads
From Wikipedia, the free encyclopedia
సెయింట్ మేరీస్ చర్చిగా పిలువబడే బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అస్సంప్షన్ సికిందరాబాదులో నెలకొన్న క్రైస్తవ ప్రార్థనామందిరం. ఈ చర్చి 2008 నవంబరు 7వ తేదీన బసిలికా స్థాయిని పొందింది. ఈ చర్చి సికిందరాబాదు సరోజినీదేవి రోడ్డులో ఉంది. 1850లో ఈ చర్చి నిర్మాణం పూర్తి అయ్యింది. మొదట ఈ చర్చిని కాథడ్రల్ ఆఫ్ ఆర్కిడయోసిస్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవారు.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
బాసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అస్సంప్షన్ | |
---|---|
మతం | |
Ecclesiastical or organizational status | బసిలికా |
ప్రదేశం | |
ప్రదేశం | సికిందరాబాదు, తెలంగాణ |
దేశం | భారతదేశం |
భౌగోళిక అంశాలు | 17.4421°N 78.5022°E |
ఈ చర్చిని బ్రిటిష్ ఆర్మీలోని ఐరిష్ కాథలిక్కుల కోసం ఫాదర్ డేనియల్ మర్ఫీ ప్రారంభించాడు.[2]అతడు 1839లో భారతదేశానికి వచ్చి ఈ చర్చిని 1840లో నిర్మించడం ఆరంభించాడు. ఈ చర్చి నిర్మాణం 1850లో పూర్తి అయింది. మేరీ మాతకు అంకితం చేయబడిన ఈ చర్చి హైదరాబాద్ స్టేట్ లో ఆ సమయంలో అతి పెద్దదిగా పేరుగడించింది.[2] ఇది 1886 వరకు కాథడ్రల్ చర్చిగా ఉన్నది. 1871లో ఇటలీ దేశపు టురిన్ పట్టణం నుండి వచ్చిన క్రైస్తవ సన్యాసినులు ఇక్కడ ఈ చర్చికి అనుబంధంగా సెయింట్ ఆన్స్ హైస్కూలును ప్రారంభించారు. ఈ చర్చి 2008 నవంబరు 7వ తేదీన 'బసిలికా' గుర్తింపు పొందింది.
భారతీయ గోతిక్ వాస్తు శైలికి ఒక ఉదాహరణగా ఈ చర్చి భవనం నిలుస్తుంది. వొంపైన కమానులతో, మొనదీరిన అంటుగోడలతో ఈ చర్చి చూపరులను ఆకర్షిస్తుంది. మిగిలిన కాథలిక్ రోమన్ చర్చిలవలె ఈ చర్చి కూడా అనేక సెయింట్ల పేరు మీద దైవపీఠాలు ఉన్నాయి.
ఈ చర్చిలో 1901లో ఇటలీ దేశం నుండి తెప్పించబడిన నాలుగు గంటలు ఉన్నాయి.[3] వాటిలో ఒక గంటకు పగుళ్లు వచ్చాయి.[3]
ప్రతి దినము సమావేశం ఇంగ్లీషులో ఉదయం 6.గం. సాయంత్రం 6. గం. ఆదివారం సమావేశాలు:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.