సర్పయాగం (సినిమా)
From Wikipedia, the free encyclopedia
సర్పయాగం పరుచూరి సోదరులు దర్శకత్వంలో 1991లో విడుదలైన చిత్రం. ఇందులో శోభన్ బాబు, రేఖ ప్రధాన పాత్రలు పోషించారు.[1] ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. విద్యాసాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. ఒక వైద్యుడు తన కూతురికి జరిగిన అన్యాయానికి ఎలా పగ తీర్చుకున్నాడన్నది ఈ చిత్ర కథ.[2] ఈ సినిమాతో నటి రోజా తెలుగు తెరకు పరిచయం అయింది.[3]
సర్పయాగం | |
---|---|
![]() | |
దర్శకత్వం | పరుచూరి సోదరులు |
నిర్మాత | డి. రామానాయుడు |
తారాగణం | శోభన్ బాబు, రేఖ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | నవంబరు 1, 1991 |
భాష | తెలుగు |
కథ
సంఘంలో మంచి పేరు ప్రతిష్టలున్న వ్యక్తి డాక్టర్ వేణుగోపాల్. ఆయన ముద్దుల కూతురు అనసూయ. చిన్నతనంలోనే ఒక అగ్నిప్రమాదంలో తల్లిని కోల్పోవడం వల్ల అనసూయను చాలా గారాబంగా పెంచి పెద్దచేస్తాడు వేణుగోపాల్. ఉన్నత విద్యకోసం మంచి కళాశాలలో చేరుస్తాడు. ఆ కళాశాలలో సీనియర్ విద్యార్థి ఫణి ఆమె మీద మోజు పడతాడు. ఆమెను ప్రేమ పేరుతో వలలో వేసుకుని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేస్తాడు. జరిగిన విషయం చెప్పుకోలేక అనసూయ తండ్రికి తన బాధనంతా ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకుంటుంది. వేణుగోపాల్ చట్టంతో తనకు న్యాయం జరగదని తానే అపరాధులను చంపడానికి హంతకుడిగా మారతాడు.[4]
తారాగణం
- డాక్టర్ వేణుగోపాల్ గా శోభన్ బాబు
- రేఖ
- వాణీ విశ్వనాధ్
- వేణుగోపాల్ కూతురు అనసూయగా రోజా
- శ్రీనివాస వర్మ
- నగేష్
- నూతన ప్రసాద్
- బ్రహ్మానందం
- సుత్తివేలు
- బ్రహ్మాజీ
- రఘునాథ రెడ్డి
- రాజా రవీంద్ర
- జయలలిత
- సాయి కుమార్
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.