Remove ads
సిక్కిం లోని జిల్లాలు From Wikipedia, the free encyclopedia
భారత రాష్ట్రమైన సిక్కింలో 6 (2023 నాటికి) జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలను కేంద్ర ప్రభుత్వం నియమించిన జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు. వీరు జిల్లాల పౌర ప్రాంతాల పరిపాలనకు బాధ్యత వహిస్తారు. సిక్కిం రాష్ట్రం సున్నితమైన సరిహద్దు ప్రాంతం కావడంతో భారత సైన్యం ఎక్కువ ప్రాంతంపై నియంత్రణ కలిగి ఉంది. అనేక ప్రాంతాలు పరిమితం చేయబడ్డాయి. వాటిని సందర్శించడానికి అనుమతులు అవసరం ఉంటుంది. సిక్కింలో మొత్తం ఎనిమిది పట్టణాలు, తొమ్మిది ఉప విభాగాలు ఉన్నాయి.
2021 డిసెంబరు 21న, సిక్కిం ప్రభుత్వం 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న 4 జిల్లాల పేర్లను మారుస్తున్నట్లు ప్రకటించింది. సిక్కిం ప్రభుత్వం ఉత్తర సిక్కిం జిల్లాను ఇప్పుడు మంగన్ జిల్లా, పశ్చిమ సిక్కిం జిల్లాను గ్యాల్షింగ్ జిల్లా, తూర్పు సిక్కిం జిల్లాను, గాంగ్టక్ జిల్లా, దక్షిణ సిక్కిం జిల్లాను, నాంచి జిల్లా అనే పేర్లుతో అధికారికంగా మార్చింది. [1]
ఆరు జిల్లాలు జాబితా
వ.సంఖ్య |
కోడ్[2] |
జిల్లా[3] |
ముఖ్య పట్టణం |
జనాభా (2011) |
విస్తీర్ణం |
జనసాంద్రత [3] |
ప్రభుత్య వెబ్సైట్ |
జిల్లా పటం |
1 | ES | గాంగ్టక్ జిల్లా | గాంగ్టక్ | 281,293 | 954 | 295 | ||
2 | NS | మంగన్ జిల్లా | మాంగన్ | 43,354 | 4,226 | 10 | ||
3 | PS | పాక్యోంగ్ జిల్లా | పాక్యోంగ్ | 74,583 | 404 | 180 | ||
4 | SGS | సోరెంగ్ జిల్లా | సోరెంగ్ | 64,760 | 293 | 221 | ||
5 | SS | నాంచి జిల్లా | నాంచి | 146,742 | 750 | 196 | ||
6 | WS | గ్యాల్షింగ్ జిల్లా | గ్యాల్షింగ్ | 136,299 | 1,166 | 117 | ||
IN-SK | సిక్కిం | గాంగ్టక్ | 610,577 | 7,096 | 86 | |||
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.