From Wikipedia, the free encyclopedia
మార్గదర్శి (Guide) అనగా మార్గాన్ని చూపించేవాడు. మార్గదర్శిని ఆంగ్లంలో గైడ్ అంటారు. మార్గదర్శకుడు తెలియని లేదా తెలిసితెలియని ప్రదేశాలకు వచ్చిన ప్రయాణికులకు, క్రీడాకారులకు లేదా పర్యాటకులకు దారి చూపుచూ వారిని గమ్యస్థానికి చేరుస్తాడు. గైడు పర్యాటకులకు దారి చూపి గమ్యస్థానికి చేర్చినందుకు ఫీజు రూపంలో కొంత డబ్బును తీసుకుంటాడు.
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
టూరిస్ట్ గైడులు పర్యాటక ప్రదేశాలను చూపుచూ దాని చరిత్రను కూడా తెలియజేస్తారు.
మానవుని మంచి వ్యక్తిగా పెంపొందించేందుకు మార్గదర్శకులు కారణమవుతారు. మంచిగా నడిచే జీవితంలో కష్టాలు, నష్టాలు అధికమైనప్పటికి మార్గదర్శకులు తాము నమ్మిన సిద్ధాంతాన్ని విడిచి పెట్టక అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు, ఇతరులకు మార్గదర్శకులు అవుతారు. మహాత్మాగాంధీ ప్రపంచానికి అహింసా మార్గాన్ని బోధించిన మార్గదర్శి. మహాత్మాగాంధీ యొక్క అహింసా సిద్ధాంతానికి అనేక మంది ప్రభావితమయ్యారు. అనేక మంది సంఘసంస్కర్తలు మానవాళికి ఆదర్శప్రాయులుగా వారి జీవితమే ఒక సందేశంగా జీవించారు.
Seamless Wikipedia browsing. On steroids.