From Wikipedia, the free encyclopedia
సెయింట్ జాన్ చర్చి ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్న క్రైస్తవ ప్రార్థనామందిరం. సెయింట్ జాన్ ది బాపిస్టు అనే వ్యక్తి పేరుమీద 1813లో నిర్మించిన ఈ చర్చి, సికిందరాబాదు ప్రాంతంలో ఉన్న పురాతన చర్చీల్లో ఒకటిగా పేరొందింది.[1][2] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
సెయింట్ జాన్ చర్చి | |
---|---|
మతం | |
Ecclesiastical or organizational status | బసిలికా |
ప్రదేశం | |
ప్రదేశం | ఈస్ట్ మారేడుపల్లి, సికిందరాబాదు, తెలంగాణ |
దేశం | భారతదేశం |
బ్రిటీషుకాలంలో సికిందరాబాదు ప్రాంతంలో ఉన్న మిలటరీ సైనికాధికారులకోసం ఈ చర్చి ఏర్పాటు చేయబడింది. సికిందరాబాదుకు చెందిన దివాన్ బహదూర్ సేఠ్ రామ్ గోపాల్ అనే వ్యక్తి ఈ చర్చి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాడని స్థానికుల అభిప్రాయంతోపాటు, అక్కడి శిలాఫలకాల ద్వారా కూడా తెలుస్తుంది.[3] దీని నిర్వహణకోసం లండన్ నుండి చర్చి పెద్దలను నియమించేవారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఉంటున్న బ్రిటీషు సైనికాధికారులను మాత్రమే చర్చిలోకి అనుమతించేవారు. చాలాకాలం వరకు విదేశి క్రైస్తవులే పరిమిత సంఖ్యలో ప్రవేశం ఉండేది.[4]
క్రీస్తు శిలువ ఆకారంలో ఉన్న ఈ చర్చి, ఇండో-యూరోపియన్ శైలీలో నిర్మించబడింది.[5] చర్చీ లోపల రంగూన్ టేకుతో చేసిన దాదాపు 30 అడుగుల పొడవుగల బెంచీలు, ఇతర సామాగ్రి ఉన్నాయి.
1914 సంవత్సరం వరకు ఈ చర్చికి విద్యుత్ సౌకర్యం లేదు. 1918లో ఎలక్ట్రిక్ లైట్లు, ఫ్యానులు ఏర్పాటుచేయబడ్డాయి. పురాతన సాంప్రదాయ నిర్మాణాలకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ చర్చి 1998లో వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.