సయామీఖేర్

From Wikipedia, the free encyclopedia

సయామీఖేర్

సయామీఖేర్‌ (ఆంగ్లం: Saiyami Kher) తెలుగులో రేయ్‌ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన భారతీయ నటి. హిందీ, మరాఠీ చిత్రాలలోనూ పనిచేస్తుంది.

త్వరిత వాస్తవాలు సయామీఖేర్, జననం ...
సయామీఖేర్
Thumb
2020లో సయామీఖేర్
జననం1992/1993 (age 31–32)
నాసిక్, మహారాష్ట్ర, భారతదేశం
విద్యాసంస్థసెయింట్. జేవియర్స్ కాలేజ్, ముంబై
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2013 - ప్రస్తుతం
తల్లిదండ్రులుఅద్వైత్ ఖేర్, ఉత్తరా మాత్రే ఖేర్‌
బంధువులు ఉషా కిరణ్ (అమ్మమ్మ)
మమతా కులకర్ణి
మూసివేయి

ప్రారంభ జీవితం

సయామీఖేర్ మాజీ మిస్ ఇండియా అయిన అద్వైత్ ఖేర్,[1] ఉత్తరా మాత్రే ఖేర్‌లకు జన్మించింది. ఆమె నటి ఉషా కిరణ్ మనవరాలు, అలాగే తన్వి అజ్మీ మేనకోడలు.

కెరీర్

2015లో తెలుగు చిత్రం రేయ్‌తో రంగప్రవేశం చేసిన సయామీఖేర్, ఆ తర్వాత సంవత్సరంలో హర్షవర్ధన్ కపూర్ సరసన రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా పంజాబీ జానపద కథ మీర్జా సాహిబాన్ ఆధారిత హిందీ చిత్రం మిర్జ్యాలో కనిపించింది.[2] ఆమె 2020లో అభిషేక్ బచ్చన్‌తో కలిసి మయాంక్ శర్మ వెబ్ సిరీస్ బ్రీత్‌లో కనిపించింది. ఆమె వైల్డ్ డాగ్ (2021 సినిమా)లో నాగార్జున అక్కినేనితో NIA ఏజెంట్‌గా నటించింది. ఈ చిత్రం థియేటర్లలో ఏప్రిల్ 02, 2021న విడుదలైంది. తర్వాత, ఇది నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో వచ్చింది.

ఫిల్మోగ్రఫీ

సినిమాలు

మరింత సమాచారం సంవత్సరం, సినిమా ...
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర విషయాలు
2015 రేయ్ అమృత తెలుగు
2016 మీరజ్య సుచిత్ర హిందీ
2018 మౌళి రేణుక మరాఠీ
2020 చోక్డ్ సరితా పిళ్లై హిందీ
అన్పాజ్డ్ అయేషా హుస్సేన్
2021 వైల్డ్ డాగ్ ఆర్య పండిట్ తెలుగు
2022 హైవే తెలుగు
మూసివేయి

వెబ్ సిరీస్

మరింత సమాచారం Year, Title ...
Year Title Role Notes
2020 స్పేషల్ OPS జుహీ కశ్యప్
బ్రీత్: ఇన్టు ది షాడోస్ షిర్లీ
మూసివేయి

అవార్డులు

స్టార్‌డస్ట్ అవార్డ్ ఫర్ సూపర్‌స్టార్‌ ఆఫ్ టుమారో – ఫిమేల్ : మిర్జ్యా.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.