సమతామూర్తి
శ్రీ రామానుజ విగ్రహం, ముచ్చింతల, తెలంగాణ From Wikipedia, the free encyclopedia
శ్రీ రామానుజ విగ్రహం, ముచ్చింతల, తెలంగాణ From Wikipedia, the free encyclopedia
స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీ (ఆంగ్లం: Statue of Equality) రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో 11వ శతాబ్దానికి చెందిన హిందూ వేదాంతవేత్త, తత్వవేత్త, సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషిచేసిన శ్రీరామానుజాచార్య స్వామి 1000వ జయంతిని పురస్కరించుకుని సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహాన్ని శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి విరాళాలు సేకరించి ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ 5 ఫిబ్రవరి 2022న వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు.[2] ఇది పంచలోహాలతో రూపొంది, కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది.[3]
స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ | |
అక్షాంశ,రేఖాంశాలు | 17.1860°N 78.3332°E |
---|---|
ప్రదేశం | ముచ్చింతల్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం |
రకం | విగ్రహం |
నిర్మాన పదార్థం | స్టీల్ ఫ్రేమింగ్, పంచలోహ |
ఎత్తు | 65.8 మీటర్లు |
నిర్మాణం ప్రారంభం | 2 మే 2014[1] |
పూర్తయిన సంవత్సరం | 2018 |
ప్రారంభ తేదీ | 5 ఫిబ్రవరి 2022 (వసంత పంచమి) |
అంకితం చేయబడినది | శ్రీరామానుజాచార్య స్వామి |
2013లో ప్రణాళిక అనంతరం 2014 మే నెలలో రామానుజాచార్య సమతా మూర్తి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి, త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో మొదట 14 రాకాల నమూనాలని తయారుచేసి తరువాత నమూనాల సంకలనాన్ని 3డి స్కాన్ ద్వారా సాఫ్ట్వేర్ ఫైల్ తయారు చేశారు. దాని ఆధారంగా చైనాకు చెందిన ఏరో నెస్ కార్పొరేషన్ లో 1600 భాగాలుగా చైనాలో తయారుచేసి ఆ విడిభాగాలను భారతదేశానికి తీసుకువచ్చి ముచ్చింతల్ లోని స్టీల్ కట్టడం పైన నిర్మించారు. దీనికి సుమారుగా 15 నెలల సమయం పట్టింది.[4]
శ్రీరామానుజాచార్య స్వామి 1000వ జయంతిని పురస్కరించుకుని అయన స్మారకార్థం, గౌరవార్థం శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో 200 ఎకరాల్లో వెయ్యికోట్ల ఖర్చుతో 216 అడుగుల హిందూ వేదాంతవేత్త, తత్వవేత్త శ్రీరామానుజాచార్య స్వామి 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ ప్రతిష్ఠాపనలో భాగంగా 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగ క్రతువు నిర్వహించారు.[5]సమతామూర్తి కేంద్రంలో 54 అడుగుల సమతామూర్తి 120 కిలోల స్వర్ణ ప్రతిమను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఫిబ్రవరి 13న ఆవిష్కరించి లోకార్పణం చేశాడు.[6]
శ్రీరామానుజాచార్య విగ్రహావిష్కరణ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఆహ్వాన పత్రికను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,[7] భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ప్రధాని నరేంద్ర మోదీ,[8] కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర టూరిజం శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి , కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విన్ చూబె, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్రమంత్రులు అశ్విని కుమార్ చౌబే, శోభా కరంద్లాజే, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి.వి. శ్రీనివాస్ గౌడ్ తదితరులకు మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్రావు తో కలిసి అందజేశాడు.[9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.