ఆంధ్ర ప్రదేశ్, కాకినాడ జిల్లా, సామర్లకోట మండలం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
సామర్లకోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా, సామర్లకోట మండలానికి చెందిన పట్టణం, మండలకేంద్రం. ఇది ప్రముఖ రైల్వే జంక్షన్ కూడా. ఇక్కడ గల పంచారామాలలో ఒకటైన కుమారభీమారామం ప్రముఖ పర్యాటక ఆకర్షణ.
పట్టణం | |
Coordinates: 17.1°N 82.2°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ జిల్లా |
మండలం | సామర్లకోట మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 14.88 కి.మీ2 (5.75 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 56,864 |
• జనసాంద్రత | 3,800/కి.మీ2 (9,900/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1023 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8852 ) |
పిన్(PIN) | 533440 |
Website |
ఈ వూరి అసలు పేరు శ్యామలదేవికోట. రాను రాను ఈ పేరు మారి శ్యామలకోట, సామర్లకోట అయ్యింది. ఒకప్పుడు ఇక్కడ శ్యామలాంబ గుడి వుండేదట. పెద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో రాయబడిన కైఫియత్తు బట్టి అప్పట్లో చామర్లకోటా అని పిలవబడేది అని తెలుస్తుంది.[2]
ఇక్కడ గల కుమారభీమారామాన్ని కుమార భీముడనే చాళుక్య రాజు నిర్మించాడు. ఇక్కడి శివలింగం అలా పెరిగి పోతుంటే పైన మేకు కొట్టారని చరిత్ర.
సామర్లకోట 17.0500°N 82.1833°E.[3] సముద్రమట్టం నుండి సగటు ఎత్తు 9 మీటర్లు (32 అడుగులు). జిల్లాకేంద్రమైన కాకినాడ నుండి వాయవ్యంగా 14 కి.మీ దూరంలో వుంది.
2011) భారత జనగణన ప్రకారం పట్టణ - మొత్తం 1,37,979 - పురుషులు 68,663 - స్త్రీలు 69,316
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం ప్రకారం సామర్లకోట పట్టణం జనాభా 53,402. ఇందులో మగవారు 50%, ఆడవారు 50%. ఇక్కడి సగటు అక్షరాస్యత 60%. అందులో మగవారి అక్షరాస్యత 65%, ఆడువారి అక్షరాస్యత 56%. మొత్తం జనాభాలో 11% వరకు 6 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు.
సామర్లకోట పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
కాకినాడ నుండి జగ్గంపేట, ప్రత్తిపాడు, రాజానగరం, రాజమహేంద్రవరం లకు ముఖ్య రహదారి కూడలి. రాష్ట్ర ముఖ్య రహదారి (సంఖ్య 54) సామర్లకోట మీదుగా పోవుచున్నది. హౌరా -చెన్నై రైలు మార్గంలో సామర్లకోట ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. ఇక్కడినుండి కాకినాడ రైలు మార్గం చీలుతుంది.
పంచారామాలలో ఒకటయిన ఈ కుమారభీమారామం క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తున రెండంతస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం.
సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ద్రాక్షారామ దేవాలయాన్నీ ఆయనే నిర్మించాడు. కనుక ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా, నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది.
ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై సుమారు 922 వరకు సాగింది.ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చేయబడి తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్నిర్మించారు. ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇంకా ఇక్కడి అమ్మవారు బాలా త్రిపుర సుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. 1147 - 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.