కర్ణాటకకు చెందిన సినిమా నటి. From Wikipedia, the free encyclopedia
సులోచన లట్కర్ (1928 జూలై 30 - 2023 జూన్ 4), కర్ణాటకకు చెందిన సినిమా నటి. మరాఠీలో 50 సినిమాలలో, హిందీలో దాదాపు 250 సినిమాలలో నటించింది. ససుర్వాస్ (1946), వాహినిచ్యా బంగ్ద్య (1953), మీత్ భాకర్, సంగ్త్యే ఐకా (1959), ధక్తి జౌ వంటి మరాఠీ సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించి గుర్తింపు పొందింది.[1] అలాగే తల్లి పాత్రలలో నటించి బాగా పేరు సంపాదించింది.
సులోచన లట్కర్ 1946లో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. 1946 నుండి 1961 వరకు మరాఠీ సినిమాలో ప్రధానపాత్రలు పోషించింది. ఆ తరువాత తల్లి పాత్రలలో నటించింది. 2003లో ఆధునిక మరాఠీ సినిమా వ్యవస్థాపకులలో ఒకరైన బాబూరావు పెయింటర్ జయంతి సందర్భంగా అఖిల భారతీయ మరాఠీ చిత్రపట్ మహామండల్ స్థాపించిన చిత్రభూషణ్ అవార్డు అందుకుంది.[2]
ప్రస్తుతం ముంబైలోని ప్రభాదేవిలో నివసిస్తోంది.[5] సులోచనకు 14 ఏళ్ళ వయసులో వివాహం జరిగింది. సులోచన కుమార్తె పేరు కంచన్ ఘనేకర్, మరాఠీ రంగస్థల సూపర్ స్టార్ డాక్టర్ కాశీనాథ్ ఘనేకర్ భార్య.[6]
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | భాష |
1957 | అబ్ దిల్లీ దుర్ నహిన్ | బేలా | హిందీ |
1959 | సంగ్తే ఐకా | సఖారామ్ భార్య | మరాఠీ |
1959 | దిల్ దేకే దేఖో | జమున | హిందీ |
1961 | సంపూర్ణ రామాయణ | కైకేయి | హిందీ |
1963 | మోల్కారిన్ | గయాబాయి | మరాఠీ |
1963 | బాందిని | హిందీ | |
1964 | మరాఠా టిటుకా మేల్వావా | జీజాబాయి | మరాఠీ |
1965 | సాధి మాన్సే | మరాఠీ | |
1965 | గోవాలో జోహార్-మెహమూద్ | హిందీ | |
1966 | దేవర్ | శకుంతల ఎం. సింగ్ | హిందీ |
1967 | నై రోష్ని | ప్రకాష్ తల్లి | హిందీ |
1968 | ఎకటీ | మధు తల్లి | మరాఠీ |
1968 | సంఘుర్ష్ | శంకర్ భార్య | హిందీ |
1968 | సరస్వతీచంద్ర | కుముద్ తల్లి | హిందీ |
1968 | ఆద్మీ | శేఖర్ తల్లి | హిందీ |
1969 | సంబంధ్ | సుమతి | హిందీ |
1970 | కటి పతంగ్ | శ్రీమతి దీనానాథ్ | హిందీ |
1970 | జానీ మేరా నామ్ | సోహన్, మోహన్ తల్లి | హిందీ |
1970 | మెయిన్ సుందర్ హూన్ | సుందర్ తల్లి | హిందీ |
1972 | దిల్ దౌలత్ దునియా | అతిథి స్వరూపం | హిందీ |
1973 | కహానీ కిస్మత్ కీ | శ్రీమతి శర్మ | హిందీ |
1974 | కోరా కాగజ్ | సుకేష్ అత్త | హిందీ |
1974 | మజ్బూర్ | శ్రీమతి ఖన్నా | హిందీ |
1974 | కసౌతి | సప్నా తల్లి | హిందీ |
1978 | ముకద్దర్ కా సికందర్ | విశాల్ తల్లి | హిందీ |
1978 | ఆజాద్ | సరళ | హిందీ |
1980 | ఆశా | జీతేంద్ర తల్లి | హిందీ |
1982 | ఏక్ దావ్ భూతాచా | రాధా మావాషి | మరాఠీ |
1983 | జరా సి జిందగీ | రాకేష్ తల్లి | హిందీ |
1983 | హిమ్మత్ వాలా | దాడిమా | హిందీ |
1984 | ఫుల్వారి | రాజీవ్ తల్లి | హిందీ |
1984 | అందర్ బాహర్ | రవి తల్లి | హిందీ |
1984 | సాసు వర్చాద్ జవై | అశోక్ సరాఫ్ తల్లి | మరాఠీ |
1985 | గులామి | రంజిత్ చౌదరి తల్లి | హిందీ |
1986 | కాలా దండ గోరే లాగ్ | హిందీ | |
1988 | ఖూన్ భారీ మాంగ్ | జెడి తల్లి | హిందీ |
సులోచన లత్కర్ వయోవృద్ధ సమస్యలతో బాధపడుతూ దాదార్లోని శుశృత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 జూన్ 4న మరణించింది.[7][8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.