From Wikipedia, the free encyclopedia
సమాజాన్ని సంస్కరించేందుకు పూనుకున్న వ్యక్తిని సంఘసంస్కర్త అంటారు. సమాజంలో గల విభిన్న మతాలకు, వర్గాలకు, భాషలకు, సంస్కృతులకు అతీతంగా మానవుల మధ్య గల ప్రేమ, గౌరవాల భావనలనే "సౌభ్రాతృత్వం" అనే లక్షణాన్ని కలిగి ఉంటాడు. ఇంకనూ ముందుకు సాగి, సర్వమానవ ప్రేమ, మానవకళ్యాణం, విశ్వమానవ సమానత్వం, వసుదైక కుటుంబ భావనలు మున్నగు ఉన్నత భావనలు, సద్-నీతి, ప్రకృతినియమాలు, విశ్వజనీయ మానవసూత్రాలు, సమ్మిళిత సామాజిక స్పృహలు వంటి ఉన్నత విలువలతో కూడిన విశాల దృక్పథానికి పాటు పడతాడు. సంఘసంస్కర్త ఆదర్శవంతుడై ఆదర్శవంతులు తయారవడానికి దోహదపడతాడు.
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
Seamless Wikipedia browsing. On steroids.