సాగర్ (మధ్య ప్రదేశ్)

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం From Wikipedia, the free encyclopedia

సాగర్ (మధ్య ప్రదేశ్)map

సాగర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నగరం. పూర్వం దీన్ని సౌగర్ అనేవారు. ఇది వింధ్య పర్వత శ్రేణిలో సముద్ర మట్టం నుండి 536 మీటర్ల ఎత్తున ఉంది.నగరం రాష్ట్ర రాజధాని భోపాల్కు ఈశాన్యంగా సుమారు 172 కి.మీ. దూరమ్లో ఉంది .

త్వరిత వాస్తవాలు సాగర్ సౌగోర్, దేశం ...
సాగర్
సౌగోర్
నగరం
Thumb
Thumb
సాగర్
Coordinates: 23.83°N 78.71°E / 23.83; 78.71
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాసాగర్
Government
  TypeMayor–Council
  BodySagar Municipal Corporation
విస్తీర్ణం
  Metro
49.763 కి.మీ2 (19.214 చ. మై)
Elevation
427 మీ (1,401 అ.)
జనాభా
 (2011)
  నగరం3,70,296
  జనసాంద్రత232/కి.మీ2 (600/చ. మై.)
భాష
  అధికారికహిందీ[1]
Time zoneUTC+5:30 (IST)
PIN
470001,2,3,4
టెలిఫోన్ కోడ్91 7582
Vehicle registrationMP-15
మూసివేయి

భారత ప్రభుత్వ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఎంపికైన వంద నగరాల్లో సాగర్ ఒకటి. 2018 లో ఇది అత్యంత భద్రమైన నగరాల్లో ఒకటిగా ఎంపికైంది.

వాతావరణం

సాగర్‌లో వేడి వేసవి, కొంత చల్లగా ఉండే రుతుపవనాల కాలం, చల్లని శీతాకాలాలతో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ( కొప్పెన్ క్లైమేట్ వర్గీకరణ Cwa ) ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబరు వరకు ఉండే వర్షాకాలంలో చాలా భారీ వర్షాలు కురుస్తాయి.

మరింత సమాచారం శీతోష్ణస్థితి డేటా - Sagar (1981–2010, extremes 1901–2012), నెల ...
శీతోష్ణస్థితి డేటా - Sagar (1981–2010, extremes 1901–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 33.3
(91.9)
37.3
(99.1)
42.5
(108.5)
44.4
(111.9)
46.4
(115.5)
46.4
(115.5)
41.4
(106.5)
37.6
(99.7)
39.7
(103.5)
39.9
(103.8)
37.7
(99.9)
33.6
(92.5)
46.4
(115.5)
సగటు అధిక °C (°F) 24.7
(76.5)
27.6
(81.7)
33.3
(91.9)
38.3
(100.9)
41.0
(105.8)
37.6
(99.7)
30.9
(87.6)
29.0
(84.2)
30.7
(87.3)
32.2
(90.0)
29.3
(84.7)
26.0
(78.8)
31.7
(89.1)
సగటు అల్ప °C (°F) 11.4
(52.5)
13.8
(56.8)
18.9
(66.0)
23.5
(74.3)
26.3
(79.3)
25.6
(78.1)
23.5
(74.3)
22.8
(73.0)
22.2
(72.0)
20.0
(68.0)
16.3
(61.3)
12.8
(55.0)
19.8
(67.6)
అత్యల్ప రికార్డు °C (°F) 1.7
(35.1)
1.1
(34.0)
7.2
(45.0)
10.6
(51.1)
16.3
(61.3)
13.1
(55.6)
14.5
(58.1)
14.8
(58.6)
16.7
(62.1)
11.3
(52.3)
6.1
(43.0)
2.1
(35.8)
1.1
(34.0)
సగటు వర్షపాతం mm (inches) 12.3
(0.48)
14.1
(0.56)
11.3
(0.44)
4.1
(0.16)
16.9
(0.67)
141.5
(5.57)
343.6
(13.53)
373.7
(14.71)
184.5
(7.26)
22.8
(0.90)
13.5
(0.53)
9.7
(0.38)
1,148
(45.20)
సగటు వర్షపాతపు రోజులు 1.3 1.3 0.9 0.5 1.8 7.3 14.4 14.9 8.8 1.7 0.9 0.9 54.7
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 42 32 24 18 22 46 75 81 69 45 40 43 45
Source: India Meteorological Department[2][3]
మూసివేయి

జనాభా

సాగర్‌లో మతం (2011)[4]

  ఇస్లాం (10.16%)
  జైనమతం (7.28%)
  ఇతరాలు (0.21%)

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సాగర్ నగర జనాభా 2,74,556, అందులో 1,43,425 మంది పురుషులు, 1,31,131 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లలు 32,610 మంది. నగరంలో అక్షరాస్యుల సంఖ్య 2,16,422, ఇది జనాభాలో 78.8%, పురుషుల అక్షరాస్యత 82.6% కాగా, స్త్రీల అక్షరాస్యత 74.6%. సాగర్‌లో ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత రేటు 89.5%, ఇందులో పురుషుల అక్షరాస్యత 93.7% కాగా, స్త్రీలలో 84.8%. షెడ్యూల్డ్ కులాల జనాభా 54,432, షెడ్యూల్డ్ తెగల జనాభా 3,052. సాగర్‌లో 2011 లో 52,833 గృహాలున్నాయి. [5]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.