సుష్మితా సేన్

From Wikipedia, the free encyclopedia

సుష్మితా సేన్

సుష్మితా సేన్ (ఆంగ్లం: Sushmita Sen) 1994లో విశ్వ సుందరి (Miss Universe) పోటీలో విజేతగా ఎన్నుకొనబడి ప్రసిద్ధికెక్కింది. ఈమె కొన్ని హిందీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది. ఈమె 1975 నవంబరు 19న హైదరాబాదులో జన్మించింది. ఈమె మాతృభాష బెంగాలీ. తండ్రి షుబీర్ సేన్ భారత వాయు సేనలో వింగ్ కమాండర్‌గా పనిచేశాడు. తల్లి శుభ్రా సేన్ ఒక ఫ్యాషన్ డిజైనర్. హైదరాబాదులో జన్మించిన సుష్మిత విద్యాభ్యాసం ఢిల్లీలో సాగింది. 1994లో తన 18వ యేట భారత సుందరి పోటీలలో సుష్మిత మొదటి స్థానం గెలుచుకొంది. అప్పుడు రెండవ స్థానం పొందిన ఐశ్వర్య రాయ్ అదే సంవత్సరం ప్రపంచ సుందరి పోటీలో మొదటి స్థానం పొందింది. ఆ విధంగా ఒకే సంవత్సరం ఇద్దరు భారతీయ వనితలు "ప్రపంచ సుందరి", "విశ్వ సుందరి" పోటీలలో మొదటి స్థానాలు సంపాదించారు.

త్వరిత వాస్తవాలు సుష్మితా సేన్, జననం ...
సుష్మితా సేన్
Thumb
2012 నవంబర్ లో జరిగిన ఇగ్నైట్ ఫ్యాషన్ షోలో హొయలు ఒలికిస్తున్న సుస్మిత
జననం (1975-11-19) 19 నవంబరు 1975 (age 49)
హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, భారతదేశము[1]
వృత్తినటి, రూపదర్శి
పూర్వ విద్యార్థిసెయింట్ ఆన్స్ హైస్కూలు, సికిందరాబాదు
క్రియాశీలక సంవత్సరాలు1994–ఇప్పటి వరకు
ఎత్తు5 అ. 9 అం. (1.75 మీ.)[2]
పిల్లలురెనీ సేన్
అలీషా సేన్
మూసివేయి

సుష్మితా సేన్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా 2013లో మదర్ థెరిసా అంతర్జాతీయ అవార్డు పొందింది.[3]

సుస్మితా సేన్ నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.