From Wikipedia, the free encyclopedia
సంగమూడి కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
బంటుమిల్లి నుండి, కైకలూరు ల నుండి బస్సు, ఆటోల సౌకర్యం ఉంది.
మండల పరిషత్తు పాఠశాల.
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో కూనసాని వరలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైంది. [1]
గ్రామములోని ఈ పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో, 18 లక్షల రూపాయల గ్రామస్థుల, భక్తుల విరాళాలతో, నూతన ఆలయాన్ని నిర్మించారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ, శ్రీరాములవారల విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2017, మార్చి-12,13తేదీలలో ప్రతిష్ఠా విగ్రహాలకు, గ్రామోత్సవాలు నిర్వహించారు. ఆలయంలో, 14వతేదీ మంగళవారం, 15వతేదీ బుధవారంనాడు వైభవంగా విగ్రహ, శిఖర ప్రతిష్ఠా మహోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళ, బుధవారాలలో ఆలయంలో ప్రత్యేకపూజలు, హోమాలు నిర్వహించారు. విగ్రహప్రతిష్ఠా మహోత్సవాల అనంతరం భారీగా అన్నసమారాధన చేసారు. [2]&[3]
సంగమూడి గ్రామములో జరుగుచున్న శ్రీ గంగానమ్మ తల్లి జాతర 2015ఆగష్టు-23వ తేదీ ఆదివారంతో ముగిసినది. పొలాలలోమున్న అమ్మవారికి గ్రామస్థులు ఉదయం నుండి మేళతాళాలు, డప్పునృత్యాలతో, వేడి నైవేద్యాలు సమర్పించారు. పసుపు, కుంకుమలతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ వీధులలో జాతర నిర్వహించారు. భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. జాతరలో గ్రామస్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
Seamless Wikipedia browsing. On steroids.