దారి
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ From Wikipedia, the free encyclopedia
దారి లేదా మార్గం (Way) అనగా ఒక నిర్ధిష్టమైన త్రోవ చూపేది. సాధారణంగా ఉపయోగించే రహదారి ఇందుకు ఉదాహరణ. దట్టమైన అడవులలో వెళ్లవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ త్రోవలు ఎంత ముఖ్యమైనవో. ఆకాశంలో ప్రయాణించే విమానాలకు, సముద్రంలో ప్రయాణించే నావలకు ఇలాంటి రహదారులు ఏవీ ఉండవు. అయినా దిక్సూచి మూలంగా ఇవి ప్రయాణిస్తాయి.
![Thumb](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a0/Rural_dirt_road_at_Peddipalem_village.jpg/640px-Rural_dirt_road_at_Peddipalem_village.jpg)
మానవ జీవిత ప్రయాణానికి త్రోవ చూపించే వ్యక్తులను సామాన్యంగా మార్గదర్శి అంటారు. ఇక్కడ కూడా ఒక గమ్యాన్ని చూపించడం అంటే నిర్ధిష్టమైన లక్ష్యాన్ని చూపించడం అని అర్ధం.
తెలుగు భాషలో దారి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] దారి అనగా మార్గము A way, road, path. A manner, mode, method. దారికి వచ్చినది అనగా సవ్యంగా నడుచుచున్నది. it is cleared up, it has turned out well, she has come to her senses. (సంస్కృతంలో ధారి) One who bears, ధరించువాడు; ఉదా: జడదారి అనగా జడను ధరించినవాడు. దారిక లంజ, వేశ్య అనగా A harlot. దారికొట్టు అనగా To rob on the high way. దారిబడి అనగా A convoy or guard, an escort.
ఇవి కూడా చూడండి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.