పురాతన గ్రంథాలయం. From Wikipedia, the free encyclopedia
సరస్వతి గ్రంథాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు లో ఉన్న పురాతన గ్రంథాలయం. ఇందులో సంస్కృతం, తమిళ, తెలుగు, హిందీ, మరాఠీ, ఇతర భారతీయ భాషల్లో ఉన్న పురాతన తాళపత్ర గ్రంథాల నుంచి అనేక పుస్తకాలు ఉన్నాయి.[1]
తంజావూరు చెన్నై నగరానికి 279 కి.మీ దూరంలో ఉంది. మధ్య చాళుక్యులు ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. సా. శ 1535 - 1673 మధ్య కాలంలో నాయకర్లు తంజావూరును పరిపాలించారు. ఈ గ్రంథాలయం 1777 - 1832 మధ్య కాలంలో జీవించిన తంజావూరు మహారాజు సెర్ఫోజీ II వారసత్వంగా పరిగణించబడుతోంది. ఈయన నాయకర్ల కాలంలో ఏర్పాటైన ఈ గ్రంథాలయాన్ని మరింతగా అభివృద్ధి చేశాడు. ఈయనను మీసు కృష్ణ అయ్యర్ అనే గాయకుడు తాను స్వరపరిచిన ఒక కృతిలో సరస్వతీ నిలయ స్థాపక అని కీర్తించాడు.[2] ఈయన కాలంలోనే తంజావూరు చిత్రకళ, భరతనాట్యం బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.[3]
ఈ గ్రంథాలయంలో తమిళ, తెలుగు, హిందీ, మరాఠీ మొదలైన భారతీయ భాషల్లోని అరుదైన తాళపత్ర గ్రంథాలు, ప్రతులు భద్రపరచబడి ఉన్నాయి. 20 వ శతాబ్దం మొదటి భాగంలో మరాఠీ ప్రతులు రాయడానికి మోడీ అనే లిపి వాడేవారు. అరుదైన ఈ లిపిలో ఉన్న 12000 పత్రాలు ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. ఇక్కడ ఉన్న గ్రంథాలు ఎక్కువగా వ్యాకరణ, వైద్య శాస్త్రాలకు సంబంధించినవి.
Seamless Wikipedia browsing. On steroids.