Remove ads
సిక్కిం రాష్ట్రంలోని ఉత్తర సిక్కిం జిల్లా ముఖ్య పట్టణం. From Wikipedia, the free encyclopedia
మంగన్, సిక్కిం రాష్ట్రంలోని ఉత్తర సిక్కిం జిల్లా ముఖ్య పట్టణం. సిక్కిం రాజధాని గాంగ్టక్ నగరానికి 65 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం రహదారి మార్గం ద్వారా కలుపబడి ఉంది. విస్తీర్ణం ప్రకారం సిక్కిం రాష్ట్రంలో ఇది అతిపెద్ద జిల్లా. జిల్లాగా మారిన తరువాత, సేంద్రీయ వ్యవసాయం కారణంగా మంగన్ పట్టణం ఆర్ధికవ్యవస్థలో పురోగతి సాధించింది. ఈ పట్టణం ఉత్తరాన ఉన్న లాచుంగ్, చుంగ్తాంగ్, లాచెన్ పట్టణాలకు కూడా సేవలు అందిస్తోంది. ఎత్తులో ఉన్న ఈ పట్టణం సమశీతోష్ణ వాతావరణాన్ని కలిగి ఉంటుంది.
మంగన్ | |
---|---|
Coordinates: 27.52°N 88.53°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | సిక్కిం |
జిల్లా | ఉత్తర సిక్కిం |
Government | |
• Type | నగర పంచాయితీ |
Elevation | 956 మీ (3,136 అ.) |
జనాభా (2011) | |
• Total | 4,644 |
భాషలు | |
• అధికారిక | నేపాలీ, నేపాలీ, భూటియా, లెప్చా, లింబు, నెవారి, రాయ్, గురుంగ్, మంగర్, షెర్పా, తమంగ్, సున్వర్ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఎస్ కె-03 |
మంగన్ పట్టణం 27.52°N 88.53°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[1] సముద్రమట్టానికి 956 మీటర్ల (3,136 అడుగుల) ఎత్తులో ఉంది.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] మంగన్ పట్టణంలో 4,644 జనాభా ఉంది. ఈ జనాభాలో 55% మంది పురుషులు, 45% మంది స్త్రీలు ఉన్నారు. మంగన్ సగటు అక్షరాస్యత రేటు 83.81% కాగా, రాష్ట్ర సగటు 81.42% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 87.80% కాగా, స్త్రీ అక్షరాస్యత 79.34% గా ఉంది.
ఇక్కడ అనేక సాంస్కృతిక ఆకర్షణలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వాటిల్లో లాబ్రాంగ్ మొనాస్టరీ, ఫోడాంగ్ గొంప, రోంగ్ లుంగ్టెన్ లీ మ్యూజియం ముఖ్యమైనవి. దట్టమైన అడవి మధ్యలో జొంగ్ మౌంట్ ప్రాంతం ఉంటుంది. ప్రతిఏటా డిసెంబరు నెలలో మూడు రోజులపాటు సంగీత ఉత్సవం నిర్వహించబడుతోంది. సిక్కింలోనే పేరొందిన సంగీత బృందాలు వచ్చి ఇక్కడి వేదికపై ప్రదర్శన ఇస్తాయి. ఈ వేడుకలో స్థానిక హస్తకళల ప్రదర్శన, ఫుడ్ ఫెస్టివల్, సాంప్రదాయ సాంస్కృతిక సంగీతం, నృత్య ప్రదర్శన వంటి కార్యక్రమాలు ఉంటాయి.[3]
దీనిని భారతదేశం యొక్క ఏలకులు రాజధాని అని కూడా పిలుస్తారు.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.